ఆర్బీఐ ఇలా చేస్తోందట! | RBI changing rules like PM Modi changes clothes: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ ఇలా చేస్తోందట!

Published Tue, Dec 20 2016 5:04 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

ఆర్బీఐ ఇలా చేస్తోందట!

ఆర్బీఐ ఇలా చేస్తోందట!

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్  గాంధీ  మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన దాడిని ఎక్కుపెట్టారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రధాని పై వరుస విమర్శలు కురిపిస్తున్న రాహుల్ మంగళవారం  ట్విట్టర్  అందుకున్నారు.  అయితే ఈ సారి మోదీ, ఆర్ బీఐకి చర్యలపై తన ట్వీట్టర్ లోవిమర్శలు గుప్పించారు.   అటు మోదీపై, ఇటు ఆర్బీఐపై విసుర్లు విసురుతూ ట్వీట్ చేశారు.  ప్రధాని తన దుస్తులు మార్చినట్టుగా ఆర్‌బీఐ ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలు మార్చుతోందన్నారు.

పీఎం దుస్తులు మార్చుకున్నంత లేలిగ్గా ఆర్బీఐ నిమిష నిమిషానికో నిబంధన మార్చుకుంటూ పోతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు  తన ట్వీట్‌లో ఆర్బీఐ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన వివిధ విధానాలపై వచ్చిన ఓ ఆర్టికల్‌ను లింక్ చేశారు. పలు ర్యాలీల్లో ప్రసంగించేందుకు రోజంతా దుస్తులు మారుస్తూ పోయే మోదీలాగే రిజర్వ్ బ్యాంక్ కూడా నిబంధనలను మార్చుతూ పోతోందని చురకలంటించారు.

మరోవైపు తాజా ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ పై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కూడా ట్వీట్ చేశారు.  ప్రభుత్వం ముందే వాగ్దానం చేసినట్టుగా డిసెంబర్ 30 వరకు ప్రజలు రద్దయిన నోట్లను ఎందుకు డిపాజిట్  చేసుకోకూడదని ప్రశ్నించారు.  డిసెంబర్  17 నాటి ప్రభుత్వ  గెజిట్ నోటిఫికేషన్ లో  రూ. 5వేలకు పైన డిపాజిట్లపై ఆంక్షలను  ఆయన  తప్పు బట్టారు.  బడాబాబులు, అక్రమార్కులు పాత నోట్లను రద్దు చేసుకున్నారనీ, కేవలం పేద మధ్యతరగతి ప్రజలే ఇబ్బందులు పడుతున్నారంటూ వరుస ట్వీట్లలో  విమర్శించారు.
కాగా   గత వారం పార్లమెంటులో ప్రధానిని కలిసి రైతుల రుణాలు మాఫీ చేయాల్సిందిగా కోరిన రాహుల్...బహిరంగ సభల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, రైతులు, పేదల కడగండ్లను మోదీ పట్టించుకోవడం లేదంటూ నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement