రోజులు 17.. పనిచేసింది 9 గంటలు | With 82 Hours Wasted, Rajya Sabha Worked Just 9 Per Cent In This Session | Sakshi
Sakshi News home page

రోజులు 17.. పనిచేసింది 9 గంటలు

Published Thu, Aug 13 2015 7:50 PM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM

రోజులు 17.. పనిచేసింది 9 గంటలు - Sakshi

రోజులు 17.. పనిచేసింది 9 గంటలు

వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభలు ఎన్నిగంటలు కరెక్టుగా పనిచేశాయో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే మొత్తం పదిహేడు రోజులు సమావేశాలు జరగగా అందులో రాజ్యసభ మాత్రం తొమ్మిది గంటలు మాత్రమే పనిచేసింది.

న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభలు ఎన్నిగంటలు కరెక్టుగా పనిచేశాయో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే మొత్తం పదిహేడు రోజులు సమావేశాలు జరగగా అందులో రాజ్యసభ మాత్రం తొమ్మిది గంటలు మాత్రమే పనిచేసింది. ఆ సభ మొత్తం 82 గంటలను వృధా చేసింది. ఇక లోక్ సభ కూడా పంచాయితీల్లో పడి మొత్తం 34 గంటలు వాటికే కేటాయించింది. అయితే, రాజ్యసభతో పోల్చుకుంటే లోక్ సభలోనే సమయం తక్కువ వృధా అయింది. అందుకు ప్రధాన కారణం రాజ్యసభలో ఎక్కువ మెజార్టీ ప్రతిపక్షాలకు ఉండగా.. ఇక లోకసభలో అధికార పార్టీదే పూర్తి పైచేయి.

రాజ్యసభ సమావేశాలు జీఎస్టీ బిల్లు పెండింగ్తో ముగియగా లోక్ సభ సమావేశం మొత్తం పది బిల్లుల్లో ఆరు బిల్లులను ఆమోదించుకుని ముగిసింది. ఇక ప్రశ్నోత్తరాల సమయంలో రోజుకు కేవలం మూడు ప్రశ్నలకు మాత్రమే అధికార పార్టీ సమాధానం ఇచ్చింది. మొత్తం పనిదినాల్లో కేవలం తొమ్మిది శాతమే పనిచేసి పదిహేనేళ్ల కిందటి రికార్డును రాజ్యసభ తిరగరాసింది. సమావేశాలు ప్రారంభమైన తొలి రెండు వారాల్లో ఏసభలో కూడా సమావేశాలు సరిగా జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement