డీఎల్‌ఎఫ్
బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.160
టార్గెట్ ధర: రూ.250
ఎందుకంటే: ప్రమోటర్ల దగ్గరున్న కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లు(సీసీపీఎస్) కన్వర్షన్‌ను ఒక ఏడాది కాలం పాటు వాయిదా వేసింది. దీంతో నిధుల సమీకరణకు కంపెనీకి వెసులుబాటు లభిస్తుంది. ఈ నెల 19న జరగాల్సిన ఈ కన్వర్షన్ ఏడాది కాలం పాటు వాయిదా పడింది. మరోవైపు ఈ సీసీపీఎస్‌లపై చెల్లించాల్సిన కూపన్ రేటు 9 శాతం నుంచి 0.01 శాతానికి తగ్గించారు. దీని వల్ల డివిడెండ్‌గా చెల్లించాల్సిన 144 కోట్లు కంపెనీకి ఆదా అవుతాయి. మరోవైపు డీఎల్‌ఎఫ్ ప్రమోటర్లు మార్కెట్లో మూడేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించరాదన్న సెబీ ఉత్తర్వులను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్) ఆరు నెలలకు తగ్గించింది. శాట్ తాజా ఉత్తర్వు కారణంగా కంపెనీ నిధుల సమీకరణకు అడ్డం కులు దాదాపుగా తొలగినట్లే. కంపెనీ అమ్మకాలు పుంజుకునేదాకా రీట్, క్విప్‌ల ద్వారా నిధులు సమీకరించడం షేర్ ధరపై సానుకూల ప్రభావమే చూపవచ్చు. అమ్మకాలు పుంజుకుంటే, నగదు నిల్వలు పుష్కలంగా కంపెనీకి అందుబాటులోకి వస్తాయి. దీంతో మిడ్-ఇన్‌కం ప్రాజెక్ట్‌లను కంపెనీ ప్రారంభించగలుగుతుందని అంచనా.
బ్రోకరేజ్ సంస్థ: నొముర
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.1,382
టార్గెట్ ధర: రూ.1,930
ఎందుకంటే: ఈ కంపెనీలో 35 శాతం దాకా వాటాలు ఉన్న ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)ఇన్వెస్టర్లు తమ వాటాను తగ్గించుకుంటున్నారని, త్వరలో ప్రారంభం కానున్న సెర్చ్‌ప్లస్(ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్) వ్యాపారంపై ప్రకటనల వ్యయం అంచనాలను మించి పెరిగిపోవచ్చని, తదితర అంశాల కారణంగా ఈ షేర్ ధర ఇటీవల కాలంలో 25 శాతం వరకూ క్షీణించింది. నాలుగేళ్లలో లోకల్ సెర్చ్ బిజినెస్ 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని యాజమాన్యం భావిస్తోంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న సెర్చ్ ప్లస్ వ్యాపారం ఆదాయం 2018-19 కల్లా కంపెనీ రాబడిలో 14 శాతం వరకూ ఉండొచ్చని అంచనా. ఇ-టెయిలింగ్‌లో ప్రవేశించడం వంటి కారణాల వల్ల కంపెనీ ఆదాయం 31 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. అలాగే నాలుగేళ్లలో ఈపీఎస్ 39 శాతం చొప్పున చక్రగతిన పెరుగుతుందని భావిస్తున్నాం. త్వరలో జేడీ క్యాష్ పేరుతో వాలెట్ సర్వీసునూ అందించనున్నది. జేడీ క్యాష్ డెవలప్‌మెంట్ దాదాపు పూర్తయిందని, త్వరలో ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. సమ్ ఆఫ్ ద పార్ట్స్(ఎస్‌ఓటీపీ) ప్రాతిపదికన టార్గెట్ ధరను రూ.1,930గా నిర్ణయించాం.
స్టాక్స్ వ్యూ
Published Mon, Mar 23 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM
Advertisement
Advertisement