మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆదివారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్ వీస్ ను కలిశారు.
ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆదివారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్ వీస్ ను కలిశారు. అహ్మదానగర్ జిల్లా పతార్డి తాలుకాలోని జవఖేదా గ్రామంలో గత నెల 21న జరిగిన ముగ్గురు దళితుల హత్యపై విచారణ జరిపించాలని సీఎంను ఠాక్రే కోరారు.
ఈ విషయంలో వ్యక్తిగతంగా కలుగజేసుకుని హంతకులను చట్టం ముందు నిలబెట్టేందుకు ప్రయత్నించాలని కోరారని ఫడణ్ వీస్ తో భేటీ తర్వాత ఠాక్రే వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తనకు ముఖ్యమంత్రి హామీయిచ్చారని తెలిపారు. ముగ్గురు దళితుల హత్యపై దర్యాప్తు చేపట్టాలని శనివారం రాష్ట్ర డీజీపీని ఫడణ్ వీస్ ఆదేశించారు.