బిగ్‌బాస్‌లో లైంగిక వేధింపులు.. సల్మాన్‌ అడ్డుకోడా? | Aksah Forcibly kiss Shilpa in Bigg Boss 11 Season | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 7 2017 7:06 PM | Last Updated on Thu, Jul 18 2019 1:55 PM

Aksah Forcibly kiss Shilpa in Bigg Boss 11 Season  - Sakshi

సాక్షి, ముంబై : బిగ్‌బాస్‌ షో 11వ సీజన్‌పై వస్తున్నన్నీ వివాదాలు అంతా ఇంతా కాదు. జుబైర్‌ఖాన్‌ వ్యవహారం సల్మాన్ కు తలనొప్పి తెప్పించగా.. ఇప్పుడు ఆకాశ్‌ దడ్లాని చేష్టలతో మరోసారి షో పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ శిల్పా షిండేను ఆకాశ్‌ బలవంతంగా ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి షో ప్రారంభంలో ఆకాశ్‌ చాలా పద్ధతిగా ఉన్నాడు. శిల్పతో స్నేహంగా వ్యవహరించిన అతను ఒకానోక టైంలో అమ్మతో సమానమంటూ వ్యాఖ్యలు చేశాడు కూడా. కొన్నాళ్లుగా మాత్రం తనలోని వక్రబుద్ధిని బయటపెడుతూ వస్తున్నాడు. ఈ మధ్యే ఓ ఎపిసోడ్‌ లో కేకు రాయటం పేరిట ఆమెను ఇష్టమొచ్చినట్లు తడమటం చేయటంతో ఆమె అసహనం వ్యక్తం చేసింది. కానీ, ఆకాశ్ ఈసారి ఏకంగా ముద్దు పెట్టేసుకున్నాడు. పైగా ఇప్పుడు ఏం చేస్తావో చేసుకోపో.. అంటూ ఆమెతో ఆకాశ్‌ చెప్పటం ఆ వీడియోలో చూడొచ్చు. 

ఇక ఈ వీడియో బయటకు రావటంతో ఆకాశ్‌పై మండిపడుతున్నారు. హోస్ట్‌ గా సల్మాన్‌కు ఈ లైంగిక వేధింపులు కంట పడటం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత సల్మాన్‌ పైనే ఉందని.. వెంటనే ఆకాశ్‌ ను హౌజ్‌ నుంచి బయటకు పంపించేయాలని కోరుతున్నారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌లో భాగమనే అభిప్రాయం వ్యక్తం చేసేవాళ్లు లేకపోలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement