'శీతాకాల సమావేశాలు మాకు చివరివి కావు'
ఢిల్లీ:పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తమకు చివరివి కావని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు.ఈ సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి ఆఖరివి కావచ్చన్న వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు. ఇప్పడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి చివరివి కావని స్పష్టం చేశారు. రేపు లోక్సభకు రానున్న లోక్పాల్ బిల్లుకు సహకరించాలని తమ ఎంపీలకు నచ్చచెబుతామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో నెలకొన్నపరిస్థితులు దురదృష్టకరమన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇదంతా కాంగ్రెస్ ఆటలో ఒక భాగమని విపక్షాలపై ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఎవరేమిటో తెలుసని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.