కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతిపాలైందని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతిపాలైందని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఎల్బి స్టేడియంలో నవభారత యువభేరీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పోవాలి - బిజెపి రావాలి - నరేంద్ర మోడీ కావాలి అన్నట్లు
ఉందన్నారు. దేశంలో పేదరికం పెరిగింది, అక్కడ ఇక్కడ అనిలేదు, ఎక్కడబడితే అక్కడ అవినీతి తాండవిస్తోందని చెప్పారు. ఇక భూమ్మీద, భూ గర్భం కూడా కుంభకోణాలమయం అయిందన్నారు. ధరలు అన్నీ విపరీతంగా పెరిగిపోయాయన్నారు.
బిజెపి యువతలో విశ్వాసం కలిగిస్తున్నట్లు చెప్పారు. నరేంద్ర మోడీ గురజాత్లో మూడు పర్యాయాలు ఘనవిజయం సాధించారు. గుజరాత్ను అభివృద్ధిపరిచారు. యువతకు అవకాశాలు ఇచ్చారని చెప్పారు.