
విశాఖ సిటీ: పారిశ్రామిక నవకల్పనలు, సాంకేతిక ఉత్పత్తి, పారిశ్రామికీకరణ అంశాలపై విశాఖపట్నంలో బుధవారం నుంచి 19 వరకు నిర్వహించే అంతర్జాతీయ మహిళా పారిశ్రామికాభివృద్ధి సదస్సుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సును ప్రారంభిస్తారు. తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించడంతో పాటు వ్యాపార అభివృద్ధిపై చర్చించేందుకు దేశ విదేశాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు రానున్నారు. భారత మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య (అలీఫ్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం సదస్సును హోటల్ నోవాటెల్‌లో నిర్వహించనుంది.