సీబీఐ పిటీషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం | supreme court agrees to hear CBI plea against Gauhati HC order | Sakshi
Sakshi News home page

సీబీఐ పిటీషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం

Published Fri, Dec 6 2013 4:11 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

సీబీఐ పిటీషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం - Sakshi

సీబీఐ పిటీషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం

న్యూఢిల్లీ: సీబీఐ ఏర్పాటే రాజ్యాంగ విరుద్దమన్న గౌహతి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన  పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సీబీఐ ఏర్పాటు అసలు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాదని గౌహతి హైకోర్టు గత నెలలో తీర్పు వెలువరించడంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిని శుక్రవారం విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం సీబీఐకు వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు పి.సదాశివంతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లో తమకు సమగ్ర నివేదిక అందజేయాలని పిటీషనర్ కు ఆదేశాలు ఇచ్చింది. సీబీఐని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ 1963 ఏప్రిల్ 1న చేసిన తీర్మానాన్ని గౌహతి హైకోర్టు కొట్టివేసింది. అనంతరం ఈ తీర్పుపై నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement