‘గాంధీ’లో స్వైన్‌ఫ్లూ కేసు | Swine flu case in Gandhi Hospital | Sakshi
Sakshi News home page

‘గాంధీ’లో స్వైన్‌ఫ్లూ కేసు

Published Tue, Sep 1 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

‘గాంధీ’లో స్వైన్‌ఫ్లూ కేసు

‘గాంధీ’లో స్వైన్‌ఫ్లూ కేసు

హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికించేందుకు స్వైన్‌ఫ్లూ మరోసారి సిద్ధమవుతోంది. ఈ వర్షాకాలంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మొదటి కేసు నమోదైంది. ఖమ్మం జిల్లాకు చెందిన కొణిజర్ల మండలం గుబ్బకుర్తి గ్రామానికి చెందిన సునీల్ (32) తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. వైద్యుల సూచన మేరకు కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేర్పించారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పించడంతో మెరుగైన వైద్య సేవల కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచించారు.

దీంతో ఆగస్టు 29న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. సునీల్ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా సోమవారం అందిన నివేదికల్లో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే రోగిని ఏఎంసీ వార్డులో ప్రత్యేకంగా వైద్యసేవలు అందిస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశముందని, గర్భిణీలు, బాలిం తలు, చిన్నారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నోడల్ అధికారి కె.నర్సింహులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement