ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ చేయి పట్టుకొని సన్నిహితంగా నడువడం పెద్ద దుమారమే రేపింది.
ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ చేయి పట్టుకొని సన్నిహితంగా నడువడం పెద్ద దుమారమే రేపింది. వైట్‌హౌస్‌లో ఇద్దరు నేతలు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడిచిన ఫొటో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారిపోయింది. వీరి 'ఎక్స్‌ట్రా స్పెషల్ రిలేషన్‌షిప్'కు కారణమేంటన్న ఆసక్తి నెలకొంది.
వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడి చేయిని థెరిసా ఇలా పట్టుకొని నడువడం వెనుక ఉన్న అసలు కారణంపై ఆమె అధికార యంత్రాంగానికి చెందిన అత్యున్నత వర్గాలు తాజాగా వివరణ ఇచ్చాయి. డొనాల్డ్ ట్రంప్‌కు బాత్మోఫొబియా ఉందని, దీనివల్ల ఆయనకు మెట్లు, దింపుగా (ఏటవాలుగా) ఉన్న ప్రదేశాలు దిగుతున్నప్పుడు జారిపడిపోతానేమోనన్న భయం ఉందని, అందుకే వైట్‌హౌస్‌లో ఒంపుగా ఉన్న ప్రదేశాన్ని దిగుతున్నప్పుడు ట్రంప్ చేయిని పట్టుకొని థెరిసా మే నడిచారని ఆ వర్గాలు వివరణ ఇచ్చాయి. తనకు ఫొబియా ఉన్న విషయాన్ని థెరిసాకు చెప్పి.. దింపుగా ఉన్న ప్రదేశం వద్ద ఆమె సాయాన్ని ట్రంప్ తీసుకున్నారని, ఆ సందర్భంలోనిదే ఈ ఫొటో అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.