ఎర్రబెల్లి, కేశవ్ రగడ గేమ్‌ప్లానే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా దాటవేత వైఖరితో ఒకవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మరోవైపు ఆ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తూ కొంతకాలంగా డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. సీమాంధ్రకు చెందిన పయ్యావుల కేశవ్, తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి దయాకరరావు మధ్య బుధవారం జరిగిన మాటల యుద్ధం పార్టీ గేమ్‌ప్లాన్‌లో భాగమేనని తెలుస్తోంది. వీరిలా పరస్పరం వాదోపవాదాలు చేసుకోవడానికి బాబే అనుమతించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
సీమాంధ్రలో ఉదృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమంలో కేశవ్ పాల్గొనకపోవడం తెలిసిందే. గురువారం నుంచి వారం రోజుల పాటు తన జిల్లాలో పర్యటనను ఖరారు చేసుకున్న నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకునేందుకు బాబు అనుమతితోనే ఎర్రబెల్లిపై ఆయన ఆరోపణలు సంధించారంటున్నారు. తెలంగాణలో టీడీపీని ఎవరూ విశ్వసించకపోవడంతో, ఇలా సొంత పార్టీ నేతపైనే ఆరోపణలు చేయడం ద్వారా గట్టిగా వాదన విన్పిస్తున్నారన్న భావన కల్పించాలని భావించినట్టు పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
టీడీపీ నేతల డ్రామా
Published Thu, Nov 7 2013 1:56 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM
Advertisement
Advertisement