veterinary medicine
-
ఇంటి పేరు గోల్డ్ మెడల్
‘గొడ్ల చావిడిలో పశువుల ఆలనా పాలనా స్త్రీలు చూసినప్పుడు వాటికి వైద్యం మేమెందుకు చేయలేము’ అంటున్నారు నేటి యువతులు.శ్రీ వెంకటేశ్వర పశు వైద్యశాల 12వ స్నాతకోత్సవంలో ‘బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్’ చదివిన లొగుడు ప్రత్యూష ఏకంగా 7 గోల్డ్ మెడల్స్ సాధిస్తే, తీర్థాల హేమనయని 5 గోల్డ్ మెడల్స్సాధించింది.వెటర్నరీ రంగంలో 60 శాతం సీట్లు అమ్మాయిలే సొంతం చేసుకుంటున్నారని పశు వైద్యరంగంలో తమ సామర్థ్యం చూపి ఉపా ధి అవకాశాలు అందుకుంటున్నామని వారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పశువైద్యానికి సంబంధించిన ఏకైక యూనివర్సిటీ– శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు అద్భుత ప్రతిభ చూపిస్తున్నారు. జూలై 22న జరిగిన 12వ స్నాతకోత్సవంలో ‘బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్’ (బి.వి.ఎస్.సి) కోర్సులో ఒకరు ఏడు స్వర్ణాలు, మరొకరు ఐదు స్వర్ణాలు సాధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసలు అందుకున్నారు. ఒకప్పుడు పశు వైద్యంలో మగవారే 90 శాతం ఉండేవారు. నేడు అరవై నుంచి డెబ్బయి శాతం అమ్మాయిలే ఉంటున్నారు. బి.వి.ఎస్.సిలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 200 పై చిలుకు సీట్లు ఉంటే వాటిలో ప్రతి ఏటా అమ్మాయిలే ఎక్కువ సీట్లు ΄పొందుతున్నారు. తిరుపతి, పోద్దుటూరు, గన్నవరం, గరివిడిలలో ఉన్న నాలుగు కాలేజీలు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కిందకే వస్తాయి. సీట్లు తక్కువే అయినా వాటిని ΄పొందుతున్న అమ్మాయిలు ఎక్కువ. ‘ఈ రంగంలో మాకు ఆసక్తి ఉంది. చేయగల సామర్థ్యం ఉంది. అవకాశాల పట్ల ఎరుక ఉంది’ అంటున్నారు వాళ్లు. 7 స్వర్ణాలు సాధించిన ప్రత్యూష, 5 స్వర్ణాలు సాధించిన హేమనయని అంతరంగాలు... ఆంధ్రా నుంచి అమెరికా వరకు అవకాశాలు మనుషులకు వైద్యం చేసే డాక్టర్లు మనుషులకు మాత్రమే చేస్తారు. కాని మేము భిన్న జంతు జీవాలకు వైద్యం చేస్తాం. కుక్క, పిల్లి, ఆవు, గేదె, గుర్రం, గొర్రె... ఒక్కోదానికి ఒక్కో రీతిన వైద్యం చేయాలి. నేడు పశువైద్యం చదివితే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ భద్రత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. లేదంటే కొద్దిపా టి పెట్టుబడితో పెట్ క్లినిక్ పెట్టుకుంటే మంచి ఉపా ధి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఎన్నో ఉపా ధి అవకాశాలు వెటర్నరీ డాక్టర్లకు ఉండటం వల్ల, రిజర్వేషన్ ప్రయోజనం అదనంగా జతై నేడు ఎక్కువమంది అమ్మాయిలు పశువైద్యం చదువుతున్నారు. నేను కూడా ఆ అవగాహనతోనే పోద్దుటూరు వెటర్నరీ కాలేజీలో బి.వి.ఎస్.సి చేశాను. నాకు 5 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉంది. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొండమంచిలి గ్రామం. నాన్న నా చిన్న వయస్సు నుంచే గల్ఫ్ దేశాలకు వెళ్లారు. నేను బాగా చదవడానికి మా అక్క, అమ్మ ముఖ్య కారకులు. అక్కయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని నాకు అండగా ఉంటోంది. ఇంటర్ వరకు పా లకొల్లులో చదివాను. ఇంటర్ బై.పి.సిలో 987 మార్కులు సాధించి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాను. జంతువుల పట్ల ప్రేమతో ఎలాగైనా వెటర్నరీ డాక్టర్ కావాలని ఎంసెట్ రాసి 1499 ర్యాంకును సాధించాను. ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధించాలని తపన పడేదానిని. రోజుకు సుమారు 4 నుంచి 6 గంటలు చదివాను. సెలవురోజులలో కళాశాలలో ఉన్న లైబ్రరీలను, ల్యాబ్‌లను సందర్శించి ప్రాక్టికల్‌గా సబ్జెక్ట్‌ను అర్ధం చేసుకుని చదివాను. కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రస్తుతం వెటర్నరీ పీజి చేయాలని ప్రవేశ పరీక్ష రాశాను. భవిష్యత్తులో పశువైద్య అధ్యాపకురాలుగా రాణించాలని ఉంది. – తీర్థాల హేమనయని, బి.వి.ఎస్.సి, 5 బంగారు పతకాల గ్రహీత, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ,ప్రోద్దుటూరు. పశు వ్యాధులను శోధించే సైంటిస్ట్ అవుతాను నేనిప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో ‘ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’లో పిజి సీటు సాధించి వెటర్నరీ మైక్రోబయాలజీ చేస్తుండటం వల్ల మొన్నటి స్నాతకోత్సవానికి హాజరు కాలేకపోయాను. కాని 7 గోల్డ్ మెడల్స్ సాధించడం మాత్రం సంతోషంగా ఉంది. చదువులో బాగా రాణించాలని రోజుకు ఆరు గంటలు చదివాను. సీనియర్లు, అధ్యాపకులు బాగాప్రోత్సహించారు. బి.వి.ఎస్.సిలో ఐదు సంవత్సరాల్లో 18 సబ్జెక్ట్స్ చదువుతాము. వాటిలో దాదాపు 17 గోల్డ్‌మెడల్స్ ఉంటే నాకు 7 వచ్చాయి. మాది అనంతపురం. మా నాన్న గవర్నమెంట్ టీచర్. నేను తిరుపతి కాలేజీలో బి.వి.ఎస్.సి చేశాను. ఎం.బి.బి.ఎస్ డాక్టర్ కావాలని ఇంటర్లో బై.పి.సి చదివి 969 మార్కులు సాధించాను. నీట్లో సీట్ రాకపోయినా బాధపడలేదు. ఎంసెట్‌లో 1248వ ర్యాంకు సాధించి వెటర్నరీ కళాశాలలో బి.వి.ఎస్.సి డిగ్రీలో చేరాను. మనుషులకు వైద్యం చేసే డాక్టరైనా పశువులకు వైద్యం చేసే డాక్టరైనా డాక్టరే. చిన్నప్పటి నుంచి నాకు మూగజీవాలంటే ఇష్టం. ఆడవాళ్లు పశువుల ఆలనా పా లనా బాగా చూస్తారు. వైద్యం కూడా బాగా చేయగలరని నా నమ్మకం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో పశు వైద్యానికి సంబంధించిన ఇన్ఫ్రా తక్కువే ఉంది. కాని ఇటీవల పెట్స్‌కు డిమాండ్ పెరిగింది. అయితే రేబిస్ వంటి ఏ ఒకటి రెండు వ్యాక్సిన్ల గురించి మాత్రమే కాకుండా పశువులకు సంబంధించిన ఎన్నో వ్యాక్సిన్ల గురించి తగినంత చైతన్యం రావాలి. నాకైతే పశువులకు వచ్చే వ్యాధుల గురించి పరిశోధించే సైంటిస్ట్ కావాలని ఉంది. వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా ఇవి పశువులకు ఎలా జబ్బులు కలిగిస్తాయో పరిశోధనలు కొనసాగుతూ ఉంటే పశువులను కాపా డటమే కాదు వాటి వల్ల మనుషులకు వచ్చే జబ్బులను కూడా నిరోధించి మనుషులనూ కాపా డవచ్చు. – లొడుగు ప్రత్యూష, బి.వి.ఎస్.సి, ఏడు బంగారు పతకాల గ్రహీత, ఎస్.వి. వెటర్నరీ కళాశాల, తిరుపతి -
పాడి పరిశ్రమ, పశు వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
చీపురుపల్లి(గరివిడి): పశు సంపద పుష్కలంగా ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యపడుతుందన్న గాంధీజీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో పశు సంపద, పాడి పరిశ్రమ, పశు వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు తెలిపారు. గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి చెందిన పశువైద్య కళాశాలలో రూ.81.25 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించిన పశువైద్య చికిత్స సముదాయం, పశుగణ క్షేత్ర సముదాయం, బాలుర, బాలికల వసతిగృహాల భవనాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో సీదిరి మాట్లాడారు. ఏపీలో ఆర్బీకేలలో అందిస్తున్న సేవలు దేశ చరిత్రలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రతీ వెయ్యి మూగజీవాల వైద్య సేవలకు ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ను నియమించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మనుషుల వలే త్వరలో వెటర్నరీ అంబులెన్స్‌లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీనికి సీఎం ఇప్పటికే ఆమోద ముద్రవేశారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మూగజీవాలకు కష్టంవస్తే మండల, నియోజకవర్గ కేంద్రాల్లోని ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఊరిలోనే వైద్యసేవలు అందజేస్తున్నట్టు వెల్లడించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా పటిష్ట్రపణాళికలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. పశు వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి భవిష్యత్‌లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. గరివిడిలో పశు వైద్య కళాశాల అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కళాశాలను అభివృద్ధి చేస్తోందన్నారు. గరివిడిలోని కళాశాలను వర్సిటీ స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌కు విద్యార్థులే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్‌కు విద్యార్థులే పెట్టుబడి అని, వారి చదువుల కోసం ప్రభుత్వం అధిక నిధులు ఖర్చుచేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కలెక్టర్, వైస్‌చాన్సలర్ సూచనల మేరకు రూ.5 కోట్ల వ్యయంతో జిల్లా స్థాయి ఆడిటోరియంను గరివిడి పశువైద్య కళాశాలలో నిర్మించనున్నట్టు వెల్లడించారు. గరివిడిలో పశువైద్య కళాశాలకు 2016లోనే జీఓలు ఇచ్చినప్పటికీ పనులపై అప్పటి ప్రభుత్వం శ్రద్ధ చూపలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పశువైద్య కళాశాల అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో పశువైద్య వృత్తికి భారీ డిమాండ్ పెరుగుతోందన్నారు. కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలనతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నది సీఎం అభిమతంగా పేర్కొన్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పశువైద్య కళాశాలకు జీఓలు ఇచ్చినప్పటికీ కేంద్రం అనుమతులు తీసుకురాలేదన్నారు. ఎంపీ అయ్యాక కేంద్ర అధికారులతో మాట్లాడి, బృందాలను రప్పించి పరిశీలన జరిపించి అనుమతులు తెప్పించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ పద్మనాభరెడ్డి, బోర్డు మెంబర్లు జీఎస్.రెడ్డి, జానకీరామ్, విజయ్‌కుమార్, కలెక్టర్ ఎ.సూర్యకుమారి, అసోసియేట్ డీన్ సీవీ రాయులు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, సర్పంచ్ గేదెల కృష్ణవేణి, ఏఎంసీ చైర్మన్ దన్నాన జనార్దనరావు, నాలుగు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు కేవీ సూర్యనారాయణరాజు, ఎస్వీ రమణరాజు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, పొట్నూరు సన్యాసినాయుడు, తహసీల్దార్ టి. గోవింద, ఎంపీడీఓ జి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబువి శవ రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతూ సిగ్గులేని మాటలు చెబుతున్న చంద్రబాబునాయుడు ‘శవాల వద్దకే చంద్రబాబు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రి డా.సీదిరి అప్పలరాజు విమర్శించారు. విజయనగరం జిల్లా గరివిడిలో పశువైద్య కళాశాలలో కొత్తగా నిర్మించిన చికిత్స సముదాయాలను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంగ్లిష్ మీడియంపై సిగ్గులేని మాటలు అడుతున్నారని విమర్శించారు. ఇంగ్లిష్ మీడియం చదివితే మొద్దు అవుతారన్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఆయన కొడుకు, మనవడు ఏ మీడియంలో చదివారు... మనవడుకు తెలుగు అక్షరాలు వచ్చా అని ప్రశ్నించారు. చంద్రబాబు పిల్లలు, కుటుంబ సభ్యులు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదవాలే తప్ప రాష్ట్రంలోని పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవకూడదన్నది ఆయన నైజమన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంక్షదబాబు చేయలేని పనులు రెండేళ్లలో జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. ప్రజల్లో మంచి పేరు రావడంతో జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. మాతృభాష అయిన తెలుగును గౌరవిస్తూనే... మన రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపేలా ఆంగ్లమాధ్యమ చదువులకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న ఆంగ్లమాధ్యమ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమల్లోకి తెచ్చారన్నారు. చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడు కదా... అక్కడ ఆంగ్లమాధ్యమం అమలుపై ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు జై జగన్ అంటూ జనం నినదిస్తున్న తీరుచూస్తే ‘బాబుకు బాదుడే బాదుడు’ తప్పదన్నారు. 2024 నాటికి తెలుగు దొంగల పార్టీ అంతరించిపోవడం ఖాయమన్నారు. ఎన్ని శవ యాత్రలు చేసినా, లోకేష్ ఎన్ని శవాలు వద్దకు వెళ్లి ఫొటోలు తీయించుకున్నా ప్రజలు నమ్మరని చెప్పారు. 2024లో మరోసారీ భారీ మెజారిటీతో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు మానుకుని హుందాగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నారు. -
మూగ వేదన
♦ జిల్లా అంతటా అరకొర పశువైద్యం ♦ అందుబాటులో ఉండని వైద్యులు ♦ చాలా చోట్ల గోపాలమిత్రల వైద్యమే దిక్కు ♦ గణనీయంగా తగ్గుతున్న పశు సంతతి ♦ పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం జిల్లాలో పశు వైద్యం పడకేసింది. పలు ఆస్పత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. రోగాల బారిన పడ్డ పశువులకు అటెండర్లు, గోపాలమిత్రల వైద్యమే దిక్కవుతోంది. కొన్ని ఆస్పత్రులకు డాక్టర్లే లేకపోగా, ఉన్న చోట వైద్యులు సమయపాలన పా టించడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో అటెండర్లే వైద్యుల విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణకు మూలాధారమైన మూగజీవాలను రక్షించుకునేందుకు ఆరాటపడుతున్న పశు పోషకుల ఆశలు అడియాశలవుతున్నాయి. మందులు సమృద్ధిగానే ఉన్నాయి... వైద్యానికి అవసరమైన మందులు సరిపడా ఉన్నాయి. ఈ మధ్యనే ఖాళీ పోస్టుల భర్తీ కూడా జరిగింది. జిల్లాలో ఆస్పత్రుల పనితీరు బాగానే ఉంది. వాస్తవంగా వైద్యులందరూ తాము పనిచేసే చోటే నివాసం ఉండాలి. అయితే చాలా చోట్ల దగ్గర్లోని పట్టణాల్లో ఉంటున్నారు. వీరందరూ ఆస్పత్రులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. డాక్టర్ ఎస్. వెంకటరావు, పశు సంవర్థక శాఖ జేడీ. చిత్తూరు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తక్కువైనా పశు సంతతి మాత్రం ఎక్కువే. సు మారు ఆరు లక్షలమందికి పైగా పశుపోషకులు ఉన్నారు. వ్యవసాయం, పాడి పరి శ్రమలపై ఆధారపడే శ్రమజీవులూ ఎక్కువ. జిల్లా పశు సంవర్థక శాఖ గణాం కాల ప్రకారం ఆవులు, గేదెలు, ఎడ్లు వంటివన్నీ కలిపి 10 లక్షలకు పైనే ఉన్నాయి. ఏడాదికి ప్రభుత్వం జిల్లా పశువైద్యం కోసం రూ.3 కోట్ల మేర నిధులను కేటా యిస్తున్నట్లు పశు సంవర్థక శాఖ గ ణాంకాలు చెబుతున్నాయి. అయితే జిల్లాలో పశు వైద్యం మాత్రం అరకొరగా మారింది. సగానికి పైగా మండలాల్లో పశు వైద్యం అందుబాటులో లేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన ఆస్పత్రి భవనాలు, అందుబాటులో ఉండని డాక్టర్లు, కొరవడ్డ కనీస సదుపాయాల వంటి సమస్యలతో పశుపోషకులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. సమయపాలన ఏదీ.. జిల్లాలో పశు సంవర్థక శాఖ వైద్యులు సమయ పాల న పాటించడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరంతా మండల కేంద్రాల్లో ఆస్పత్రులకు అందుబాటులో ఉండాలి. అయితే ఉన్న వైద్యుల్లో 60 శాతం మంది దగ్గర్లోని పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. పిల్లల చదువుల కోసమనో, కుటుంబ సభ్యుల ఉద్యోగాల కోసమనో కారణాలు చూపుతూ పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో 55 వేల పశువులున్నాయి. 30 వేల కుటుంబాలు పాడిపై ఆధారపడి జీవిస్తున్నాయి. చిత్తూరు గ్రామీణ మండలంలోని కుర్చివేడు, మాపాక్షి పశువైద్య శాలల్లో వైద్యులు లేరు. కుర్చివేడులో ఇన్చార్జ్ డాక్టర్ అడపాదడపా వెళ్లి వైద్యం చేస్తున్నారు. ఇక మాపాక్షిలో అయితే వైద్యుడు 50 రోజులు సెలవుపై వెళ్లడంతో అటెండర్లే వైద్యం చేస్తున్నారు. నియోజకవర్గంలో 12 గ్రామీణ పశు వైద్యశాలలున్నా, అందులో ఎనిమిదింటికి పక్కా భవనాలు లేవు. ఈ ఆసుపత్రుల్లో మొత్తం 41 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎనిమిది పశువైద్యశాలలున్నాయి. ఆరుగురు డాక్టర్లున్నారు. తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం వంటి చోట్ల వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన రిటైర్డ్ అయిన కాంపౌండర్ అడపాదడపా వైద్యుడి అవతారం ఎత్తాల్సి వస్తోంది. మందుల జాబితాలో ఖరీదైన మందులు లేకపోవడంతో చిన్నగొట్టిగల్లు, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల్లోని ప్రజలు, రైతులు బయట మందుల షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. థైలేరియా, గర్భకోశ వ్యాధులు, పొదుగువాపు వ్యాధి, కుక్కలకు సంబం ధించి రేబిస్ టీకాలు, యాంటీబయాటిక్స్, సెలైన్స్, నొప్పి నివారణ మందుల కొరత ఎక్కువగా ఉంది. నీలి నాలుక, పీపీఆర్(పారుడురోగం), బ్రూసెల్లోసీస్, అంత్రాక్స్, గొంతువాపు, నట్టల నివారణ వ్యాధులకు సీజన్ల వారీగా ఉచితంగా టీకాలు వేస్తున్నా...మధ్యమధ్యలో వ్యాధులు సోకితే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. కుంట్రపాకం, పెరుమాళ్లపల్లి వంటి చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. అత్యవసర మందులు, వీర్యం వంటివి నిల్వ చేసుకునేందుకు సరైన వసతులు కూడా అంతంత మాత్రమే. మదనపల్లె మండలంలో అంకిశెట్టిపల్లె, సీటీఎం పశువైద్యకేంద్రాలలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. మదనపల్లె పశు ఆరోగ్యకేంద్రంలో ఏడీ, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారు. కుక్కలు, గేదెలకు ఎప్పుడన్నా పాము కాటు వేస్తే మందులు బయటనుంచి తెచ్చుకోవాలని చెపుతున్నారు. చిన్నచిన్న రోగాలకు తప్ప మరే ఇతర వాటికి మందులు లేవు. మదనపల్లెలో విధులు నిర్వర్తించే అసిస్టెంట్ డైరెక్టర్ సెలవులో ఉన్నందున పుంగనూరు ఏడీ ఇన్చార్జ్గా ఉంటున్నారు. అయితే పారా మెడికల్ సిబ్బంది, కాంపౌండర్లు మాత్రమే ఇక్కడ వైద్య సేవలందిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో ఆరు వెటర్నరీ ఆస్పత్రులు, పది సబ్సెంటర్లున్నాయి. మొత్తం ఆరు మండలాల్లో 67వేల దాకా అన్ని రకాల పశువులున్నాయి. అయితే సంబంధిత ఆస్పత్రుల్లో పశువులకు సరైన వైద్యం అందడం లేదు. ఉదయం 8 నుంచి 12 వరకు సాయంత్రం 3 నుంచి 5 వరకు ఇవి పనిచేయాలి. కానీ ఉదయం తప్ప సాయంత్రం వేళల్లో ఇవి పనిచేయడం లేదు. గడచిన ఆరు నెలల కాలంలో ఈ ప్రాంతంలో సుమారు 17 ఆవులు వివిధ రోగాలతో మృతి చెందాయి. ఈ విధంగా జిల్లాలోని సగానికి పైగా మండలాల్లో ఈ తరహా సమస్యలున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే సమయపాలనలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. శిథిల భవనాలతో అవస్థలు... జిల్లాలోని 50కి పైగా వైద్యశాలలు శిథిలమయ్యాయి. వర్షం వస్తే చాలు సగానికి పైగా భవనాలు ఉరుస్తున్నాయి. ఈ క్రమంలో మందులు దాచే చోటు లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. పాడైన కిటికీలు, దెబ్బతిన్న తలుపులతో నానా అవస్థలు పడాల్సి వస్తోంది. -
నాటు నమ్మితే కాటికే..!
పెరుగుతున్నపాముకాటు బాధితులు ♦ నాటువైద్యం నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న వైనం ♦ ఏడాదిలో 300ల మందకిపైగా మృత్యువాత ♦ వచ్చే రెండు నెలలు అత్యంత ప్రమాదకరం ♦ ముందస్తు జాగ్రత్తలే మేలంటున్న వైద్యులు మహబూబ్‌నగర్ క్రైం: గ్రామీణ ప్రాంతం అంటేనే వ్యవసాయ పనులు చేసుకునే వారు ఎక్కువ.. పగలూరాత్రీ అనే తేడా లేకుండా పనులు చేస్తూనే ఉంటారు.. ఇక పిల్లలు, విద్యార్థులు అయితే చెట్లు, పుట్టల మధ్య తిరుగుతూ ఆడుకుంటారు. మారుమూల గ్రామాలు, తండాల్లో వంట కోసం కట్టెల తీసుకురావడానికి మహిళలు సమీప అడవులు, గుట్టల దగ్గరకు వెళ్తుంటారు. ఇవన్నీ రోజువారి జరిగే కార్యక్రమాలే అయితే వర్షాకాలం వచ్చే సరికి మాత్రం అందరూ భయపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం.. ఈ కాలంలో వర్షం పడటం వల్ల విషపురుగులు రాత్రిపూట చల్లదనంతో అడవుల నుంచి ఉపశమనం కోసం ఇళ్లలోకి వస్తుంటాయి. వారి పనుల కోసం ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ వాటిని గమనించకపోవడంతో పొరపాటున అవి కాటు వేయడం జరుగుతుంది. దీంతో ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ప్రస్తుతం వర్షాకాలం పూర్తిగా రాకముందే పాముకాటు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న పాముకాటు మృతులు, వైద్యసేవలు, జాగ్రత్తలపై ‘సాక్షి’ కథనం.. సరైన సమయంలో వైద్యం అందక.. పాలమూరు ఉమ్మడి జిల్లాలో పాముకాటు సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఇది మరీ ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. గత వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు ఏడాదిలో దాదాపు 300ల మందికి పైగా కేవలం పాముకాటుతోనే మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కూలీ చేసుకుని జీవించే నిరుపేదలతోపాటు పంట పొలాల దగ్గరకు కాపల కోసం వెళ్తున్న రైతన్నలు ఎక్కువగా బలవుతున్నారు. చేను పనికి వెళ్లినప్పుడు పొదల్లో చేతులు పెట్టడం, అందులోంచి కాలినడకన వెళ్లడం చేస్తుండడంతో పాముకాటుకు గురవ్వుతున్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మూఢనమ్మకాలపై ఆధారపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చాలా వరకు మూఢనమ్మకాలను నమ్ముతూ నాటువైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పాముకాటుకు గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సింది పోయి మంత్రాలు, తంత్రాలకు తగ్గుతుందని చెప్పే వారి దగ్గరకు.. ఏవో చెట్ల మందులు ఇచ్చే వారి వద్దకు తీసుకువెళ్తున్నారు. వారు ఏదో ఒక ఆకు పసరు రుద్ది పంపిస్తున్నారు. పరిస్థితి విషమిస్తే మాతో కాదని ఇతర ఆస్పత్రులకు తీసుకువెళ్లండని తొందర పెడుతున్నారు. తీరా ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే బాధితుడి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మందుల నిల్వకు ఇబ్బంది.. జిల్లాలో ఉన్న జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పాముకాటుకు సంబంధించిన మందును చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. దీనికోసం ప్రత్యేకంగా ఫ్రిజ్‌ను ఉంచాలి. ఇది నిరంతరం పనిచేస్తూ ఉండాలి. జిల్లా ఆస్పత్రితోపాటు నారాయణపేట ఏరియా ఆస్పత్రి, బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో తప్ప మిగతా 28 పీహెచ్‌సీల్లో ఫ్రిజ్‌లు పనిచేయడం లేదని తెలుస్తోంది. పాముకాటు ప్రమాదాలు ఇలా.. జిల్లాలో పాముకాటుతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 17న ధన్వాడ మండలం మాధ్వార్‌కు చెందిన ఆంజనేయచారి(35) పాముకాటుకు గురై రాత్రికి రాత్రి మృత్యువాత పడ్డాడు. ఈ నెల 17న తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన అనిత(18) పాముకాటుకై గురై మృతి చెందింది. ఆమనగల్లు మండలంలోని కడ్తాల పంచాయతీ పరిధిలోని పెద్దారెడ్డి చెరువు తండాకు చెందిన బాల్యనాయక్(45) పంట పొలంలో పశువులు మేపుతుండగా గడ్డిలో ఉన్న పాముకాటు వేయడంతో మృత్యువాతపడ్డాడు. ఈ నెల 6న కేశంపేట మండలం నిర్ధవెళ్లికి చెందిన గిద్దెల చిన్న కేశవులు(26), ఈ నెల 4న మిడ్జిల్ మండలంలోని కొత్తూర్‌కు చెందిన విద్యార్థి శివకుమార్(11), ఈ నెల 3న ధరూరు మండలం మాల్‌దొడ్డికి చెందిన చంద్రిక(4) ఇంట్లో నిద్రపోతున్న సమయంలో పాటుకాటు వేయడంతో మృతిచెందింది. ప్రభుత్వ వైద్యులకు శిక్షణేదీ..? పాము కాటేస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో విషం విరుగుడు మందులు అందుబాటులో ఉన్నా అత్యధిక చోట్ల మరణాలే సంభవిస్తున్నాయి. చికిత్స విధానంలో వైద్యులు సరైన పద్ధతి పాటించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంటుంది. అన్ని వసతులున్న జిల్లా ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి. ఇటీవల భూత్పూర్కు చెందిన ఓ రైతును పాము కాటేస్తే జిల్లాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ల్లాస్పత్రిలో పాముకాటుకు విరుగుడు మందులున్నా వైద్యుల్లో చికిత్సపై అవగాహన లేక ప్రజల ప్రాణాలకు రక్షణ లభించడం లేదు. ప్రభుత్వ వైద్యులకు దీనిపై ప్రత్యేక శిక్షణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జిల్లా ఆస్పత్రిలో వైద్యులు చేతులెత్తేసిన రోగులకు పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడుకోవడం ఇక్కడ ప్రభుత్వ వైద్యుల పని డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఇక విష సర్పాలు కాటేయ్యకున్నా మాములు సర్పం కాటేసినా విరుగుడు చికిత్స అందిస్తుడటంతో అదీ ప్రాణాలమీదకొస్తుందనే వాదనలున్నాయి. ఆర్ఎంపీలను ఆశ్రయించొద్దు.. జిల్లాలో పాముకాటు వేసిన తర్వాత ఎక్కువ శాతం మంది నాటు వైద్యులను, ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితంగానే మరణాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో యాంటీ స్నేక్ బైట్ మందు ఎక్కడ కొరత లేదు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికంగా మందులు తీసుకువచ్చాం. ఇప్పటికే చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం. చాలామంది భయం వల్ల పీహెచ్‌సీలకు రావడంలో ఆలస్యం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో జిల్లాలో మరణాల సంఖ్య కొంత పెరుగుతుంది. దీనిపై దృష్టి పెడుతాం. జిల్లాలో ఎక్కడైనా మందు లేని పీహెచ్‌సీలు ఉంటే వెంటనే ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీచేస్తా. – డాక్టర్ హరీష్‌చంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ, మహబూబ్‌నగర్ -
మూగరోదన
♦ పశువైద్యం... దైన్యం మూగజీవాలకు దేవుడే దిక్కు ♦ సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న కేంద్రాలు ♦ చాలాచోట్ల అటెండర్లే దిక్కు ఇప్పటికే చాలా కేంద్రాల మూత ♦ కబేళా బాట పట్టిన పశువులు పశువులది మూగరోదనే... సిబ్బంది కొరతతో వైద్యం అందని పరిస్థితి. పశు వైద్య కేంద్రాలు చాలావరకు మూతపడ్డాయి. అక్కడక్కడా ఉన్న కేంద్రాల్లో అటెండర్లే వైద్యమందిస్తున్నారు. మూగజీవాలు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి. దాణా లేక బక్కచిక్కి కబేళా బాటపడుతున్నాయి. రెండేళ్లుగా వరుస కరువుతో చితికిపోయిన రైతు ప్రత్యామ్నాయంగా పాడి మీదే ఆధారపడ్డాడు. పాడికి ఆయువుపట్టు అయిన పశువైద్యం లేక ఈ పరిశ్రమ కూడా చతికిలపడింది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మిల్క్‌గ్రిడ్’ కూడా డీలా పడింది. ఫలితంగా మూగజీవాలకు దేవుడే దిక్కయ్యాడు. - గజ్వేల్ గజ్వేల్ : జిల్లాలో దశాబ్దాలుగా వ్యవసాయూనికి అనుబంధంగా పాడి పరిశ్రవును అభివృద్ధి చేసుకుంటూ రైతులు జీవనాన్ని సాగిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 8.5 లక్షల ఆవుజాతి, గేదె జాతి పశువులు, 16 లక్షల గొర్రెలు, మేకలు, మరో కోటికిపైగా వాణిజ్య కోడిపిల్లల పెంపకం సాగుతోంది. కరువు కారణంగా పంటలు చేతికందక రైతులు అల్లాడుతున్నారు. ఈ దశలో పాడి పరిశ్రమ ప్రత్యామ్నాయ ఉపాధిగా ఎంచుకున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు కొరవడటం వారికి శాపంగా మారింది. మిల్క్గ్రిడ్తోపాటు ఇతర పథకాల అవులుకు పశువైద్య కేంద్రాల్లో నెలకొన్న సవుస్యలు అవరోధంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది కొరత... జిల్లాలో మొత్తం 106 పశువైద్యాధికారుల పోస్టులకు గాను ప్రస్తుతం 47మంది మాత్రమే పనిచేస్తున్నారు. 136మంది డిప్లొమా హోల్డర్స్గాను 90మంది, 236 మంది నాల్గో తరగతి ఉద్యోగులకు 186మంది మాత్రమే పనిచేస్తున్నారు. గజ్వేల్‌లోనే ఇలా... జిల్లాను డెయిరీ హబ్ తీర్చిదిద్దడానికి ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో తొలిదశలో ఈ పథకానికి 2014 డిసెంబర్లో అంకురార్పణ చేశారు. ఈ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మొత్తం 12మంది వైద్యాధికారులు పోస్టులకుగాను ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30మంది డిప్లొమా హోల్డర్స్గాను 18పోస్టులు ఖాళీగా, 20 మంది నాల్గోతరగతి ఉద్యోగులకు గాను 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదిలావుంటే గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లితోపాటు మరికొన్ని కేంద్రాలు మూతపడ్డాయి. నియోజకవర్గంలోని చాలా కేంద్రాలు అటెండర్ల ఆధారంగానే నడుస్తున్నాయి. ఏటా రూ.1.40కోట్ల మందులు మాత్రమే పంపిణీ జిల్లాలో ప్రస్తుతం సిబ్బంది ఉన్న పశువైద్య కేంద్రాల్లో గురక వ్యాధికి హెచ్ఎస్ వ్యాక్సిన్, జబ్బవాపు టీకా, గాలికుంటు టీకాలు అందుబాటులో ఉన్నాయి. సీజనల్ వ్యాధులు, సాధారణ చికిత్సలకు అవసరమయ్యే యాంటీబయెటిక్స్, లివర్ సపోర్ట్, నట్టల నివారణ తదితర మందులు ఏటా నాలుగు దఫాలుగా రూ.1.40కోట్ల విలువైన మందులు మాత్రమే సరఫరా అవుతున్నాయి. నిజానికి ఈ కేటాయింపు రెట్టింపు అంటే ఏడాదికి రూ.2.80 కోట్ల మందులు అందిస్తే రైతులకు ఊరట లభించే అవకాశముంది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో పశువైద్యం కోసం రైతులు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది. జిల్లాలో పశువైద్యం అందక, పోషణకు అనువైన పరిస్థితుల్లేక రైతులు తమ పశువులను తెగనమ్ముకుంటున్నారు. పేరులోనే పాలను ఇముడ్చుకున్న ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ దయనీయ గాథను ‘సాక్షి’ ప్రచురించిన సంగతి తెల్సిందే. ఒక్క క్షీరసాగర్ గ్రామమే కాదు. అన్ని గ్రామాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరతతో ఇబ్బందులు... జిల్లాలో పశువైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఫలితంగా పలు సమస్యలు ఎదురవుతున్నాయి.పాల సేకరణను పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాన్ని రైతులు హర్షిస్తున్నారు. పశువైద్య కేంద్రాల్లో నెలకొన్న ఖాళీలను భర్తీచేస్తే భారీ ప్రయోజనం చేకూరుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. - లక్ష్మారెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ -
పాపం.. పశువులు
అందీఅందని వైద్యంతో మూగజీవుల అవస్థలు పశువైద్యంపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. మూగజీవులే కదా..! బతికినా..చచ్చినా.. ప్రశ్నించేవారెవరు అనే రీతిలో వైద్యసేవలందిస్తున్నట్లు మంగళవారం ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. పలు వైద్యశాలల్లో డాక్టర్ల కొరత ఉంది. వైద్యులున్నచోట అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఒకే వైద్యుడు రెండు, మూడు ఆస్పత్రులకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ‘ఇన్చార్జి’ బాధ్యతలున్న చోటుకి ఒక్కసారి కూడా వెళ్లని డాక్టర్లూ ఉన్నారు. అటెండర్లు, స్వీపర్లు, కొద్దోగొప్పో వైద్యం తెలిసిన ప్రైవేట్ వ్యక్తులు తోచిన వైద్యం చేసి పశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పలు పశువైద్యశాలలు శిథిలావస్థకు చేరాయి. పంచాయతీ కార్యాలయమో.. మరోచోటో మందులు నిల్వ చేసుకోవాల్సిన దుస్థితి ఉంది. పొదుగువాపు, పాము, కుక్కకాటు వ్యాక్సిన్ల సరఫరాను ప్రభుత్వమే మరిచింది. ఇక పశుసంవర్థకశాఖ జిల్లాస్థాయి అధికారులైతే ఏనాడో వైద్యశాలలను సందర్శించటం మానేశారు. మొత్తంగా పశువైద్యం.. అందని ద్రాక్షే అయింది. సాక్షి, ఖమ్మం: జిల్లాలోని పశు వైద్యశాలల్లో మూగజీవాలకు వైద్యం సరిగా అందటం లేదు. డాక్టర్ల కొరత, ఉన్నచోట సరైన సమయానికి రాకపోవడం, సీజనల్ వ్యాధులకు మందులు లేకపోవడంతో జిల్లాలో పశువులకు వైద్యం కరువైంది. ఏజెన్సీలో డాక్టర్లు లేక అటెండర్లే పశు వైద్యులుగా అవతారమెత్తుతున్నారు. డాక్టర్లు లేరన్న కారణంతో అసలు కొన్ని ఆస్పత్రులకు తాళమే తీయట్లేదు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ‘సాక్షి’ పరిశీలనలో పశు వైద్యం స్థితిగతులు బయటపడ్డాయి. జిల్లాలో 230 పశు వైద్యశాలలున్నాయి. వీటిలో 136 గ్రామీణ పశు వైద్య శాలలు. ఈ ఆస్పత్రుల్లో కేవలం 60 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇంకా మంజూరైన పోస్టులు 28 ఖాళీగా ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్స్ 239 మందికి గాను 123 మందే విధులు నిర్వహిస్తున్నారు. పశు సంవర్థక సహాయకుల పోస్టులు 35 వరకు ఖాళీగా ఉన్నాయి. నాల్గో తరగతి ఉద్యోగులు 92 మంది తక్కువగా ఉన్నారు. ఇటీవల పశు సంవర్థక శాఖ గణన ప్రకారం జిల్లాలో తెల్లపశువులు 5.74 లక్షలు, గేదెలు 5.51 లక్షలు, గొర్రెలు 4.56 లక్షలు, మేకలు 4.76 లక్షలు వరకు ఉన్నాయి. వీటికి వచ్చే వ్యాధులకు ఆయా పశు వైద్యశాలల్లో వైద్యం అందించాలి. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో పశువులకు జూన్‌లో చీడపారుడు రోగం, ఆగస్టులో గాలికుంటు వ్యాధి, నవంబర్‌లో గురక వ్యాధి, డిసెంబర్లో మసూచి వ్యాధులు వస్తున్నాయి. గొర్రెలు, మేకలకు నిమోనియా, గురక వ్యాధులు వస్తున్నాయి. పశువులకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రతలపై ఏటా పశు సంవర్థక శాఖ నిర్వహించాల్సిన ప్రచారం నామమాత్రంగా సాగుతోంది. ఈ వ్యాధులకు ఇచ్చే మందులు, వ్యాక్సిన్లు వైద్యశాలల్లో ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉండటం లేదు. పశువులకు వచ్చే వ్యాధులపై రైతులకు అవగాహన లేకపోవడంతో వ్యాధి ముదిరి అవి మృత్యువాత పడుతున్నాయి. పొదుగువాపు, పాము, కుక్కకాటు వ్యాక్సిన్లు ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో పశువైద్యశాలల్లో అందుబాటులో లేవు. వీటిని రైతులు ప్రైవేట్ మార్కెట్లో కొనుగోలు చేయడం భారంగా మారింది. కొంతమంది డాక్టర్లకు మరికొన్ని వైద్యశాలల ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. కానీ ఏనాడూ వారు ఆ ఆస్పుతల వైపు కన్నెత్తి చూడటం లేదు. అటెండర్లు, ప్రైవేట్ వ్యక్తులే దిక్కు.. డాక్టర్లు లేని చోట అటెండర్లు, వైద్యం తెలిసిన ప్రైవేట్ వ్యక్తులే పశువులకు వైద్యం అందిస్తున్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో పనిచేస్తున్న వైద్యాధికారి తల్లాడ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వైద్యశాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. గత నాలుగేళ్ళుగా ఇక్కడ ప్రైవేట్ వ్యక్తి పశువులకు వైద్యం చేస్తూ రైతుల వద్ద నుంచి తృణమోపణమో తీసుకుంటున్నాడు. ఇక్కడి ఇన్చార్జి వైద్యాధికారి ఇటువైపు కన్నెత్తి చూడటంతో ఇటీవలికాలంలో వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇదే మండలం పాలడుగు గ్రామంలో ఆరేళ్ళుగా ఇక్కడి పశువైద్య శాలలో వైద్యుడు లేకపోవడంతో అటెండరే వైద్యం చేస్తున్నాడు. ఏన్కూరు మండల పరిధిలోని హిమామ్‌నగర్, రాజులపాలెం, రేపల్లెవాడ, మేడెపల్లి, నాచారం, గంగుల నాచారం, కాలనీ నాచారం, భద్రుతండా, మునియతండ, ఒంటిగుడిసె గ్రామాల పరిధిలో పశువైద్యశాలలు లేక పోవడంలో మూగజీవాలకు పశువైద్య సేవలు అందడం లేదు. ఖమ్మం రూరల్ మండలం పెదతండా వైద్యశాలలో అటెండర్, అసిస్టెంట్ పశువులకు వైద్యం చేస్తున్నారు. వైద్యులు లేక మూత.. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండలం పొన్నేకల్‌లో ఐదేళ్ల క్రితం పశువైద్యశాల ఏర్పాటు చేసినప్పటికీ వైద్యున్ని నియమించకపోవడంతో మూతపడింది. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి, బచ్చోడు వైద్యశాలలు కూడా ఇలాగే మూతపడ్డాయి. అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట, వినాయకపురం, సున్నంబట్టి, నారాయణపురం, గుమ్మడవల్లి, అచ్యుతాపురం, నారంవారిగూడెంలలో పశుైవె ద్యశాలలున్నాయి. వినాయకపురం పశువైద్యశాలలో తప్ప ఇంకెక్కడా వైద్యులులేరు. మధిర కేంద్రంలో ఉన్న పశువైద్యశాల డాక్టర్.. ఖమ్మం నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో పశువులకు సరైన సమయంలో వైద్యం అందడంలేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చింతకాని మండలం పందిళ్లపల్లి ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరటంతో రెండేళ్ల క్రితం నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. నిధులు సరిపోక భవన నిర్మాణ పనులు పూర్తికాలేదు. గత్యంతరం లేక పశువైద్యశాల మందులను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిల్వ చేశారు. ముదిగొండ మండలంలోని మేడేపల్లి పశువైద్యశాలకు మూడు రోజులగా తాళం వేసి ఉంది. భద్రాచలం నియోజకవర్గం వాజేడు మండలంలోని పేరూరు పశు వైద్యశాల రెండుళ్లుగా తెరుచుకోలేదు. చర్ల మండలం సత్యనారాయణపురంలో రూ.10 లక్షల వ్యయం తో నూతన భవనం నిర్మించి ఆర్నెల్లయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. వెంకటాపురం వైద్యశాల శిథిలావస్థలో ఉంది. పినపాక నియోజకవర్గం మణుగూరు పశువైద్యశాలలో అటెండరే వైద్యం చేస్తోంది. గుండాల మండలకేంద్రంలోని పశువైద్యశాలలో వైద్యులు లేకపోవడంతో నిత్యం మూసే ఉంటోంది. పశు సంవర్థక శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
పశువైద్యం కోసం అంబులె న్స్‌లు
బెల్లంపల్లి : మూగజీవాలకు సత్వర వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అంబులెన్స్ వాహనాలను సమకూర్చబోతోంది. 108 మాదిరిగానే పశువుల కోసం ప్రతీ అ సెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయనుంది. సకాలంలో వైద్యం అందక మూగజీవాలు మృ త్యువాతపడుతున్న నేపథ్యంలో అంబులెన్స్ సదుపా యం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అంబులెన్స్‌తోపాటు వైద్యానికి సంబంధించిన మందులు సమకూర్చి, వైద్యులను నియమించనుంది. వైద్యం కోసం అంబులెన్స్‌కు కబురు పంపడానికి ప్రత్యేకంగా ఫోన్ నంబర్ కూడా కేటాయిస్తారు. ఈ ప్రక్రియ త్వరలోనే అమలులోకి రానుంది. ఈ మేరకు బుధవారం శాసనసభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో మూగజీవాలకు వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. జిల్లాలో పరిస్థితులివి.. జిల్లాలోని 52 మండలాల్లో 97 వెటర్నరీ డిస్పెన్సరీలు, 49 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 101 మంది పశువైద్యాధికారులు పని చేయాల్సి ఉండగా ప్రస్తుతం 76 మంది మాత్రమే ఉన్నారు. మరో 25 పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు 74 గాను 11 మంది మాత్రమే పని చేస్తున్నారు. 63 పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 22 లక్ష ల వరకు పశుసంపద ఉన్నట్లు ఓ అంచనా. అంబులెన్స్‌ల ను ప్రవేశపెట్టడం వల్ల జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాలకు పశువైద్యం మెరుగుపడుతుంది. తద్వారా ఖాళీగా ఉన్న వైద్యాధికారులు, సిబ్బంది పోస్టులు భర్తీ అవుతాయి. మందుల కొరత కూడా తీరుతుంది. చేరువ కానున్న వైద్యం ఇప్పటి వరకు మూగజీవాలకు కేవలం వెటర్నరీ డిస్పెన్సరీలు, సబ్సెంటర్లలో మాత్రమే వైద్యం అందుతోంది. మూగజీవాల యజమానులు పశువులను డిస్పెన్సరీలకు తీసుకెళ్తే వైద్యులు, సిబ్బంది పరీక్షించి వైద్యం అందిస్తున్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎక్కడైన మూగజీవాలకు ప్రాణాపాయ స్థితి ఉన్నట్లు ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు 108 అంబులెన్స్ మాదిరిగానే సదరు మూగజీవి ఉన్న చోటికి వెటర్నరీ అంబులెన్స్ వెళ్తోంది. అంబులెన్స్‌లో ప్రత్యేకంగా సరిపడ మందులు అందుబాటులో ఉంచి, వైద్యుడు, సిబ్బందిని నియమిస్తారు. మూగజీవి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి వైద్యం చేస్తారు. చాలా మట్టుకు గ్రామాల్లో సకాలంలో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. గొర్రెలు, మేకలు, పశువులు ఒక్కోసారి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడి అందుబాటులో వైద్యం లేక చనిపోతున్న సంఘటనలు కోకొల్లలు. అనారోగ్యానికి గురైన పశువులకు సకాలంలో వైద్యం అందకపోవడం, యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవడం వల్ల కూడా మూగజీవాలు మృత్యువుకు చేరువవుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టనున్న అంబులెన్స్‌ల వల్ల పశువైద్యం మెరుగుపడుతుందనడంలో సందేహం లేదు. -
పశువైద్యం మృగ్యం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: పశువులకు వైద్యం దూరమవుతోంది. గ్రామాలకు దూరంగా పశువైద్యశాలలు ఉండటంతో ఎక్కువ మంది పశుపోషకులు వాటి వద్దకు తీసుకువెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అవి మూతపడ్డాయి. వేళలులను కూడా సక్రమంగా పాటించడం లేదు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు పశువైద్యశాలలు తెరిచి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఎక్కువ శాతం పశువైద్యశాలల్లో వేళలకు మంగళం పాడేస్తున్నారు. నిర్ణీత వేళల్లో వేసిన తలుపులు వేసినట్లే ఉంటున్నాయి. దాంతో అనేక మంది పశుపోషకులు ప్రైవేట్ పశువైద్యులను ఆశ్రయిస్తున్నారు. 172 మంది గోపాలమిత్రులు ఉన్నప్పటికీ కృత్రిమ గర్భధారణ, ప్రాథమిక చికిత్సలకే వారు పరిమితమవుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పశువులకు సుస్తీ చేస్తే వాటి పోషకులు వైద్యం అందించేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. జిల్లాలో 118 పశువైద్యశాలలు, 103 గ్రామీణ పశువైద్యశాలలు, 9 సహాయ సంచాలకుల పశువైద్యశాలలతోపాటు జిల్లా కేంద్రంలో బహుళార్థ పశువైద్యశాల ఉంది. 9 లక్షల 70 వేల 319 గేదెలు, 74,530 ఆవులు, 14లక్షల 6 వేల 401 గొర్రెలు, 4 లక్షల 6 వేల 260 మేకలు, 9 లక్షల 73 వేల 959 కోళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ సకాలంలో వైద్యం అందించాల్సిన బాధ్యత పశుసంవర్థకశాఖపై ఉంది. పశువైద్యశాలలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడం వల్ల పశువైద్యం దూరమవుతోంది. బుధవారం నిర్వహించిన ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో పశుపోషకులు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఒంగోలు నగరం, ఒంగోలు రూరల్‌తోపాటు కొత్తపట్నం మండలాలున్నాయి. జిల్లా కేంద్రం కావడంతో మెరుగైన వైద్య సేవలు అందుతూనే ఉన్నాయి. ఒంగోలు మండలంలోని సుదూర గ్రామాలకు చెందిన పశువులకు, కొత్తపట్నం మండలంలోని పశువులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదు. కందుకూరు పరిధిలో పశువులకు గాలికుంటు, బొబ్బ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. వ్యాక్సిన్ వేసినప్పటికీ వ్యాధులు తగ్గకపోవడంతో వాటిపై ఆధారపడిన పోషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల పశువైద్యులు సకాలంలో స్పందించడం లేదని పశుపోషకులు వాపోతున్నారు. కనిగిరి నియోజకవర్గంలో పశువుల సంఖ్య ఎక్కువగా ఉంది. దానికి తగినట్లుగా అక్కడ గతంలో సేవలు అందించినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. పశువుల, గొర్రెల మార్కెట్ యార్డులు గతంలో ఉంటే ప్రస్తుతం వాటి ఆచూకీ లేకుండా పోయింది. సంచార పశువైద్యశాల సేవలు నిలిచిపోయాయి. సీఎస్‌పురం మండలం నల్లమడుగుల ఉప పశువైద్యశాల వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో మూతపడింది. మార్కాపురం పరిధిలో పశువైద్య సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామంలోని పశువైద్యశాల మూతపడింది. మీర్జాపేట, తుమ్మలచెరువుల్లో సిబ్బంది లేకపోవడంతో ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తర్లుపాడుకు చెందిన పశువైద్యుడు అప్పుడప్పుడూ వచ్చి వెళుతుండటంతో పశు పోషకులు పెదవి విరుస్తున్నారు. యర్రగొండపాలెం పరిధిలో పశువులకు సంబంధించి మందులున్నప్పటికీ వ్యాక్సిన్ సకాలంలో రావడం లేదు. తొలకరి వర్షాలకు ముందు పశువులకు వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నా వర్షాలు పడిన తరువాత వేయడం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. పుల్లలచెరువులో పశువైద్యుడు ఒక్కరే ఉన్నారు. సిబ్బంది లేరు. సంతనూతలపాడు పరిధిలో పశువులకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. చీమకుర్తిలోని పశువైద్యశాల నాలుగు సెంట్ల స్థలంలో నిర్వహిస్తున్నారు. ఆ స్థలంలోని గది నిండా దాణా, మందులతో నిండిపోతుంది. వర్షం వస్తే వాటిని కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కొండపి పరిధిలోని పశువైద్యుల్లో ఎక్కువ మంది ఒంగోలు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొండపిలో పశువైద్యశాలకు భవనం లేకపోవడంతో పాల కేంద్రంలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. పొన్నలూరులో 50 గ్రామాలకు ఒక్క పశువైద్యశాల ఉంది. 25 కిలోమీటర్ల నుంచి పశువులను తీసుకురావడం కష్టతరంగా మారింది. అద్దంకి పరిధిలో పశువైద్యశాలలు పశువులకు అందుబాటులో ఉండటం లేదు. అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు పశువైద్యశాల 26 గ్రామాల పరిధిలోని పశుపోషకులు ఉపయోగించుకోవలసి వస్తోంది. వైద్యులు, సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడంతో బల్లికురవ, కొరిశపాడుల్లో ఎక్కువగా మూతపడే ఉంటున్నాయి. చీరాల పరిధిలో పశువైద్యం అంతంత మాత్రంగానే ఉంది. గవినివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉచితంగా అందించాల్సిన దాణాను అక్కడివారు విక్రయించుకుంటున్నారని పశుపోషకులు బాహాటంగా ఫిర్యాదు చేస్తున్నారు. మందులను కూడా ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారు. దాంతో ఎక్కువ మంది మందులు బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పర్చూరు పరిధిలో పశువైద్యం అంతంత మాత్రంగానే అందుతోంది. నూతలపాడు, చెరుకూరు, వీరన్నపాలెం గ్రామాల్లో పశువైద్యశాలలు ఉన్నప్పటికీ సకాలంలో వాటిని తెరవడం లేదు. పర్చూరులో పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది, పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. దర్శి పరిధిలో పశువైద్యం సక్రమంగా అందడం లేదు. కురిచేడులో 54 వేల వరకు పశువులు ఉంటే ఒక్క పశువైద్యశాల ఉంది. దాంతో ఎక్కువ మంది పశుపోషకులు వాటికి వైద్యం చేయించలేకపోతున్నారు. వ్యాధుల బారిన పడిన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొనకొండలో కూడా వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో పశువైద్య సేవలు అందించాలంటే వాటి పోషకులకు భారంగా మారింది. అర్ధవీడు మండలం వెలగలపాయలోయ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడి వైద్యశాల 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం, మండల కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పశుపోషకులు ఇబ్బంది పడుతున్నారు. -
పశువైద్యం ఎక్కడ..?
కనిగిరి, న్యూస్‌లైన్ : జిల్లాలో పశువైద్యం అధ్వానంగా తయారైంది. పశువులు, గొర్రెలు, మేకలు పలురకాల వ్యాధులబారినపడి సకాలంలో వైద్యమందక చనిపోతున్నప్పటికీ పశువైద్యశాఖాధికారులు, సిబ్బంది నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా మూగజీవాలను వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా కనిగిరి నియోజకవర్గంలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ నియోజకవర్గంలో వ్యవసాయం తర్వాత ఎక్కువమంది పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ, పశువైద్యం నామమాత్రంగా కూడా అందకపోతుండటంతో వాటి పోషకులు తీవ్రంగా నష్టపోతున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారు 1.5 లక్షలకుపైగా గేదెలు, 5 లక్షలకుపైగా గొర్రెలు, లక్షకుపైగా మేకలు ఉన్నాయి. వాటికి వైద్యసేవలందించేందుకు ఇటీవల స్థాయిపెంచిన గురవాజీపేట, శీతారాంపురం, రేగిచెట్లపల్లి, మొగుళ్లూరు, పెదఅలవలపాడుతో కలిపి 13 వరకూ పశువైద్యశాలలున్నాయి. వాటిలో కనిగిరి పట్టణంలోని పశువులాస్పత్రి (ఏడీఏహెచ్ పోస్టుతో) కూడా ఉంది. వేధిస్తున్న పశువైద్యుల కొరత... కనిగిరి నియోజకవర్గంలోని పశువైద్యశాలల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. హనుమంతునిపాడు, పీసీ పల్లి పశువైద్యశాలల్లో వైద్యాధికారుల పోస్టులు ఏడాది నుంచి ఖాళీగా ఉన్నాయి. వేములపాడు, ముప్పళ్లపాడు, డీజీ పేట, నల్లమడుగుల, రేగిచెట్లపల్లి, బల్లిపల్లి ఉపకేంద్రాల్లో సీనియర్ కాంపౌండర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. పామూరు మండలం రేగిచెట్లపల్లి పశువైద్యశాలలో వైద్యాధికారి, కాంపౌండర్, సిబ్బంది పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ఆ ప్రాంతంలో పశువైద్యసేవలు శూన్యంగా ఉన్నాయి. పురాతనకాలంనాటి భవనాల్లో పశువైద్యశాలలు నిర్వహిస్తుండటంతో కనీస వసతులు లేకుండా పోయాయి. వాటిలో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఎవరూ ఉండటం లేదు. సిబ్బంది ఉన్న వైద్యశాలల్లో కూడా మొక్కుబడిగా అలావచ్చి ఇలా వెళ్తున్నారు. గ్రామాల్లో పర్యటించి పశువ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. రెండు నెలలుగా నియోజకవర్గంలో పలురకాల వ్యాధుల బారినపడి వందల సంఖ్యలో గొర్రెలు, మేకలు మృతిచెందాయి. దీనిపై పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ స్పందించేవారు కరువయ్యారు. ఆగిన సంచార పశువైద్యశాల... పశువులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రారంభించిన సంచార వైద్యశాల కనిగిరి నియోజకవర్గంలో మూడు నెలలుగా నిలిచిపోయింది. సంచార వైద్యశాలకు ఒక పశువైద్యాధికారి, ఒక కాంపౌండర్ ఉండాలి. కానీ, వారిని నియమించలేదు. వైద్యశాల నిర్వహణకు నిధులు విడుదల చేస్తుండటంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల పశువైద్యాధికారులు రోజుకొకరు చొప్పున వారంలో ఆరు రోజులపాటు సంచార వైద్యశాలలో విధులు నిర్వర్తించి పశువైద్యసేవలందించేవారు. కానీ, మూడు నెలలుగా నిధులు కూడా నిలిచిపోవడంతో సంచార పశువైద్యశాల ఆగిపోయింది. ఫలితంగా పశువులను వ్యాధులు చుట్టుముట్టి చంపేస్తున్నాయి. వాటి పోషకులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా పశువైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన పశువైద్యసేవలందించి వ్యాధులు నివారించాలని, మూగజీవాలను కాపాడాలని పోషకులు కోరుతున్నారు.