చేబ్రోలులో జంట హత్యలు | two members suffering murder in chebrolu | Sakshi
Sakshi News home page

చేబ్రోలులో జంట హత్యలు

Published Mon, Aug 4 2014 10:36 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

two members suffering murder in chebrolu

ఏలూరు(ప.గో):జిల్లాలోని చేబ్రోలులో సోమవారం ఉదయం చోటుచేసుకున్న జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. కొంతమంది దుండగులు ఇనుపరాడ్లతో దాడి చేసి ఇద్దరు మృతికి కారణమయ్యారు. ఈ ఘటనలో ఒకరు యాచకురాలు పార్వతి కాగా, మరొకరు హైవే పెట్రోలింగ్ వెహికల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగి రాజు. ఈ రోజు తెల్లవారుజాము ప్రాంతంలో కొందరు దుండగులు ఆకస్మికంగా దాడి చేసి ఆ ఇద్దర్నీ కొట్టి చంపారు. దీనిపై సమాచారం అందుకున్న డీఎస్పీ సత్తిబాబు ఆ ఘటనా స్థలికి చేరుకున్నారు.ఈ జంట హత్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement