బంధువుల ఇంటికి వచ్చిన మహిళపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేసి వాటర్ ట్యాంక్లో పడవేసిన ఉదంతం రాజస్థాన్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మహిళ బర్మర్లో పంచు పట్టణంలోని బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలసి వచ్చింది. ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రామ్దేవ్ అనే యువకుడు వరుసగా అత్యాచారం జరిపాడు. అనంతరం ఆమెను హత్య చేసి, వాటర్ ట్యాంక్లో పడేసి అక్కడి నుంచి పరారైయ్యాడు. ఆమె సోదరుడు వాటర్ ట్యాంక్లో అక్క మృతదేహన్ని చూసి బంధువులకు వెల్డడించాడు. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రామ్దేవ్ మాత్రం పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు అనుమానించి అతడిని తమదైన శైలిలో విచారించారు. అంతే రామ్దేవ్ దారికి వచ్చి తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. రామ్దేవ్ను పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.