తెలంగాణ నిరంతర స్ఫూర్తి
సందర్భం
ఆగస్టు 6న ప్రొఫెసర్ జయ శంకర్ జయంతిని జరుపు కోవడం తెలంగాణ చారిత్రక కర్తవ్యం. గాంధీ, అంబేడ్కర్ జయంతులకు కేంద్రం సెల వులు ప్రకటించి ఉత్సవాలను నిర్వహిస్తుంది. తెలంగాణ సమాజానికీ తెలంగాణ ఆవి ర్భావానికీ అంతే స్ఫూర్తిని కలిగించిన మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యావంతుల వేదిక ఆకాంక్షిస్తున్నాయి. సంపూర్ణంగా కాకపోయినా దశాబ్దాల తెలంగాణ ఆకాంక్ష ఆకృతి దాల్చి రెండేళ్లు దాటింది.
ప్రభుత్వం తన విజయాలను చెప్పుకుంటున్నది. అనేక ప్రజా సంఘాలు, పౌర వేదికలు దశాబ్దాల పోరాటాల ప్రస్థానాన్ని, త్యాగాలను, నిర్వేదంలో కూరుకుపోయిన క్షణాలను త్రవ్విపోసుకుంటున్నాయి. సాధించుకున్న తెలంగాణను సారంలో ప్రజాపక్షం చేయవలసిన బాధ్యత అందరిపైన ఉన్నదనే అంశాన్ని గుర్తుచేసుకోవడమే జయశంకర్ జయంతిని నిర్వహించుకోవడం వెనుక ఉన్న అసలు ఆశయం.తెలంగాణ ప్రజలందరి సంఘటిత పోరాట ఫలితం. ఆ ప్రజా ఉద్యమానికి తాత్విక పునాదిని, సైద్ధాంతిక భూమికను అందించిన వారిలో అగ్రస్థానం జయశంకర్ సార్‌దే. జీవితకాలం తెలంగాణను స్వప్నించిన వారాయన.
సీమాంధ్ర పాలనలో నీళ్లు, నిధులతో పాటు ఉద్యో గాలను దోచుకున్న కుట్రలను బహిర్గతపరిచి స్వరా ష్ట్రంలో నిరుద్యోగులైన యువజనులకు ఉపాధి లభించే విధంగా తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో జయశంకర్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన స్వప్నం సాకారం కావాలని నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఐదేళ్లలో ఒక లక్షా ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి అర కొర ఉద్యోగాల ప్రకటనలతో సగం రోజులు గడిపేి సింది. కానీ పదివేల ఉద్యోగాలు కూడా కల్పించలేదు. తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి నుండి పీహెచ్.డీ. వరకు చదువుకున్న యువకులు (18 నుండి 40 సంవత్సరాలలోపు) సుమారుగా 50 లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెపుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఉద్యో గాలు ఇచ్చినా ఇంకా మిగిలి ఉండే 49 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉన్నది.
జయశంకర్ సార్ చెప్పినట్లు అభివృద్ధి అంటే వనరులు (బొగ్గు, ఖనిజాలు, నీళ్లు, భూమి వంటివి), పరిశ్రమలు కొద్దిమంది కంట్రాక్టర్లు, కార్పొరేట్ల చేతిలోకి వెళ్లడం కాదు. హైదరాబాద్ అభివృద్ధే కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ (జిల్లాలు) జరిగినపుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. ఆయనను స్మరించుకోవడమంటే సమ న్యాయంతో కూడిన ప్రజాస్వామిక తెలంగాణ కోసం మనల్ని మనం పునరంకితం చేసుకోవడం కూడా. జయశంకర్ సార్ జయంతి వారోత్సవం సందర్భంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలపైన, కేజీ టు పీజీ విద్యపైన సమగ్ర విధానం ప్రకటించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రభుత్వాన్ని కోరుతున్నది. ఈ లక్ష్యాల సాధన కోసం ప్రస్తుత ప్రభుత్వ పనితీరును ప్రజా ప్రయోజనాల కోణం నుంచి విశ్లేషించాలని పిలుపునిస్తున్నది.
(ఆగస్టు 6 ప్రొ॥జయశంకర్ జయంతి)
( వ్యాసకర్త:గురిజాల రవీందర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
మొబైల్‌ః 9949994509 )