అక్కడ రెండో ప్రపంచయుద్ద బాంబులు దొరికాయి | World War II Bombs Found In Nagaland | Sakshi
Sakshi News home page

అక్కడ రెండో ప్రపంచయుద్ద బాంబులు దొరికాయి

Published Sun, Sep 25 2016 4:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

World War II Bombs Found In Nagaland

కొహిమా: నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కొహిమాలో రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన రెండు బాంబులు లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీఆర్ హిల్ కాలనీలో జరుగుతున్న నిర్మాణపనుల సందర్భంగా బాంబులు కూలీలకు దొరికినట్లు చెప్పారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బాంబులను డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు.

నిర్మాణపనులు పూర్తయ్యేవరకూ అనుమానాస్పదంగా కనిపించే ఏ వస్తువునీ తాకొద్దని కూలీలకు చెప్పినట్లు తెలిపారు. అలాంటి వస్తువులు ఏవైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement