కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు | Without a shot being fired, Pakistan stock markets crash | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు

Published Thu, Sep 22 2016 2:51 PM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు - Sakshi

కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు

న్యూఢిల్లీ:  భారత్ పాక్ దేశాల మధ్య  తీవ్ర ఉద్రిక్తతలను  రాజేసిన  ఉరి  దాడి ఘటన పాక్  స్టాక్ మార్కెట్లను కూడా భారీగానే తాకింది. పాక్ లో నెలకొన్నరాజకీయ ఆందోళనలు, ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్టు కుప్ప కూలాయి.  కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్(కెఎస్ఈ)   దాదాపు 569 పాయింట్లకు  పైగా పతనమైంది. మార్కెట్లో నెలకొన్న  భారీ  కొనుగోళ్ల ఒత్తిడితో  1.41 శాతం నష్టపోయింది.  కీలక మద్దతు స్తాయి  40,000  కిందికి దిగజారి  39771 పాయింట్ల వద్ద ముగిసింది.

ముఖ్యంగా భౌగోళిక రాజకీయాల పై ఆందోళనలు , ఇటీవల కాశ్మీర్ దాడి తర్వాత, పెట్టుబడిదారులను భయాందోళనలోకి నెట్టిందని   పాక్ మార్కెట్ నిపుణుల వ్యాఖ్యలను ఉటంకిస్తూ  డెయిలీ టైమ్స్ రిపోర్ట్ చేసింది.  

మరోవైపు ఐక్యరాజ్యసమితిలో  పాకిస్తాన్ భారీ ఎదురు దెబ్బతగిలిన పరిణామంతో మార్కెట్లు ఢమాల్ అన్నాయి.. కశ్మీర్ సమస్యను పరిష్కరించాలంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన విజ్ఞప్తిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. భారతదేశం కూడా పాక ప్రభుత్వం ఒక యుద్ధం యంత్రం నడిపుతోంటూ   విమర్శించింది. అటు ఐక్యరాజ్యసమతి అసెంబ్లీ సమావేశంలో  షరీఫ్ వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల మంత్రి ఎంజె అక్బర్  తిప్పికొట్టారు.   భయపెట్టి, బెదిరించి, వాస్తవాలపై గౌరవం లేకుండా  ప్రవర్తిస్తోందని   ఆరోపించారు. కాగా  ఉరి  సైనిక స్థావరంపై సాయుధ తీవ్రవాదులు  భారి దాడిలో 18 మంది జవాన్లు  మృతి ఉద్రిక్తతలను రాజేసిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement