ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్, జేడీయూ కీలక నేత, మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్, బీజేపీ సీనియర్ నేత, రాష్ట్రంలో పార్టీ ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న సుశీల్ కుమార్ మోదీల మధ్య ఈ ఎన్నికలకు సంబంధించి ఓ సారూప్యం ఉంది. ఈ ముగ్గురు ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తమతమ పార్టీల తరఫున రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం సాగించారు. దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో లాలూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు.
2004లో నలంద నుంచి లోక్‌సభకు పోటీ చేసిన నితీశ్.. ఆ తరువాత ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. శాసనమండలి సభ్యుడిగా సీఎం పదవి చేపట్టారు. బిహార్ పీసీసీ అధ్యక్షుడు అశోక్ చౌధరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళ్ పాండే కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం.
ఈ ముగ్గురు పోటీ చేయలేదు
Published Mon, Nov 9 2015 2:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement