'షార్ప్' తొలి ఆండ్రాయిడ్ వన్ ఇదేనట.. | Sharp Aquos 507SH Launched as Japan's First Android One Phone | Sakshi
Sakshi News home page

'షార్ప్' తొలి ఆండ్రాయిడ్ వన్ ఇదేనట..

Published Thu, Jul 7 2016 1:00 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

Sharp Aquos 507SH Launched as Japan's First Android One Phone

జపనీస్ కంపెనీ షార్ప్ తన మొదటి ఆండ్రాయిడ్ వన్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. అక్వోస్ 507ఎస్ హెచ్ పేరుతో ఈ ఫోన్ ను, తన దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. షార్ప్ విడుదల చేసిన ఈ ఫోన్, గూగుల్ సహకారంతో రూపొందిన మొదటి జపాన్ ఆండ్రాయిడ్ వన్. అయితే ఈ ఫోన్ ధరలను ఇంకా కంపెనీ వెల్లడించలేదు. ఈ నెల నుంచి జపాన్ లో ఈ ఫోన్ అమ్మకాలు నిర్వనించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఆండ్రాయిడ్ అప్ డేట్స్ కోసం 18 నెలల గ్యారెంటీతో షార్ప్ అక్వోస్ 507ఎస్ హెచ్ వినియోగదారుల ముందుకు తీసుకొస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది.

అక్వోస్ 507ఎస్ హెచ్ ఫీచర్లు...
5 అంగుళాల హెచ్ డీ ఐజీజడ్వో ఎల్ సీడీ 2.5డీ డిస్ ప్లే
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4(వెనుక, ముందు ప్యానెల్స్ కి)
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 617 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
200 జీబీ విస్తరణ మెమరీ
3010 ఎంఏహెచ్ బ్యాటరీ
13 ఎంపీ వెనుక కెమెరా
5 ఎంపీ ముందు కెమెరా
135 గ్రాముల బరువు
వాటర్, డస్ట్ రెసిస్టెంట్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement