హైదరాబాద్: దేశంలో అయిదో పెద్ద నగరం హైదరాబాద్‌లో చేపట్టిన మెట్రో రైలుకు మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పేరు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. ఆ మేరకు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతకంతో ఉన్న వినతి పత్రాన్ని ఆ పార్టీ రాష్ట్ర నేతలు కె. శివకుమార్, జి. సురేష్ రెడ్డి మెట్రో భవన్‌లో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డికి అందజేశారు.
దీనికి స్పందించిన ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తాను ఈ విషయాన్ని పై అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు కె. శివకుమార్, జి. సురేష్ రెడ్డిలు మాట్లాడుతూ హైదరాబాద్‌కు తలమానికం కాబోతున్న మెట్రో రైలు నిర్మాణ పనులు దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రూపుదిద్దుకున్నాయని తెలిపారు.
మెట్రో రైలుకు కలాం పేరు పెట్టాలి: వైఎస్సార్సీపీ
Published Tue, Aug 11 2015 6:03 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement