క్లింటన్కు ట్రంప్ సవాల్
క్లింటన్కు ట్రంప్ సవాల్
Published Mon, Aug 29 2016 1:20 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
వాషింగ్టన్ తన మానసిక పరిస్థితి సరిగా లేదంటూ పలుమార్లు ఆరోపిస్తున్న హిల్లరీ క్లింటన్పై సవాలుకు దిగారు డొనాల్డ్ ట్రంప్. హిల్లరీ క్లింటన్ పూర్తి మెడికల్ రికార్డులు రిలీజ్ చేయాలని ట్రంప్ చాలెంజ్ చేశారు. తన మెడికల్ రికార్డులు విడుదల చేయడానికి తనకు ఏమాత్రం అభిప్రాయం లేదని, మరీ హిల్లరీ ? అంటూ ఆదివారం రాత్రి ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తనకు తగిన శక్తి లేదని క్లింటన్ చిత్రీకిరించడానికి ప్రయత్నిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా డిసెంబర్లోనే ట్రంప్ మెడికల్ రికార్డులను తన వ్యక్తిగత ఫిజిషియన్ పబ్లిక్గా తీసుకొచ్చారు.. ఎన్బీసీ న్యూస్ రిపోర్టు చేయకముందు ఆ రికార్డులను పరిశీలనలో ఉంచారు. అధ్యక్ష పదవికి ట్రంప్ ఎన్నికైతే అతడే అత్యంత ఆరోగ్యవంతమైన ప్రెసిడెంట్ అంటూ తన వ్యక్తిగత డాక్టర్, ఫిజిషియన్ హెరాల్డ్ బార్న్స్టీన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ మానసిక ఆరోగ్యం అమోఘమంటూ ఆయన వెల్లడించారు. స్మోక్, డ్రింక్ చేయకపోవడంతో ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. కుటుంబనేపథ్యం కూడా చాలా బాగుందని కితాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో క్లింటన్ ఆరోగ్యానికి సంబంధించి ట్రంప్తో పాటు ఆయన మద్దతుదారులు విమర్శలకు దిగారు. ట్రంప్ లాగానే క్లింటన్ వ్యక్తిగత ఫిజిషియన్ కూడా ఆమె ఆరోగ్యం, ఫిటినెస్పై పదేపదే పబ్లిక్ గా పునరుద్ఘాటిస్తున్నారు.
Advertisement
Advertisement