
నయీమ్ ఎన్‌కౌంటర్‌పై రేపు చర్చ
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్‌పై అసెంబ్లీలో చర్చ జరగనుంది. సోమవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక స్వల్పకాలిక చర్చ కింద నయీమ్ అంశంపై చర్చించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్‌పై అసెంబ్లీలో చర్చ జరగనుంది. సోమవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక స్వల్పకాలిక చర్చ కింద నయీమ్ అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు ఎజెండా ఖరారైంది. నయీమ్ అతడి అనుచరుల నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ సందర్భంగా చర్చిస్తారు.
ఈ అంశంపై చర్చించాలని విపక్షాల నుంచి డిమాండ్ రాకముందే ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్లు అధికారపక్షం చెబుతోంది. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం వివిధ రాజకీయ పార్టీల నేతల పేర్లు బయటకు రావడం, నయీమ్‌తో సంబంధాలున్న వారిలో టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నయీమ్ అంశాన్ని చర్చకు పెట్టింది.