శరణార్థులపై కల్పిత భయాలు | creating imaginary fears about Refugees | Sakshi
Sakshi News home page

శరణార్థులపై కల్పిత భయాలు

Published Wed, Jun 15 2016 12:27 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

శరణార్థులపై కల్పిత భయాలు - Sakshi

శరణార్థులపై కల్పిత భయాలు

ట్రంప్, తదితర రిపబ్లికన్ నేతలు సిరియన్ శరణార్థుల పట్ల అమెరికన్లలో ప్రవేశపెడుతున్న కల్పిత భయాలు ఉగ్రవాదంకంటే ప్రమాదకరంగా మారుతూ, సగటు అమెరికన్ స్పందనను విదేశీయత వైముఖ్యంవైపు నెడుతున్నాయి.

ఒర్లాండో పట్టణంలో జూన్ 12న జరిగిన మారణ కాండ నేపథ్యంలో, ముస్లింలు దేశంలోకి ప్రవేశించ కుండా అమరికా నిషేధం విధించాలంటూ.. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి నామినీ అయిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. గే క్లబ్‌లో కాల్పులకు పాల్పడ్డ షూటర్ అమెరికన్ పౌరుడే అయి నప్పటికీ, ముస్లింలకు ప్రవేశ నిషేధంపై 2015 డిసెంబర్ నుంచి చేస్తూవస్తున్న సిఫార్సులను ట్రంప్ పునరుద్ఘాటిం చారు. అమెరికాకు వచ్చిన 10 వేలమంది సిరియన్ శరణార్థులకు పునరావాసం కల్పించాలని ఒబామా పాలనా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం పైనే ట్రంప్ నేరుగా గురిపెట్టారు. ముస్లింల ప్రవేశాన్ని నిషేధించ డంపై ట్రంప్ తదితరులు ఇస్తున్న బహిరంగ ప్రకటనలు అమెరికన్లలో శరణార్థులపై భయాలను రేకెత్తించి ఉండ వచ్చు కాని ఆ భయాలకు ఎలాంటి చారిత్రక సమర్థనా లేదనే చెప్పాలి. గత సంవత్సరం పారిస్‌లో ఉగ్రవాద దాడుల తర్వాత, మధ్య ప్రాచ్య దేశాలనుంచి వలస వస్తున్న వారితో దేశ భద్రతకు ప్రమాదం కలగనుందని పలు వ్యాసాలను అమెరికన్ మీడియా ప్రచురించింది.

ఇతరదేశాలు, ప్రాంతాల నుంచి వలస వచ్చే శరణా ర్థుల పట్ల ఆమోదం తెలపడానికి సంబంధించి అమెరి కాకు సుదీర్ఘ, సంక్లిష్ట చరిత్ర ఉంది. 1840లలో బంగాళా దుంపల పంట వైఫల్యంతో తీవ్ర కరువు బారిన పడిన ఐరిష్ కేథలిక్కులు, నల్లమందు యుద్ధాల క్రమంలో చైనీయులు, 19వ శతాబ్ది చివరలో చెలరేగిన జాతి ఘర్షణల నుంచి తప్పించుకోజూసిన తూర్పు యూరప్ యూదులు, 1910లో అంతర్యుద్ధ క్రమంలో పారిపో యిన మెక్సికన్‌లు, నాజీల పాలన నుంచి తప్పుకున్న జర్మనీ యూదులు, 1960లలో క్యూబన్ ప్రజలు, 1970 లలో వియత్నమీయులు ఏదో ఒకరకంగా శరణార్థు లుగా అమెరికాకు వలస వచ్చేశారు.

ఇలా వలస వచ్చిన వివిధ ప్రజా బృందాలు అమె రికాలో కుదురుకునే క్రమంలో తీవ్ర వివక్షను ఎదుర్కొ న్నాయి. వారి ప్రొటెస్టెంటేతర సంప్రదాయాలు, వారి జాతే దీనికి ప్రధాన కారణం. ఇది 19వ శతాబ్ది చివరలో, 20వ శతాబ్ది ప్రారంభంలో జాతీయతా రూపం దాల్చింది (ఆంగ్లేతర జాతీయులను తక్కువ జాతి జీవు లుగా గుర్తించడం మొదలైంది). మొదట చైనీయులకు, తర్వాత తూర్పు, దక్షిణ యూరప్ జాతీయులకు వ్యతిరేకంగా అమెరికన్లలో ఏర్పడిన దురభిప్రాయాలు ఎంత బలపడ్డాయంటే, అమెరికన్ కాంగ్రెస్ 1880లలో చైనీయుల మినహాయింపు చట్టాన్ని, 1920లలో వలస నిరోధ చట్టాన్ని ఆమోదించింది. ఈ రెండో చట్టం అమెరికాలోకి పశ్చిమ యూరపేతర జాతుల ప్రవాహాన్ని గణనీయంగా నిరోధించింది. స్థానిక అమెరికన్ల నుంచి వివక్షను తీవ్రంగా ఎదుర్కొన్నప్పటికీ, ఈ శరణార్థి బృందాలు, వారి సంతానం అమెరికా సమాజంలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయాయి.

అమెరికన్ చరిత్రలో శరణార్థుల పట్ల సామాజిక ఆందోళనకు సంబంధించిన అత్యంత ఆసక్తిగొలిపే ఉదాహరణల్లో ‘జర్మన్ ఫార్టీయైటర్స్’ ఒకటి. 1848లో ప్రజాస్వామ్యం కోసం జరిగిన యూరోపియన్ విప్లవాల వైఫల్యంతో ఏర్పడే నిర్బంధం గురించిన సకారణ భయాలతో ఈ దేశాల నుంచి పలువురు శరణార్థులు సామూహికంగా అమెరికాకు వలస వచ్చేశారు. వీరిలో జర్మనీ ఉద్యమకారులు ఇతరుల కంటే రాడికల్‌గా ఉండేవారు. స్వేచ్ఛా చింతనాపరులైన వీరు అమెరికా సంస్థలను, ప్రత్యేకించి క్రిస్టియానిటీని తీవ్రంగా విమ ర్శించేవారు. వీరి విమర్శల తీవ్రతకు జడిసిన నాటి ఛాందసవాద ‘విగ్’ పార్టీ, దాని విదేశీయతా విముఖత లోంచి పుట్టుకొచ్చిన ‘అమెరికన్ పార్టీ’.. రెండూ ‘అమెరికా అమెరికన్లకే’ అనే నినాదాన్ని మొదలెట్టాయి.

అయితే వలస ప్రజలు పలువురు అమెరికన్లలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నప్పటికీ, ‘జర్మన్ ఫార్టీ యైటర్స్’ గా పేరొందిన వారు వలస వచ్చిన బృందాలన్నింటి కంటే ఎక్కువగా చైతన్యంతో కూడిన బృందంగా ఉండేవారు. వీరు స్థానిక కమ్యూనిటీలకు నేతృత్వం వహించేవారు. ఉత్తమ ప్రభుత్వ విద్య, బానిసత్వ రద్దు తదితర ప్రగతిశీల సంస్కరణలను ప్రబోధించేవారు. 1917లో అమెరికా, జర్మనీపై యుద్ధం ప్రకటించేనాటికి ఈ జర్మన్ ఫార్టీ యైటర్స్‌కి చెందిన పిల్లలు, తదనంతర తరం పిల్లలు, వీరితో పాటు జర్మనీ వలస ప్రజలను అమెరికాయేతరులుగా, జాతికి ప్రమాదకారులుగా అమె రికన్ ప్రజానీకం భావించింది. నాటి ఉడ్రోవిల్సన్ పాలనా యంత్రాంగంతోపాటు పలువురు అమెరికన్ నేతలు అనధికారికంగా ఇదే అభిప్రాయానికి వచ్చేశారు. యుద్ధకాలంలో జర్మన్ అమెరికన్లపట్ల భయం అనేది ఉన్మాద స్థాయికి చేరింది. వారు ఆహారంలో, తాగేనీళ్లలో విషం కలిపేందుకు, ఫ్యాక్టరీల్లో, వంతెనలపై బాంబులు పెట్టడానికి కుట్ర పన్నుతున్నారని పలురకాల పుకార్లు వ్యాపింపజేశారు. వీటిలో ఏ ఒక్క పుకారు కూడా నిజం కాలేదనుకోండి. పైగా జర్మన్ అమెరికన్లు తాము కొత్తగా నివాసమేర్పర్చుకున్న ప్రాంతం పట్ల విశ్వాసం ప్రదర్శిం చినట్లు చారిత్రక రికార్డులు కూడా ఉన్నాయి.

చారిత్రక దృక్పథం రీత్యా కూడా సిరియన్, తదితర శరణార్థుల పట్ల ఈ కొత్త భయం చాలావరకు అసంబ ద్ధమైనదనే చెప్పాలి. గతంలోని వలస బృందాలు, అమె రికా సామాజిక చట్రానికి ప్రమాదకారులుగా ముద్ర పడిన బృందాలు కూడా అమెరికా పౌరులలో కీలక సభ్యులుగా తమను తాను నిరూపించుకున్నారు. మధ్య ప్రాచ్య శరణార్థుల పట్ల భయాలు వ్యక్తం చేస్తున్నవారు అమెరికా సంస్కృతి, దాని సంస్థలు ప్రత్యేకించి దాని ప్రభుత్వ విద్యా సంస్థలలోని ఏకీకరణ శక్తిని నిర్లక్ష్యం చేస్తున్నాయనిపిస్తోంది. శరణార్థుల గురించి అధికంగా ఆందోళన చేస్తున్న రాజకీయ నేతల్లో చాలామంది... పిల్లల్లో తరాలుగా ప్రజాస్వామిక భావాలను ప్రవేశ పెడుతూ వచ్చిన ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమర్థించ డంలో ఏకకాలంలో విఫలమవడం గమనార్హం. పైగా వీరు ప్రైవేట్‌గా నిర్వహిస్తూ, లాభాపేక్షే పరమావధిగా కలిగిన పాఠశాలల పట్ల మొగ్గు చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో ట్రంప్, తదితర రిపబ్లికన్ నేతలు సిరియన్ శరణార్థుల పట్ల అమెరికన్లలో ప్రవేశపెడు తున్న కల్పిత భయాలు బీభత్సాన్ని సృష్టించడానికి మించిన ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రపంచ మానవతావాద సంక్షోభం పట్ల అమెరికా స్పందనను విదేశీయతా వైముఖ్యం వైపు నెడుతున్నాయి.

పాల్ జె రామ్సే, ప్రముఖ అమెరికన్ రచయిత

(కామన్‌డ్రీమ్స్.ఓఆర్‌జీ.... సౌజన్యంతో)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement