‘బంధుత్వాలు కలుపుకుని మోసం’ | Rahul Gandhi, raebareli, Elections-2017, రాహుల్ గాంధీ, రాయబరేలీ, యూపీ ఎన్నికలు | Sakshi
Sakshi News home page

‘బంధుత్వాలు కలుపుకుని మోసం’

Published Tue, Feb 21 2017 2:00 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

‘బంధుత్వాలు కలుపుకుని మోసం’ - Sakshi

‘బంధుత్వాలు కలుపుకుని మోసం’

రాయబరేలీ: ఎక్కడికి వెళ్లినా బంధుత్వాలు కలుపుకుని మోసం చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి అలవాటైందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మంగళవారం రాయబరేలీలో ఆయన ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీ పాలనలో రైతులు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

రుణమాఫీ చేయడానికి ప్రధాని వద్ద డబ్బులు లేవు కానీ.. రూ. 12 వందల కోట్ల రుణాలిచ్చి విజయ్‌ మాల్యాకు విదేశాలకు పంపారని ఆరోపించారు. తమపై మోదీ చేసిన విమర్శలను పట్టించుకోనని అన్నారు. పేదలు, రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement