బాలికపై అత్యాచారం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్ | two constables suspended for raping minor in badaun | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్

Published Fri, Jan 2 2015 2:44 PM | Last Updated on Tue, Mar 19 2019 6:03 PM

బాలికపై అత్యాచారం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్ - Sakshi

బాలికపై అత్యాచారం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్

ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేశారు. దాంతో వారిద్దరినీ సస్పెండ్ చేశారు. బుధవారం రాత్రి ఆమె కాలకృత్యాలు తీర్చుకోడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు చూసి ఆమెను అక్కడకు సమీపంలోని ఓ గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులైన కానిస్టేబుళ్లిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

ఆమె ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో తాము అన్ని చోట్లా చూశామని, చివరకు అర్ధరాత్రి తిరిగొచ్చి జరిగిన విషయం తమకు చెప్పిందని బాలిక తల్లి అన్నారు. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement