పారా మిలటరీ పాపం ఏమిటి?
జాతిహితం
పారా మిలటరీ బలగాల జీతభత్యాలు, ఆహారం, నాయకత్వం అధ్వానౖమైనవి,పెన్షన్లు స్వల్పం. వారు తమను తాము రెండవ తరగతి సైనికులుగా భావిస్తుంటారు. సైన్యం విషయంలో మాట్లాడగలిగిన సీనియర్ సైనికాధికారులు ఉంటారు. పే కమిషన్, ఓఆర్‌ఓపీ వంటి సమస్యలను మీడియా ద్వారా వారు వివరించగలుగుతారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఆ భాగ్యమూ లేదు. వాటికి నేతృత్వం వహించడానికి వచ్చేవారంతా తాత్కాలికంగా ఆ బాధ్యతల్లోకి వచ్చే ఐపీఎస్‌లే. తిరిగి వారు వచ్చిన చోటికే పోతారు.
మీ వీపు మీద ఏదైనా పులిపిరికాయ లాంటిది వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? షర్టు కింద దాన్ని దాచేసి, దానికదే మానిపోతుందేమోనని ఎదురు చూడటం మాత్రమే చేయొచ్చు. మహా అయితే, అది తాత్కాలికమైన చికాకు. అదే మీ మొహం మీద పులిపిరి వస్తే దాచేయడం అసాధ్యం. అది చికాకు మాత్రమే కాదు, బహిరంగమైన లేదా సామాజికమైన ఇబ్బందిగా కూడా మారుతుంది. కాబట్టి దానికి ఏ ఆయింట్‌మెంటో పూస్తారు. ఒకటి, రెండు మాత్రలూ మింగొచ్చు. ఎలా కనబడతామనే పట్టింపు ఉంటే అది కనబడ కుండా చేసేలా ఏదైనా పూస్తారు. కానీ మీ శరీరమంతా పులిపిర్లు వస్తేనో?
ఏ దద్దుర్లులాంటివి వస్తేనో? మీరిక బెంగపడాల్సివస్తుంది. ఇప్పటికైనా మేల్కొని ఏ డాక్టర్‌నో కలుస్తారు. రోగనిర్ధారణ పరీక్షల కోసం పోవాల్సి రావచ్చు. అదేదో వచ్చిపోయే అలర్జీ కావచ్చు, తీవ్రమైనదే అయినా నయం చేయగలిగే అంటువ్యాధి కావచ్చు, భయంగొలిపే క్యాన్సర్ కావచ్చు లేదా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధి కావచ్చు. ఇలాంటి వైద్యపరమైన అవకా శాలకు అంతులేదు. అయినా ఒక విషయం చెప్పొచ్చు. అది మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యే అయితే... అది అప్పటికే పూర్తిగా అదుపు తప్పి పోకపోతే... మీకు ఆ వ్యాధి ఉన్నదని ఆమోదించి, మీ జీవన శైలిని మార్చు కోవడమే మీరు చే యాల్సిన మొదటి పని.
పారా మిలటరీకి కావాలి చికిత్స
మన సాయుధ బలగాల, ప్రత్యేకించి కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) నాయకత్వం, నిర్వహణ, పరిహారం, శ్రద్ధ, మోహరింపు, సిద్ధాం తాల విషయంలో ఇప్పుడు చేయాల్సినది సరిగ్గా అదే. వీటిని కేంద్ర పారా మిలిటరీ బలగాలుగా(సీపీఎమ్‌ఎఫ్) పొరపాటున పిలుస్తుంటారు. ఈ వారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సరిహద్దు భద్రతా బలగాల (బీఎస్‌ఎఫ్), కేంద్ర రిజర్వు పోలీసు బలాగాల (సీఆర్‌పీఎఫ్) వీడియోలు రెండూ మొహం మీద పొడుచుకొచ్చిన పులిపిర్ల లాంటివి. ఇప్పటికి అవి రెండే అయినా, త్వర లోనే ఇంకా వెలుగు చూడొచ్చు. వాటికవే పోయేవరకు తలవంచుకుని వాటిని దాచేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ అవి అలా పోయేవి కావు. పైగా ఇంకా విస్తరించి, దీర్ఘకాలిక వ్యాధిగా సైతం మారొచ్చు. జరగకూడనిదే జరిగి ప్రాణాంతకమూ కావచ్చు.
అందువలన, ఫిర్యాదు చేసిన బీఎస్‌ఎఫ్ కానిస్టేబు ల్‌పై క్రమశిక్షణా చర్య చేపట్టం వంటి మూర్ఖపు పని చేయాలని యోచించడా నికి ముందు... నక్షత్రాలు వగైరా సహా పూర్తి సైనిక యూనిఫాంలో అధికా రులు ఆ కానిస్టేబుల్‌ను జాతీయ టీవీలో బహిరంగంగా దూషించే కార్యక్ర మాన్ని రూపొందించి, అను మతించిన అత్యున్నతాధికారిని సంజాయిషీ కోరాలి. ఇదో గొప్ప తెలివి తక్కువ ఎత్తుగడ కావడమే కాదు, అంతకంటే మరింత ముఖ్య ప్రశ్నను లేవనెత్తుతుంది. తమ సొంత బలగాలనే బహిరం గంగా తూలనాడే వీరు అసలు ఎలాంటి సైనికాధిపతులు, అదే ఎలాంటి ఇన్‌స్పెక్టర్ జనరల్స్?
ఈ పులిపిర్లు లేదా వీడియోలు మొదటివేమీ కావు. గత కొన్నేళ్లుగా, ప్రత్యేకించి కేంద్ర బలగాలను మరింతగా మావోయిస్టులతో పోరాటంలోకి దించినప్పటి నుంచి ఇలాంటి ఫిర్యాదులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వెంటనే వాటిని పాతిపెట్టేస్తున్నారు. కానీ అవేమీ మటుమాయమై పోవడం లేదు. అవి మన సైనిక మిత్రుల వద్ద లేదా పాకిస్తాన్ ప్రచార యంత్రాంగం వంటి శత్రువుల వద్ద ఉంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఒక డిప్యూటీ కమాండెం టుసహా ముగ్గురు సీఆర్‌పీఎఫ్ వారు నెత్తురోడుతూ సహాయం కోసం అరుçస్తూ, ‘‘ఎన్నటికీ రాని’’ డాక్టర్ల కోసం బిగ్గరగా కేకలు పెడుతున్న మూడు వీడియోలు చక్కర్లు కొట్టాయి. అవి మనల్ని చికాకుపెట్టే వీపు మీద పులిపిర్లు. కాబట్టి అవి దాచేయాల్సినవని మన మీడియా వాటిని పెద్ద సమస్యను చేయ లేదు. కానీ పాక్ ప్రచారకర్తలు సరిహద్దుల్లో ఎక్కడ తీవ్ర పరిస్థితులు పెంపొం దినా, మానసిక యుద్ధం అవసరమైనా ఆ వీడియోలను ప్రయోగిస్తున్నారు.
ఖాకీ సైనికుల ప్రాణాలకు విలువ లేదా?
ఓ మామూలు బస్సులో తరలిస్తున్న ఆ డిప్యూటీ కమాండెంటు సహాయం కోసం కేకలు పెడుతూ... ఇంటివద్ద తనకు ఇద్దరు పిల్లలున్నారని, తాను చని పోతే ఆ పిల్లల గతేమిటని గుర్తు చేస్తూ ఆ వీడియోలో కనిపించారు. ఈ వీడియో సందేశాన్ని పంపినవారిపైన కూడా వేటు వేయొచ్చు. బహుశా అది చేసే ఉంటారు. కానీ అది, సీఏపీఎఫ్ బలగాలకు వైద్యసదుపాయాలు, డాక్టర్లు కరువయ్యారనే వాస్తవాన్ని మార్చలేదు. ఇది దేశానికే అవమానకరం. నేడు మన పారా మిలటరీ బలగాలు, సైన్యంలాగే ఒక చోటిæ నుంచి మరో చోటికి పోతూ, ప్రత్యేకించి తూర్పు–మధ్య భారతంలోని మావోయిస్టు తిరుగుబాటు దారులతో చావుబతుకుల సమరం సాగిస్తున్నాయి. సైన్యానికి వలే వీరికి ఫీల్డ్ హాస్పిటల్స్ లేదా అడ్వాన్స్ డ్రెస్సింగ్ స్టేషన్స్ (ఏడీఎస్) లేవు. ఇక క్షతగాత్రు లను తరలించే సదుపాయాలు అధ్వానం. హెలికాప్టర్లు ఎప్పుడోగానీ అందు బాటులో ఉండవు. తమ సొంత గార్డ్ కమెండోలను తీసుకుని చత్తీస్‌గఢ్‌లోని సీఆర్‌పీఎఫ్ వారిని కాపాడటానికి పోతున్న వైమానికదళం హెలికాప్టర్లు కాల్పులు జరుగుతున్నాయని వారిని వదిలిపెట్టేసి పోవడాన్ని చూశాం!
దీనికి సమర్థనగా వెంటనే సాకులు దొరికాయి. అదే అక్కడ ఉన్నది ౖసైని కులై ఉంటే ఐఏఎఫ్ ఇలా ప్రమాదమంటూ విముఖత చూపేదా? లేక దాన్ని అంత తేలికగా వదిలి పెట్టేసేవారా? అని నా అనుమానం. దీన్ని సీఆర్‌పీఎఫ్ మరచిపోలేదు. నాటి సైనిక, వైమానిక బలగాల అధిపతులు ‘‘మన సొంత ప్రజల’’తో పోరాటంలోకి సాయుధ బలగాలను దిం^è జాలమని ప్రకటిం చారు. వారి నుంచి వచ్చిన ఈ వికారపు ప్రతిస్పందనను కూడా ఏఏపీఎఫ్ మరిచిపోలేదు. ఇది వారిని సమాధానపరచలేని యూపీఏ పిరికితనాన్ని వెల్ల డిస్తుంది. ముందుగా అది వారిని ‘‘మన సొంత ప్రజలు’’ అనే సూత్రం కశ్మీరీ లకు, ఈశాన్యంలోని ఆదివాసులకు ఎందుకు వర్తించదని అడిగి ఉండా ల్సింది. ఇక రెండవది నేడు మరింత సముచితమైన ప్రశ్న... ఈ వైఖరి మన పారా మిలిటరీ బలగాలకు ఎలా అనిపిస్తుంది?
ఖాకీ దుస్తుల సైనికులు వీటిలో వేటినీ మరచిపోలేదు. నేటి జవాను పాత తరహాకు చెందిన... ఎందుకు ఏమిటి అని ఆలోచించని బాపతు కాదు. విద్యావంతుడైన, విషయాలు తెలిసిన, ప్రశ్నించేతత్వం, వాదించేతత్వం గల వాడు. తన గురించి, తన పిల్లల గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడు. యుద్ధానికి దిగేటప్పుడు అతను అడిగే మొదటి ప్రశ్న.. నా అధికారులు ఎక్కడ? నా అత్యున్నతాధికారులు ఎప్పుడైనా ఇలాంటి సైనిక చర్యను లేదా ప్రమాదాన్ని చూశారా? అనేదే కావచ్చు. గొప్పగా చెప్పుకునే జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) సహా సీఏపీఎఫ్ బలగాలకు చెందిన అత్యున్నతాధికారులు చాలావరకు ఐపీఎస్‌లే. వారు ఈ ప్రశ్నలను ముఖాముఖి ఎదుర్కొనలేరు. ఇప్పుడిక వారు ఆ ప్రశ్నలను దాటవేయలేరు. అదే సమస్య.
కేంద్ర పోలీసు బలగాలలోని ఈ లోతైన, మరింత లోతుగా విస్తరిస్తున్న అసంతృప్తి ఇప్పుడు ఆందోళనకర స్థాయికి చేరింది. ఇది ఢిల్లీలో, ప్రత్యేకించి వారి ఉన్నతాధికారులు తమ కోసం నిర్మించుకున్న అధునాతన క్లబ్బులు, ‘‘సంస్థల’’లో కనిపించేది కాదు. సాధారణ బలగాల హృదయాల మీద, మన స్సుల మీద పడ్డ ఈ ముడతలు స్పష్టంగా కనిపించవు. కానీ అవి ధగధగలాడే వారి యూనిఫారాలకంటే ముఖ్యమైనవి. అతి తక్కువ వ్యవధిలో సీఆర్‌పీఎఫ్ బలగాలు దశాబ్దాల తరపడి ఒక చోటి నుంచి మరో చోటికి తరలుతున్నాయి. దడదడలాడే ట్రక్కుల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో సరుకు రావాణా విమా నాల్లో వారు పోతుంటారు. తమలో తాము ‘‘చల్తే రహో ప్యారే’’ (కదులు తూనే ఉండు, మిత్రమా) అనుకుంటూ ఉంటారు.
రెండవ తరగతి సైనికులా?
వాస్తవం అంత ఉల్లాసంగా ఉండేదేమీ కాదు. సైన్యం కమాండు కింద ఉన్న కశ్మీర్ వంటి ప్రాంతాల్లోనైతే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) రక్షణ ఉంటుంది. మిగతా చాలా చోట్ల వారు అధ్వానౖమైన జీతభత్యాలు, ఆహారం, నాయకత్వం, ఆదరణతో లేదా స్వల్ప పెన్షన్లతో తమను తాము రెండవ తరగతి సైనికులుగా భావిస్తుంటారు. సైన్యం విషయంలో మాట్లాడగలిగిన సీనియర్ సైనికాధికారులు ఉంటారు. పే కమిషన్, ఓఆర్‌ఓపీ వంటి విషయాలపై మీడియా ద్వారా వివరించగలుగు తారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఆ భాగ్యమూ లేదు. వాటికి నేతృత్వం వహించడానికి వచ్చేవారంతా తాత్కాలికంగా ఆ బాధ్యతల్లోకి వచ్చే ఐపీ ఎస్‌లే. తిరిగి వారు వచ్చిన చోటికే పోతారు. సీఆర్‌పీఎఫ్‌ను ఉదాహర ణగా తీసుకుని బీఎస్‌ఎఫ్ కూడా తమను తాము ‘‘బిస్తర్ సమాల్ ఫోర్స్’’ (పక్క బట్టలు సర్దుకుపోయే బలగం)గా పిలుచుకుంటున్నారు. అంతా సక్ర మంగా ఉన్నప్పుడైతే ఇలా మాట్లాడటం ఓ పరిహాసమూ, తమను తాము తక్కువ చేసుకోవడమూ అవుతుంది. కానీ ఛత్తీస్‌గఢ్‌లో మీరు తినే తిండి పూట పూటకూ రోత పుట్టిస్తున్నదని లేదా మీకు అందే వైద్యం నాసిరకపుదని లేదా మీ స్టోర్స్ శిబిర రక్షణకు సైతం సరిపోనిదని ఈఎన్ రామ్‌మోహన్ విచా రణలో వెల్లడైనప్పుడు అది అలాంటిది కాదు.
గత రెండు దశాబ్దాలలో సీఏపీఎఫ్‌లు భారీ ఎత్తున విస్తరించాయి. సీఆర్ పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ (సశస్త్ర సీమా బల్), ఐటీబీపీ (ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్), సీఐఎస్‌ఎఫ్ (సీఐఎస్‌ఎఫ్) అన్నీ కలసి 10 లక్షలకుపైగా పెరిగాయి. ఎయిర్‌పోర్టులను, చివరకు బెంగళూరు ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను సైతం కాపాలా కాస్తూ కనిపించేది సీఐఎస్‌ఎఫ్ బలగాలే. కొంత హాస్యస్ఫో రకమైనదిగా అనిపించినా... భారత సాయుధ బలగాలు ప్రపంచంలోకెల్లా నాలుగవ అతిపెద్ద బలగాలు మాత్రమే కాదు... ఐదవ అతి పెద్ద బలగాలు కూడా, అయితే, ఆ ఐదో అతి పెద్ద బలగాలు రక్షణశాఖ కిందగాక హోంశాఖ కింద ఉంది. ఈ బలగాలను సంస్కరించడం, ఆధునీకరించడం, వాటి అన్ని స్థాయిలలో నాయకత్వాన్ని అందించడం అవసరం. అవి చాలా పెద్ద బల గాలు, అతి ముఖ్య వ్యవస్థ కావడమే కాదు, ఎన్నో బాధ్యతలలో ఒకటిగా వాటిని హోంశాఖకు వదిలేయగలిగినవి కూడా కాదు. వాటి క్యాడర్, సంక్షేమం, సిద్ధాంతంపై సమీక్ష అవసరం. తగు అధికారాలను కలిగిన అంత ర్గత భద్రతా శాఖ సహాయ మంత్రిని దాని కోసం ఏర్పాటు చేయడం రాజీవ్ గాంధీ తన ఐదేళ్ల పాలనలో చేసిన మంచి పనుల్లో ఒకటి. దాన్ని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం భూస్థాపితం చేసింది. యూపీఏ దాన్ని పునరుద్ధరించినా హోం మంత్రులుగా ఉన్నవారంతా చాలా వరకు (పీ చిదం బరం మినహా) విదూషకులే. మన శరీరం అంతటికీ ఈ పులిపిర్లు వ్యాపించ కుండా ఉండాలంటే సరిగ్గా ఇక్కడే మనం పని ప్రారంభించాలి.
(వ్యాసకర్త : శేఖర్ గుప్తా
Twitter@ShekarGupta )