తెలుగు సిలబస్‌లో మార్పులు
6 నుంచి 10వ తరగతి వరకు మార్పులపై విద్యా శాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు పుస్తకాల్లో మార్పులు చేసేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని తరగతుల్లో పాఠ్య పుస్తకాలను తెలంగాణకు సంబంధించిన అంశాలతో గతేడాదే ఎస్‌సీఈఆర్‌టీ మార్పులు చేసింది. తాజాగా 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ తదితర మీడియాల్లో ద్వితీయ భాష తెలుగు పాఠ్యపుస్తకాల సిలబస్‌ను మార్చేందుకు చర్యలు చేపట్టింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం తదితర అంశాలను సిలబస్‌లో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపగానే రచయితలు, ఎడిటర్లతో సమావేశాలు నిర్వహించి మార్పులు చేయాలని యోచిస్తోంది.