పలువురు ఆస్పత్రిపాలు
కామారెడ్డి/కామారెడ్డి రూరల్/బాన్సువాడ టౌన్/ నిజాంసాగర్/గద్వాల: కల్తీ కల్లును ప్రభుత్వం నిలువరిస్తున్న క్రమంలో మత్తుకు అలవాటుపడ్డ ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గురువారం నుంచి శుక్రవారం వరకు నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. జిల్లాలోని కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన ముదాం నారాయణ(45) వారం రోజులుగా ఇబ్బంది పడుతూ శుక్రవారం ఉరి వేసుకున్నాడు.
ఇదే మం డలంలోని లింగాపూర్‌కు చెందిన పెద్దొల్ల చిన్న మల్లయ్య(50)నాలుగు రోజులుగా ఇబ్బంది పడుతూ గురువారం చెరువులో పడి చనిపోయాడు. కామారెడ్డిలోని బతుకమ్మకుంటకు చెందిన షేక్ హుస్సేన్ (34) ఈ నెల 17న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.
బాన్సువాడకు చెందిన ఉప్పరి సోమయ్య(47) దాల్‌మల్‌గుట్టలో గాలించగా చెట్టుకు ఊరేసుకుని ఉన్నాడు. నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన పసుల కిష్టయ్య(48) మూడు రోజుల నుంచి కల్లు దొరక్కపోవడంతో అనారోగ్యానికి గురైయ్యాడు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
గద్వాల ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం ఐదుగురు కల్తీకల్లు బాధితులు చేరారు. వీరందరూ కృత్రిమ కల్లుకు అల వాటు పడ్డారు. ఇటీవల ఈ ప్రాంతంలోని కల్తీకల్లు దుకాణాలు మూతపడ్డాయి. దీంతో ఇప్పుడు మందులేని కల్లు తాగుతున్నారు. వారికి అందులో మత్తు సరిపోకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు.
మత్తులేక ఐదుగురు బలవన్మరణం
Published Sat, Sep 19 2015 2:20 AM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM
Advertisement
Advertisement