శాఖల కేటాయింపుపై శివసేన అలక | Shiv Sena to decide tomorrow on whether to accept Heavy Industries portfolio | Sakshi

శాఖల కేటాయింపుపై శివసేన అలక

Published Tue, May 27 2014 9:32 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వానికి అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయి.

ముంబై: కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వానికి అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయి. నూతన మంత్రివర్గం ఏర్పడి 24 గంటలు గడవకముందే అలకలు మొదలయ్యాయి. కేంద్ర కేబినెట్ లో శాఖల కేటాయింపుపై శివసేన గుర్రుగా ఉంది. తాము అడిగిన శాఖలు ఇవ్వలేదంటూ శివసేన అలకవహించింది.

తమ పార్టీకి 
కేటాయించిన భారీ పరిశ్రమల శాఖను అంగీకరించే విషయంపై సమాలోచనలు జరుపుతోంది. ఈ శాఖను అంగీకరించాలా, వద్దా అనే దానిపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే రేపు నిర్ణయం తీసుకుంటారని అనంత్ గీతే తెలిపారు. మోడీ మంత్రివర్గంలో ఆయనకు అనంత్ గీతేకు భారీ పరిశ్రమల శాఖ కేటాయించారు. తమ పార్టీకి కోరిన శాఖ ఇవ్వలేదన్న కారణంతో ఆయన ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement