సాధారణంగా విత్తనాలు సూటి రకాలు, హైబ్రీడ్ రకాలుగా ఉంటాయి.
సూటి రకాలంటే రైతులు ప్రతి సంవత్సరం తమ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని తరువాత పంటగా వేసుకోవచ్చు.
విత్తనాలను మార్చుకునేటప్పుడు ధ్రువీకరించిన వాటినే వేసుకోవడం మంచిది.
హెబ్రిడ్ రకాలంటే ఏటా సంకర పర్చి తయారు చేసిన విత్తనాలు.
ప్రతి పంట కాలానికి కొత్త విత్తనం వాడాల్సి ఉంటుంది.
పాత విత్తనాలను వాడినట్లయితే దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
ధ్రువీకరణ విత్తనం
జన్యుపరమైన అసలు లక్షణాలు కలిగి, చీడపీడలను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది.
ఇతర వంట విత్తనాలు కానీ కలుపు మొక్కల విత్తనాలు లేకుండా పరిశుభ్రంగా ఉంటాయి.
వ్యర్థ పదార్థాలు లేకుండా ధ్రుడమైన విత్తనాలు ఎక్కువ శాతం కల్గి ఉంటాయి.
బాగా మొలకెత్తే ఎక్కువ మొలక సాంద్రత కల్గిన విత్తనాలు అధిక దిగుబడికి దోహదపడతాయి. విత్తనం ద్వారా వ్యాపించే శిలీంధ్రాల నుంచి రక్షణ ఎక్కువగా ఉంటుంది. విత్తనంలో నిర్ణీత తేమ శాతం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు.
నాణ్యమైన విత్తన లక్షణాలు
నాణ్యమైన విత్తనమంటే వంద శాతం జన్యు స్వచ్ఛత మొలక శాతం కలిగి ఉండాలి.
మేలైన విత్తనం 20 నుంచి 25 శాతం అవసరాల్లో 8 నుంచి 9 శాతం దిగుబడిని పెంచుతుంది.
అంతర్గత చీడపీడలు లేని ఆరోగ్యకరమైన విత్తనమే నాణ్యంగా ఉన్నట్లు లెక్క.
విత్తనాలు తయారు చేసుకోవడం ఇలా....
ప్రతి రైతు తనకు కావాల్సిన విత్తనాలను తన పంట నుంచి లేదా బాగా పండిన ఇతర రైతుల పంట నుంచి సేకరించాలి. భద్రంగా దాచుకోవాలి. స్వపరాగ సంపర్కం జరిగే పంటలలో రైతులు ఎవరి విత్తనాన్ని వారు తయారు చూసుకుంటే విత్తనంపై పెట్టే పెట్టుబడి తగ్గడమే కాకుండా నాణ్యమైన విత్తనాన్ని పొందే అవకాశం ఉంటుంది.
విత్తనోత్పత్తి చేసే పొలం సారవంతమైనదిగా ఉండాలి.
నీటి వసతితో పాటు మురుగునీరు పోయేలా ఏర్పాట్లు ఉండాలి.
విత్తనం కోసం పండించే పొలానికి అదే పంటకు చెందిన ఇతర రకాల పొలానికి మధ్య కనీస దూరం ఉండాలి.
విత్తనోత్పత్తి చేయదల్చిన పొలంలో నీటితడి ఇచ్చినట్లయితే అంతకు ముందు పండించిన రకం విత్తనాలు మొలకెత్తుతాయి. తరువాత గొర్రు, గుంటుకతో దుక్కి చేయిస్తే పొలంలో ఉండే కల్తీ మొక్కులతో పాటు కలుపు మొక్కలు నాశనం అవుతాయి.
విత్తనోత్పత్తి చేసే పొలంలో బెరుకులు (కేశీలు) ఏరి వేయాలి.
మొక్క ఎదుగుదల దశలో పంట పూత దశలో గింజ గట్టిపడే దశలో మూడు సార్లు కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
మొదటి దశ ఎత్తులో తేడా ఉన్న మొక్కలను పీకేయాలి. ఆకుల రంగు, ఆకారం, అమరికలో తేడా లేకుండా చూడాలి.
రెండో దశలో కంకుల్లో తేడా ఉన్న మొక్కలను తొలగించాలి. రెమ్మల అమరిక, పుప్పొడి రంగులో తేడా పుప్పొడి తిత్తుల్లో తేడా లేకుండా చూసుకోవాలి.
మూడోదశలో గింజ ఆకారం, పరిమాణం, గింజ రంగు వీటన్నింటినీ రెండు మూడు సార్లు విత్తన క్షేత్రమంతా తిరిగి ఏరి వేయాలి.
విత్తనమే కీలకం!
Published Fri, Nov 14 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement