
'షేమ్ ఫుల్.. క్షమాపణ చెప్పండి'
ధోని ఆధార్ కార్డు సమాచారాన్ని బహిర్గతం చేసిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆధార్ కార్డు సమాచారాన్ని బహిర్గతం చేసిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ధోనికి మరో ఆధార్ కార్డు ఇవ్వాలని సూచించారు.
'ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్... ధోని కార్డు వివరాలు లీక్ చేశారు. ఇది అవమానకరం. మంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలి. ధోనికి మరో ఆధార్ కార్డు మంజూరు చేయాలి. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన పని ధోని భార్య సాక్షి సింగ్ కు కోపం తెప్పించింద'ని దిగ్విజయ్ సింగ్ ట్విటర్ లో పేర్కొన్నారు.
ధోనీ తన ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో మంత్రి రవిశంకర్ ప్రసాద్ పై సాక్షి సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.