సోనియా దయ్యమో దేవతో ప్రజలే నిర్ణయిస్తారు: మందా | Telangana People will decide, sonia gandhi | Sakshi
Sakshi News home page

సోనియా దయ్యమో దేవతో ప్రజలే నిర్ణయిస్తారు: మందా

Published Wed, Mar 5 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

సోనియా దయ్యమో దేవతో ప్రజలే నిర్ణయిస్తారు: మందా

సోనియా దయ్యమో దేవతో ప్రజలే నిర్ణయిస్తారు: మందా

సాక్షి, న్యూఢిల్లీ: సోనియాగాంధీ దయ్యమో, దేవతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని టీఆర్‌ఎస్ నేత, ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో టీఆర్‌ఎస్ సోనియాను దేవత అని స్తుతించిందని, మరిప్పుడు దేవతా? దయ్యమా? అని విలేకరి ప్రశ్నించగా... మందా పైవిధంగా బదులిచ్చారు. అనేక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం కాదని కేసీఆర్ ప్రకటించారని, అసలు విషయాలు తెలియకుండా కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
 
 ‘‘స్నేహపూర్వక హస్తం అంటూనే రెచ్చగొట్టేలా మాట్లాడారు. సోనియా ఎప్పుడూ విలీనం, పొత్తులపై మాట్లాడలేదు. కానీ, దిగ్విజయ్‌సింగ్ మాత్రం విలీనం ఖరారైందని, కేవలం విధివిధానాలే మాట్లాడుకోవాల్సి ఉందని ఎలా అంటారు. ఇద్దరు సభ్యులతో బిల్లు ఎలా పాస్ చేయిస్తారంటూ టీఆర్‌ఎస్‌పై ఎలా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తారు? దిగ్విజయ్ వ్యాఖ్యలు మొత్తం తెలంగాణ ప్రజలను అవమానించే రీతిలో ఉన్నాయి.’’ అని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement