ట్రయల్ అంటూ హార్లేడేవిడ్సన్ బైక్ తో జంప్ | Youth robs Harley-Davidson bike from Bike Showroom | Sakshi
Sakshi News home page

ట్రయల్ అంటూ హార్లేడేవిడ్సన్ బైక్ తో జంప్

Published Tue, Sep 1 2015 7:43 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

ట్రయల్ అంటూ హార్లేడేవిడ్సన్ బైక్ తో జంప్ - Sakshi

ట్రయల్ అంటూ హార్లేడేవిడ్సన్ బైక్ తో జంప్

బంజారాహిల్స్ (హైదరాబాద్) : ట్రయల్ రన్ అని చెప్పి ఖరీదైన హార్లేడేవిడ్సన్ బైక్ తో ఉడాయించాడో ఘనుడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే .. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న హార్లే డేవిడ్సన్ షోరూంకు మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో టిప్‌టాప్ డ్రెస్‌తో హీరోలా ఉన్న ఓ యువకుడు(25) వచ్చాడు. తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని, నెలకు లక్షన్నర వేతనం ఉంటుందని బడాయిలు చెప్పుకున్నాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-23లో తన నివాసమని నమ్మబలికాడు. పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్నాడు.

కొత్తగా వచ్చిన రూ.6 లక్షల విలువైన హార్లే డేవిడ్సన్ స్ట్రీట్-750 మోడల్ బైక్ కావాలంటూ బేరమాడాడు. తనతోపాటు తెచ్చిన క్రెడిట్ కార్డులను చూపించాడు. ట్రయల్ వేస్తానని బైక్‌తో బయటకు వెళ్లిన తాహెర్ మూడు గంటలు గడిచినా తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చిన షోరూం నిర్వాహకులు అతడు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో షోరూం మేనేజర్ షీలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ సీఐ పి.మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. యువకుడి ఊహాచిత్రాన్ని తయారు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement