జెండాకు అవమానం, ఇద్దరు పోలీసుల సస్పెండ్ | Two policemen suspended as Punjab minister hoists flag upside down | Sakshi
Sakshi News home page

జెండాకు అవమానం, ఇద్దరు పోలీసుల సస్పెండ్

Published Sat, Aug 15 2015 7:01 PM | Last Updated on Tue, Aug 21 2018 8:14 PM

జెండాకు అవమానం, ఇద్దరు పోలీసుల సస్పెండ్ - Sakshi

జెండాకు అవమానం, ఇద్దరు పోలీసుల సస్పెండ్

అమృతసర్: 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పంజాబ్లో ఇద్దరు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా జాతీయ పతాకానికి అవమానం జరిగింది. శనివారం రెవిన్యూ శాఖ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినపుడు తప్పిదం దొర్లింది. జాతీయ పతాకం తలకిందులుగా ఎగిరింది. ఈ విషయం మంత్రి దృష్టికి రావడంతో జాతీయ పతాకాన్ని సరిచేశారు.

ఈ ఘటనపై పోలీసు ఇన్స్పెక్టర్ గురుముఖ్ సింగ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గురిందర్ సింగ్లను అమృతసర్ పోలీసు కమీషనర్ జితేందర్ సింగ్ అలక్ సస్పెండ్ చేశారు. ఈ విషయంలో వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన వారిపై కమిషనర్ జితేందర్ సింగ్ మండిపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement