హరియాణా దళిత బాలల సజీవ దహనం కేసులో కొత్త మలుపు! సుంపేడ్ గ్రామంలోని ఈ నెల 20న జితేందర్ అనే దళితుడి
మంటలు ఇంట్లోనుంచే వచ్చాయని ఫోరెన్సిక్ నిపుణుల నిర్ధారణ!
చండీగఢ్: హరియాణా దళిత బాలల సజీవ దహనం కేసులో కొత్త మలుపు! సుంపేడ్ గ్రామంలోని ఈ నెల 20న జితేందర్ అనే దళితుడి ఇంట్లో జరిగిన ఈ ఘటనలో మంటలు ఇంట్లోనుంచి మొదలయ్యాయని రాష్ట్ర ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈమేరకు వారు సీబీఐకి నివేదిక ఇచ్చారు. వీరితోపాటు సీబీఐ ఫోరెన్సిక్ నిపుణులు గురువారం ఘటనాస్థలిని పరిశీలించారు. పాక్షికంగా కాలిన మంచం కింద సగం కాలిన కిరోసిన్ బాటిల్, కిటికీ బయట స్లాబ్‌పై వాడిన అగ్గిపుల్లను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారని తెలుస్తోంది.
సంఘటన సమయంలో ఆవరణలోకి బయటి వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ నిపుణుల పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అగ్రకులాల వారు బయటి నుంచి తనింట్లో పెట్రోల్ పోసి నిప్పుపెట్టారని జితేందర్ ఆరోపించడం, ఈ ఘటనలో అతని కొడుకు, కూతురు చనిపోవడం తెలిసిందే.