రైలు ప్రమాదం బాధాకరం: మోదీ | The two train accidents in Madhya Pradesh are deeply distressing. | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదం బాధాకరం: మోదీ

Published Wed, Aug 5 2015 8:43 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

రైలు ప్రమాదం బాధాకరం: మోదీ - Sakshi

రైలు ప్రమాదం బాధాకరం: మోదీ

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో జరిగిన రైలు ప్రమాదం అత్యంత బాధాకరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మరణించిన వారి కుటుబాలకు ప్రాగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అధికారులు అన్ని రకాల సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రమాదం పై విచారణ వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
రైలు ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను రైల్వే అధికారులతో కలిసి పని చేస్తున్నామని ట్విట్టర్ ద్వారాతెలిపారు. డీఎంతో పాటూ సీనియర అధికారులు సంఘటన జరిగిన ప్రాంతంలోనే ఉండి సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అన్ని రకాల వైద్య సేవలను అందించేలా వివిధ ప్రాంతాల నుంచి వైద్య బృందాలను తెప్పించామన్నారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement