ర్యాలీకి బ్రేక్: ఫెడ్ నిర్ణయంపై ఎదురుచూపులు
Published Wed, Mar 15 2017 9:41 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM
ముంబై : బీజేపీ ఘన విజయంతో నిన్నటి ట్రేడింగ్ లో దుమ్మురేపిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల ఫెడరల్ రిజర్వు పాలసీ మీటింగ్ నిర్ణయం నేడు వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లు ర్యాలీకి బ్రేకిచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 10.62 పాయింట్ల లాభంలో 29,453 వద్ద, నిఫ్టీ 1.90 పాయింట్ల లాభంలో 9,088 వద్ద ట్రేడవుతున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, సన్ ఫార్మా, టాటా మోటార్స్, విప్రో, హిందాల్కో, అరబిందో ఫార్మాలు ట్రేడింగ్ ప్రారంభంలో లాభపడగా... భారతీ ఎయిర్ టెల్, లార్సెన్ అండ్ టూబ్రో, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ నష్టాలు గడించాయి.
అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడి 65.76 వద్ద ప్రారంభమైంది. మంగళవారం ట్రేడింగ్ లో రూపాయి 16 నెలల గరిష్టంలో 66.82 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లు నేటి అర్థరాత్రి విడుదల కాబోయే ఫెడ్ రిజర్వుపై ఎక్కువగా దృష్టిసారించారని విశ్లేషకులంటున్నారు. ఈ కారణంతోనే ర్యాలీకి బ్రేక్ పడ్డట్టు చెబుతున్నారు.
Advertisement
Advertisement