హైదరాబాద్‌వాసులకు సబ్సిడీపై ‘ఇంటిపంట’ కిట్లు
హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల్లో నివాసం ఉంటూ మేడలపైన, పెరట్లో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయదలచుకునే వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ 50 శాతం సబ్సిడీపై కిట్లను ఈ ఏడాది కూడా అందిస్తున్నది. సిల్పాలిన్ బెడ్స్ 4, విత్తనాలు, స్ప్రేయర్, పరికరాలు, వేపనూనె, వేపపిండి, క్రీపర్ మెష్ తదితరాలను సబ్సిడీ పోను రూ. 2 వేలకు ఇస్తున్నారు. పశువుల ఎరువు కలిపిన మట్టి మిశ్రమం బస్తాలు కూడా కావాలంటే మరో రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ఉద్యాన అధికారిణి అరుణను 837 444 9458 నంబరులో సంప్రదించవచ్చు.
ఇంటిపంటల సాగుకు బెడ్‌ల నిర్మాణం ఇలా...
కొత్తగా ఇంటిపంటలు సాగు చేయాలనుకునే వారికి తొలుత అనేక సందేహాలు తలెత్తటం సహజం. ముఖ్యంగా మొక్కలను పెంచేందుకు అవసరమైన బెడ్‌ల నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఒక్కసారి నిర్మిస్తే శాశ్వతంగా ఉండేవి కాబట్టి ఆకారం, కొలతలు తెలుసుకొని అవసరాలకు అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా నిర్మించుకోవటమే ఉత్తమం. అయితే వీటి గురించి తెలుసుకునేందుకు సమయం వెచ్చించి వేరే ప్రదేశాలకు వెళ్లి పరిశీలించటం అందరికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికి అనుభవజ్ఞుల సలహాలు ఎంతగానో ఉపకరిస్తాయి.
కొత్తగా ఇంటిపంటలను పెంచేవారికి సహకరించేందుకు సీనియర్ ఇంటిపంటల సాగుదారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ముందుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం నారపల్లిలో ఆధునీకరించిన తన రూఫ్‌గార్డెన్ ఫోటోలను ఫేస్‌బుక్‌లో ఉంచుతున్నారు. ఈ ఫోటోలను చూపితే తాపీ మేస్త్రీలకు అవగాహన వస్తుంది. చిన్న చిన్న మార్పులతో కావలసిన విధంగా బెడ్‌లు నిర్మించుకుని ఇంటిపంటలను సాగు చేసుకోవచ్చు. ఇంకా సందేహాలుంటే రఘోత్తమ్‌రెడ్డి (90001 84107) ని సంప్రదించవచ్చు. కరీంనగర్‌కు చెందిన రమేష్ సూదం (99492 93068) గారి ఇంటిపైన సిమెంటుతో బెడ్‌లు నిర్మిస్తున్నారు. సమీప ప్రాంతాల వారు అవగాహన కోసం ఆ ఇంటిపంటలను వెళ్లి చూడవచ్చు.