
జీఎస్టీ ఆలోచన యూపీఏదే
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు ప్రత్యేక సమావేశానికి దూరంగా ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. మొదట జీఎస్టీ బిల్లును ప్రతిపాదించింది యూపీఏనేనన్న అం శాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ‘వాజ్‌పేయి ప్రభు త్వం ఈ అంశంపై చర్చ మొదలుపెట్టినా తరువాతి కాలంలో యూపీఏ ఈ బిల్లును ప్రతిపాదించింది. కానీ అమలు సాధ్యం కాలేదు. ఈ విధానంలో రాష్ట్రాలు నష్టపోతే పరిహారం ఇచ్చేందుకు అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలు ఆమోదించిన తరువాత, పరిష్కార మార్గాలు చూసిన తరువాతే దీన్ని అమలు లోకి తెస్తున్నారు.
జీఎస్టీ తెచ్చింది చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ. ఇది మా సృష్టి కాదు. దీన్ని ఆలస్యం చేయడం వల్ల దేశానికి నష్టమని గతంలో వీరప్ప మొయిలీనే చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా నిలిచి ప్రజల దృష్టిలో పలుచన కావద్దు, ప్రధానికి ప్రతిష్ట పెరుగుతుందనే కారణంతో కొందరు వ్యతిరేకిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు తమ అధికారాలను జీఎస్టీ కౌన్సిల్‌కు బదలా యించాయి. ఎప్పటికప్పుడు జీఎస్టీ కౌన్సిల్ శ్లాబులు మార్చేందుకు వీలుంది. దేశంలో ఒకే పన్ను విధానం ఉండడం శ్రేయస్కరం..’ అని పేర్కొన్నారు.