‘రేప్ కామెంట్స్’పై పబ్లిగ్గా ఎందుకు చెప్పాలి! | Varun on Salman raped woman controversy, I will express my viewpoint personally to Salman | Sakshi
Sakshi News home page

‘రేప్ కామెంట్స్’పై పబ్లిగ్గా ఎందుకు చెప్పాలి!

Published Thu, Jun 30 2016 6:19 PM | Last Updated on Sat, Jul 28 2018 8:35 PM

‘రేప్ కామెంట్స్’పై పబ్లిగ్గా ఎందుకు చెప్పాలి! - Sakshi

‘రేప్ కామెంట్స్’పై పబ్లిగ్గా ఎందుకు చెప్పాలి!

తీవ్ర వివాదం రేపిన సల్మాన్‌ ఖాన్‌ ‘రేప్‌ కామెంట్స్‌’ పై తాజాగా బాలీవుడ్‌ యువ హీరో వరుణ్‌ ధావన్‌ స్పందించడానికి నిరాకరించాడు. తన తాజా సినిమా ‘డిష్షూం’ ప్రమోషన్‌లో భాగంగా ముంబైలోని ఓ ఈటరీలో హల్‌చల్‌ చేసిన ధావన్‌ను సల్మాన్ రేప్‌ కామెంట్స్ పై స్పందించిన కోరగా.. ఆచితూచి బదిలిచ్చాడు. ఈ అంశంపై పబ్లిగ్గా తాను ఎలాంటి కామెంట్‌ చేయబోనని, తన అభిప్రాయాన్ని నేరుగా సల్మాన్‌ ఖాన్‌కే చెప్తానని, ఆయన వద్ద అంత చనువు తనకు ఉందని ధావన్ చెప్పుకొచ్చారు.

సల్మాన్‌ రేప్‌ కామెంట్స్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడుతున్న రెండు గ్రూపులకూ వారి సొంత అజెండాలు ఉన్నాయని, ఆ అజెండాల్లో నేనెందుకు భాగస్వామిని కావాలని ధావన్ ప్రశ్నించాడు. ‘నేను ఎవరి అజెండాలోనూ భాగం కాదలుచుకోలేదు. వ్యక్తిగతంగా సల్మాన్‌కు నా అభిప్రాయం చెప్పగలను. అంత చనువుంది. అలాంటప్పుడు పబ్లిగ్గా నా అభిప్రాయాన్ని ఎందుకు చెప్పాలి’ అని ధావన్‌ అన్నాడు.

‘సుల్తాన్’ షూటింగ్ సందర్భంగా తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా ఉండేదంటూ సల్మాన్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్‌ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ ఇప్పటివరకు పెద్దగా స్పందించడం లేదు. అనురాగ్‌ కశ్యప్‌, కంగన రనౌత్‌ వంటి ఒకరిద్దరు తప్ప మిగతా వారాంతా ఈ వివాదంపై సేఫ్‌ జోన్‌లో ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement