న్యూఇయర్లో అలరించబోతున్న కార్లు, బైకులివే! | These cars and bikes are worth buying in 2017 | Sakshi
Sakshi News home page

న్యూఇయర్లో అలరించబోతున్న కార్లు, బైకులివే!

Published Tue, Dec 27 2016 11:49 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

న్యూఇయర్లో అలరించబోతున్న కార్లు, బైకులివే!

న్యూఇయర్లో అలరించబోతున్న కార్లు, బైకులివే!

కొత్త కొత్త కార్లను, బైకులను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు వాహన తయారీ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. 2016లాగా కాకుండా.. న్యూఇయర్లో వినియోగదారుల కోసం డజన్ల కొద్దీ కార్లను, బైకులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి.

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. నూతన సంవత్సర కానుకగా బ్యాంకులూ వడ్డీరేట్లు తగ్గించేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల ముంగింట్లోకి కొత్త కొత్త కార్లను, బైకులను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు వాహన తయారీ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. 2016లాగా కాకుండా.. న్యూఇయర్లో వినియోగదారుల కోసం డజన్ల కొద్దీ కార్లను, బైకులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాయి. న్యూఇయర్లో వినియోగదారుల ముందుకు రాబోతున్న కొత్త కార్లు, కొత్త బైకులేమిటో ఓ సారి చూద్దామా...
న్యూఇయర్లో అలరించబోతున్న కార్లు...
టాటా హెక్సా...
ఆవిష్కరణ తేదీ: జనవరి 18
ధర : ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.12 లక్షల నుంచి రూ.16 వరకు
ప్రత్యేకతలు: తర్వాతి జనరేషన్తో రూపొందిన కొత్త టాటా హెక్సా, 2.2 లీటర్ల హెరికోర్ 400 డీజిల్ ఇంజిన్ను కలిగి ఉంటోంది. మాక్సిమమ్ పవర్ అవుట్పుట్ 153 బీహెచ్పీ, మాక్సిమమ్ టర్క్ 400 ఎన్ఎమ్. సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్సిమిషన్ను ఇది కలిగి ఉంటుంది. ఎకానమీ, స్పోర్ట్, ఆటో-సెన్సింగ్లోకి మార్చుకోగలిగే సామర్థ్యమున్న ఈ వాహనం, రేస్ కారు ఫర్ఫార్మెన్స్ ఆప్షన్ను అందిస్తోంది. 
 
మారుతీ సుజుకీ ఇగ్నిస్...
ఆవిష్కరణ తేదీ : జనవరి 13
ధర : ఎక్స్ షోరూం న్యూఢిల్లీలో రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు
ప్రత్యేకతలు : రిట్జ్కు రిప్లేస్గా రాబోతున్న ఈ మోడల్ను మొదటిసారి 2016 ఆటో ఎక్స్పోలో దీన్ని ప్రదర్శించారు. 1.2 లీటర్ బూస్టర్జెట్ ఇంజిన్, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్తో ఇది రాబోతుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, దాంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ను ఇది కలిగి ఉంటోంది. అయితే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ను ఇది తర్వాత ప్రవేశపెట్టనుంది. మొదట మాన్యువల్ ట్రాన్సిమిషన్తో ఇది లాంచ్ కాబోతుంది. 
 
ఫోక్స్వాగన్ టైగూన్ ... 
ఆవిష్కరణ తేదీ: ఫిబ్రవరి 2017 
ధర: ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.25 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు
2.0 లీటర్ టీఎస్ఐ టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ మిల్తో రూపొందిన ఈ వాహనం, 177 బీహెచ్పీ పవర్, 320 ఎన్ఎమ్ టర్క్ను ఇది ఉత్పత్తిచేస్తోంది. డీజిల్ వేరియంట్ అయితే 2.0 లీటర్ టీడీఐ మోటార్ను కలిగి 148 బీహెచ్పీ, 340 ఎన్ఎమ్ టర్క్ను ఇది ప్రొడ్యూస్ చేస్తోంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీఎస్జీ గేర్ బాక్స్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లగా ఇది రూపొందింది.  
 
వినియోగదారుల ముంగింట్లోకి వస్తున్న బైకులు..
కేటీఎం డ్యూక్ 390...
ఆవిష్కరణ తేదీ: మే 2017
ధర : ఎక్స్ షోరూం న్యూఢిల్లీలో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు
ఫీచర్లు: 372 సీసీతో సింగిల్-సిలిండర్ యూరో4 ఇంజిన్తో ఈ బైక్ వినియోగదారుల ముందుకు రాబోతుంది. 43 బీహెచ్పీ పవర్, 37ఎన్ఎమ్ టర్క్ను ఇది ఉత్పత్తి చేస్తోంది. 
 
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 300...
ఆవిష్కరణ తేదీ : ఫిబ్రవరి 2017
ధర : రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు
ప్రత్యేకతలు: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 300 కంపెనీ టాప్ ప్రొడక్ట్. 313 సీసీ లిక్విడ్-కూలుడ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్తో ఇది రూపొందింది.  34 బీహెచ్పీ పవర్,  28 ఎన్ఎమ్ టర్క్ను ఇది ఉత్పత్తి చేస్తోంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ను ఇది కలిగి ఉంటోంది. 
 
బీఎండబ్ల్యూ జీ310 ఆర్....
ఆవిష్కరణ తేదీ : మార్చి 2017
ధర : ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.2 లక్షల నుంచి రూ.3.8 లక్షల వరకు 
ప్రత్యేకతలు: డిస్ప్లేస్మెంట్ : 313 సీసీ, మాక్సిమమ్ పవర్ : 33.6 బీహెచ్పీ@ 9500 ఆర్పీఎం, మాక్సిమమ్ టర్క్ : 28ఎన్ఎమ్@7500 ఆర్పీఎం, సిలిండర్లు: 1, గేర్లు : 6,  టాటా స్పీడ్: 143 కేఎంపీహెచ్.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement