ఆమ్ ఆద్మీ హర్యానా సీఎం అభ్యర్థిగా యోగేంద్ర యాదవ్!
Published Mon, Dec 30 2013 5:48 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై పడింది. హర్యానా ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగేంద్ర యాదవ్ ను రంగంలోకి దించనున్నట్టు పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ తెలిపారు. రానున్న లోకసభ ఎన్నికల్లో అమేథి నుంచి రాహుల్ గాంధీపై పోటీకి కుమార్ విశ్వాస్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు విశ్వాస్ సమీప బంధువు. అమేథి బరిలో రాహుల్ పై పోటికి దిగనున్న విశ్వాస్.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిని కూడా అక్కడి నుంచే బరిలోకి దిగి పోటిని ఆసక్తిగా మార్చాలని సవాల్ విసిరారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిందని విశ్వాస్ తెలిపారు. ఇప్పటికే హర్యానాలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. యోగేంద్ర యాదవ్ తమ పార్టీ తరపున హర్యానాలో ముఖ్యమంత్రి అభ్యర్థి అని విశ్వాస్ వెల్లడించారు.
Advertisement
Advertisement