పశువైద్యం కోసం అంబులె న్స్‌లు | Ambulances for Veterinary Medicine | Sakshi
Sakshi News home page

పశువైద్యం కోసం అంబులె న్స్‌లు

Published Sat, Nov 15 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

Ambulances for Veterinary Medicine

బెల్లంపల్లి : మూగజీవాలకు సత్వర వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అంబులెన్స్ వాహనాలను సమకూర్చబోతోంది. 108 మాదిరిగానే పశువుల కోసం ప్రతీ అ సెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయనుంది. సకాలంలో వైద్యం అందక మూగజీవాలు మృ త్యువాతపడుతున్న నేపథ్యంలో అంబులెన్స్ సదుపా యం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అంబులెన్స్‌తోపాటు వైద్యానికి సంబంధించిన మందులు సమకూర్చి, వైద్యులను నియమించనుంది.

 వైద్యం కోసం అంబులెన్స్‌కు కబురు పంపడానికి ప్రత్యేకంగా ఫోన్ నంబర్  కూడా కేటాయిస్తారు. ఈ ప్రక్రియ త్వరలోనే అమలులోకి రానుంది. ఈ మేరకు బుధవారం శాసనసభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో మూగజీవాలకు వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి.

 జిల్లాలో పరిస్థితులివి..
 జిల్లాలోని 52 మండలాల్లో 97 వెటర్నరీ డిస్పెన్సరీలు, 49 సబ్ సెంటర్లు  ఉన్నాయి. వీటి పరిధిలో 101 మంది పశువైద్యాధికారులు పని చేయాల్సి ఉండగా ప్రస్తుతం 76 మంది మాత్రమే ఉన్నారు. మరో 25 పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు 74 గాను 11 మంది మాత్రమే పని చేస్తున్నారు. 63 పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 22 లక్ష ల వరకు పశుసంపద ఉన్నట్లు ఓ అంచనా. అంబులెన్స్‌ల ను ప్రవేశపెట్టడం వల్ల జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాలకు పశువైద్యం మెరుగుపడుతుంది. తద్వారా ఖాళీగా ఉన్న వైద్యాధికారులు, సిబ్బంది పోస్టులు భర్తీ అవుతాయి. మందుల కొరత కూడా తీరుతుంది.

 చేరువ కానున్న వైద్యం
 ఇప్పటి వరకు మూగజీవాలకు కేవలం వెటర్నరీ డిస్పెన్సరీలు, సబ్‌సెంటర్‌లలో మాత్రమే వైద్యం అందుతోంది. మూగజీవాల యజమానులు పశువులను డిస్పెన్సరీలకు తీసుకెళ్తే వైద్యులు, సిబ్బంది పరీక్షించి వైద్యం అందిస్తున్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎక్కడైన మూగజీవాలకు ప్రాణాపాయ స్థితి ఉన్నట్లు ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు 108 అంబులెన్స్ మాదిరిగానే సదరు మూగజీవి ఉన్న చోటికి వెటర్నరీ అంబులెన్స్ వెళ్తోంది.

అంబులెన్స్‌లో ప్రత్యేకంగా సరిపడ మందులు అందుబాటులో ఉంచి, వైద్యుడు, సిబ్బందిని నియమిస్తారు. మూగజీవి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి వైద్యం చేస్తారు. చాలా మట్టుకు గ్రామాల్లో సకాలంలో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. గొర్రెలు, మేకలు, పశువులు ఒక్కోసారి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి అందుబాటులో వైద్యం లేక చనిపోతున్న సంఘటనలు కోకొల్లలు. అనారోగ్యానికి గురైన పశువులకు సకాలంలో వైద్యం అందకపోవడం, యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవడం వల్ల కూడా మూగజీవాలు మృత్యువుకు చేరువవుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టనున్న అంబులెన్స్‌ల వల్ల పశువైద్యం మెరుగుపడుతుందనడంలో సందేహం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement