రఘువీర్‌ చౌదరికి ‘ఎన్టీఆర్‌’ పురస్కార ప్రదానం నేడు | Raghuveer Chowdhary has been awarded 'NTR' award today | Sakshi
Sakshi News home page

రఘువీర్‌ చౌదరికి ‘ఎన్టీఆర్‌’ పురస్కార ప్రదానం నేడు

Published Sun, May 28 2017 1:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రఘువీర్‌ చౌదరికి ‘ఎన్టీఆర్‌’ పురస్కార ప్రదానం నేడు - Sakshi

రఘువీర్‌ చౌదరికి ‘ఎన్టీఆర్‌’ పురస్కార ప్రదానం నేడు

సాక్షి, హైదరాబాద్‌: స్వర్గీయ ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయన పేరు మీద ఇచ్చే జాతీయ సాహితీ పురస్కారాన్ని జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ రఘువీర్‌ చౌదరికి ప్రదానం చేయనున్నట్లు ఎన్టీఆర్‌ విజ్ఞాన ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎన్‌. లక్ష్మీపార్వతి తెలిపారు. శనివారం ఆమె సాక్షితో మాట్లాడూతూ.. పురస్కారంతో పాటు రూ.లక్ష నగదు అందజేయనున్నట్లు చెప్పారు.

ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి. శివశంకరరావు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి, బిహార్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి తదితరులు పాల్గొంటారని వివరించారు. ఆదివారం(నేడు) సాయంత్రం 5.30కి రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో పురస్కారం ప్రదానం చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement