నేడు, రేపు ‘ఇండియా ప్రాపర్టీ.కామ్’ ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: ఇండియా ప్రాపర్టీ డాట్ కామ్ ఆధ్వర్యంలో ‘గృహప్రవేశం’ పేరుతో శని, ఆదివారాల్లో ప్రాపర్టీ షో జరగనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగే ఈ ప్రదర్శనలో టాప్ 60 మంది బిల్డర్లు 200కు పైగా కొత్త ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. దాదాపు రూ. 50 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.
అపర్ణా, ఎస్‌వీసీ, ఎన్‌సీసీ, సైబర్‌సిటీ, విశాల్ వంటి నిర్మాణ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్ రెడ్డి, ఏపీ ప్రెసిడెంట్ రాం రెడ్డి, ఇండియా ప్రాపర్టీ.కామ్ సీఈఓ గణేష్ వాసుదేవన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
గృహశోభ ఉట్టిపడాలంటే రోజూ గార్డెనింగ్‌కు సమయాన్ని కేటాయించాలి.మొకట్కలు ఎంపిక చేసుకొనే ముందు అవి పెరిగే ఎత్తు, పూల రంగు తదితర అంశాలను గుర్తించాలి. వాతావరణ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
పూల మొక్కలు పొదల మాదిరిగా పెరిగే మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కలు గార్డెన్‌లో పెంచుకోవచ్చు.
ఏ మొక్కకు ఎంత నీరు పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. మొక్కలు నాటిన మొదటివారంలో రోజూ నీరు పెట్టాలి. రెండో వారం నుంచి రెండు రోజులకొకసారి నీరు పెట్టొచ్చు. అయితే ఇది అన్ని మొక్కలకు వర్తించదు. కొన్ని రకాల పూల మొక్కలకు ప్రతి రోజూ నీరు పెట్టాల్సి ఉంటుంది.
ఏపుగా పెరిగిన చెట్లు ప్రహరీ గోడ చుట్టూ ఉంటే సూర్యరశ్మి తగినంత పడే అవకాశం ఉండదు. ఇంట్లోకి వెలుతురు బాగారావాలంటే ఇంటి చుట్టూ కాకుండా సూర్యర శ్మి పడే ప్రాంతాలను ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.
మొక్కలు కొనుగోలు చేసేటప్పుడు సూర్యరశ్మి అవసరమయ్యే మొక్కలు, నీడనిచ్చే మొక్కలను పెంచుకుంటే మంచిది.
ఆహ్లాదమిచ్చే పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలకూ కాస్త స్థలం కేటాయించుకుంటే మీ ఇల్లు పచ్చగా చూడముచ్చటగా ఉంటుంది.