Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu coalition govt Land Grabbing For Amaravati Capital Expansion1
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు మండలాల పరిధిలో... రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ‘రియల్‌’ వ్యాపారిలా మారిపోయి... రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ లేదా నెగోíÙయేటెడ్‌ సెటిల్‌మెంట్స్‌ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్‌ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు.

AB Venkateswara Rao Secret Talks With Janupalli Srinivas Family Members2
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలైంది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ ఇంటికి మాజీ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2018లో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు.అయితే, ప్రసుత్తం ఆయన కూటమి ప్రభుత్వంలో కూడా నామినేటెడ్‌ పోస్ట్‌లో కొనసాగుతున్నారు. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి ఏబీ మంతనాలు జరిపారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు కీలక దశలో ఉండగా.. నిందితుడు శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో ఏబీ వెంకటేశ్వరరావు రహస్యంగా చర్చలు జరపడం చర్చాంశనీయంగా మారింది. శ్రీనివాస్‌ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీనే హత్యాయత్నం చేయించిందని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. జనుపల్లి శ్రీనివాస్‌ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంతో టీడీపీతో నిందితుడు శ్రీనివాస్‌కు ఉన్న సంబంధాలు బట్టబయలైంది. కొద్దిరోజుల నుంచి జగన్‌పై విషం కక్కుతూ ఏబీవీ ట్వీట్‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎక్స్‌లో జగన్‌పై ఏబీవీ తన అక్కసును వెళ్లగక్కారు.

Ponguleti Srinivas Reddy Comments with Media3
ఎన్నికల రెఫరెండమే!

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే 2029 శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం, పోర్టల్‌ను రెఫరెండంగా స్వీకరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. భూములున్న ప్రతి ఒక్కరికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా ‘భూ భారతి’చట్టాన్ని, పోర్టల్‌ను తెస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 134వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం భూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సోమవారం నుంచే భూభారతి పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇకపై ధరణి పోర్టల్‌ ఉండదని తెలిపారు. భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమా లపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తామని చెప్పారు. పోర్టల్‌ ప్రారంభం కాగానే ప్రజలంతా ఒకేసారి దానిని సందర్శించవద్దని, అలా చేస్తే పోర్టల్‌ ఆగిపోయే ప్రమాదం ఉందని మంత్రి చెప్పారు. కొంతమంది ఉద్దేశ పూర్వకంగా పోర్టల్‌ను నిలుపుదల చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తొలుత 3 మండలాల్లో భూభారతిభూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను తొలుత మూడు జిల్లాల్లోని మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతు న్నట్లు పొంగులేటి తెలిపారు. ధరణిలో తలెత్తిన సమస్యలు భూభారతిలో రాకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అచ్చుతప్పులు, భూ విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, తండ్రి పేరు మార్పు, భూ లావా దేవీల్లో అవకతవకలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ మూడు మండలాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా జూన్‌ 2వ తేదీ నాటికి రాష్ట్రమంతా ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ధరణిని తెచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని తెలిపారు. పార్ట్‌ బీలోని భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ధరణిలో 33 మాడ్యూల్స్‌ ఉండగా, భూభారతిలో 6 మాత్రమే ఉంటాయని వెల్లడించారు. భూభారతి అమలు కోసం ఎంపికచేసిన గ్రామాల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. భూభారతిలో ఎమ్మార్వో స్థాయి నుంచి సీసీఎల్‌ఏ వరకు ఐదు స్థాయిల్లో భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాల వికేంద్రీకరణ చేసినట్లు వివరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మే మొదటివారంలో గ్రామ పాలనాధికారులువచ్చేనెల మొదటివారంలో గ్రామాల్లో రెవెన్యూ పాలనా యంత్రాంగాన్ని పునరుద్ధరిస్తామని పొంగులేటి తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వేయి మంది లైసెన్సుడ్‌ సర్వేయర్లను నియమిస్తామని మంత్రి ప్రకటించారు.

India Uses Laser Weapons To Shoot Down Aircraft & Missiles4
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం

న్యూఢిల్లీ: భారత్ అమ్ములపొదిలో హై పవర్ లేజర్ ఆయుధం వచ్చి చేరింది. అధునాతన అధిక శక్తి కల్గిన 30 కిలోవాట్ల లేజర్ బీమ్ ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఫలితంగా లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్( (DEW) సిస్టమ్ ద్వారా అధునాతన పవర్‌ ఫుల్‌ వెపన్‌ ను తయారు చేసిన దేశాల జాబితాలో భారత్‌ చేరిపోయింది. ఇప్పటివరకూ ముందు వరుసలో అమెరికా, రష్యా, చైనాలు ఉండగా, ఇప్పుడు వాటి సరసన భారత్‌ చేరింది.ఆదివారం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (NOAR)లో ఈ విజయవంతమైన ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో ఫిక్స్ డ్ వింగ్ డ్రోన్ లు, స్వార్మ్ డ్రోన్ లపై అధునాతన లేజర్ బీమ్‌ను ప్రయోగించారు. ఇది భారత్‌ సాధించిన మరో విజయందీన్ని సక్సెస్‌ ఫుల్‌ గా లేజర్‌ బీమ్‌ కూల్చివేయడంతో డీఆర్‌డీవో సంబరాలు చేసుకుంది. టెక్నాలజీలో ఇది భారత్‌ సాధించిన మరో విజయంగా పేర్కొంది. భారత్ ట్రయల్ రన్ నిర్వహించిన ఈ లేజర్ బీమ్ కు ఎయిర్ క్రాఫ్ట్ లను, మిస్సెల్స్ ను క్షణాల్లో కూల్చివేసి సామర్థ్యం ఉంది. డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ ఆధ్వర్యంలోని ఈ ప్రయోగం చేపట్టారు. ఇది విజయవంతమైన తర్వాత టీమ్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా ఆయన జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఇది గగనతలం రక్షణ దళాన్ని మరింత పటిష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయం కావడంతో అధునాతన టెక్నాలజీ కల్గిన అరుదైన దేశాల జాబితాలో చేరినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల చైనా కూడా ఇదే తరహా టెక్నాలజీతో ఓ పవర్ ఫుల్ బీమ్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే.మనముందు ఇంకా చాలా లక్ష్యాలే ఉన్నాయి..కామత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ శక్తి సామర్థ్యాలను కల్గి ఉండగా, ఇప్పుడు మనం కూడా వాటి సరసన చేరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ కూడా ఇదే తరహా టెక్నాలజీతో వెపన్స్ తయారు చేసే పనిలో ఉందన్నారు.మనం ఇంకా చాలా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. వాటిని సాధించే పనిలోనే ఉన్నాం. హై ఎనర్జీ సిస్టమ్ తో అత్యధిక పవర్ కల్గిన మైక్రోవేవ్స్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నటిక్ ఆయుధాలను తయారు చేయడానికి సమాయత్తమైనట్లు ఆయన వెల్లడించారు. మనకున్న పలు రకాలైన సాంకేతిక విజ్ఞానంతో స్టార్ వార్స్ శక్తిసామర్థ్యాలను కల్గిన ఆయుధాలను తీసుకురావచ్చన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా స్టార్ వార్స్ సామర్థ్యం కల్గిన వెపనే అంటూ ఆయన పేర్కొన్నారు. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… https://t.co/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025

Sakshi Guest Column On Dr BR Ambedkar On His Jayanthi5
దూరదృష్టి గల సంస్కర్త

భారతదేశపు గొప్ప దార్శనికులలో ఒకరైన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 135వ జయంతి ఈ రోజు. ఆయన వారసత్వాన్ని తక్కువ చేసి చూపించడానికి ఉద్దేశపూర్వకంగా అవాంఛ నీయ ప్రయత్నాలెన్నో జరిగాయి. శతాబ్దం గడచిన తర్వాత కూడా, అంబేడ్కర్‌ అంటే కేవలం ఒక దళిత నాయకుడిగా పరిగణించడం శోచనీయం. ఆయనను దళితులు, అణ గారిన వర్గాల ప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఆధునిక భారత దేశపు అగ్రశ్రేణి మేధావుల్లో ఒకరిగా పరిగణించాలన్నది అత్యావశ్యం. చదువుకునే రోజుల్లో పిల్లలంతా తాగే సాధారణ కుళాయి నుంచి నీళ్లు తాగడానికి కూడా ఆయనను అనుమతించేవారు కాదు. ఒకసారి మండు వేసవిలో దాహం తట్టుకోలేక దగ్గర్లో ఉన్న కుళాయి నుంచి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తే... కట్టుబాట్లు ఉల్లంఘించారనే కారణంతో ఆయన మీద దాడికి తెగబడ్డారు. ఆ సంఘటన తరువాత చాలామంది తమ రాత ఇంతే అని సరిపెట్టుకుని ఉండేవారు. మరి కొందరైతే హింసా మార్గాన్ని ఎంచుకుని ఉండేవారు. కానీ, ఆయన అలా చేయలేదు. తనలోని బాధను గుండెల్లోనే అదిమిపెట్టుకుని జీవితాన్ని చదవడం నేర్చుకున్నారు. కొలంబియా, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో డిగ్రీలతో సహా ఎంఏ, ఎంఎస్సీ, పీహెచ్డీ, డీఎస్సీ, డీలిట్, బార్‌–ఎట్‌–లా పూర్తి చేశారు. ఏ పాఠశాలల్లో అయితే తనను చదువుకోవడానికి అనుమతించలేదో... అంతకు మించిన స్థాయిలో విదేశాల్లో విద్యను పూర్తి చేసి తానేమిటో సమాజానికి చూపించారు. అయినా తన మాతృభూమి, కర్మభూమి అయిన భారతదేశానికి తిరిగి వచ్చే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉండేవారు.పేరెన్నికగన్న సంస్థల ఏర్పాటులో అంబేడ్కర్‌ పాత్ర విస్మరించలేనిది. ఆధునిక భారతదేశంలో ఆర్బీఐ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ వంటి అనేక సంస్థలు బాబాసాహెబ్‌ దూరదృష్టితో పురుడు పోసు కున్నవే. ఆర్థికశాస్త్రం, ఆర్థిక చరిత్రపై తన ప్రావీణ్యంతో భారత్‌ ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను ఆధారాలతో సహా ‘రాయల్‌ కమిషన్‌ ఆన్‌ ఇండియన్‌ కరెన్సీ అండ్‌ ఫైనాన్స్‌’కు విశ్లేషణాత్మకంగా వివరించారు. ఫలితంగా ఒక సెంట్రల్‌ బ్యాంక్‌గా విధులను నిర్వర్తించే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటుకు పునాది పడింది.గట్టి ప్రజాస్వామ్యవాదిఅంబేడ్కర్‌ దృఢమైన ప్రజాస్వామ్యవాది. భారత దేశపు భవి ష్యత్తు, దాని ప్రజాస్వామ్యం, కష్టపడి సంపాదించిన స్వాతంత్య్రం గురించే ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. రాజ్యాంగ సభలో ఆయన చివరి ప్రసంగంలో ఈ భయాందోళనలు సుస్పష్టంగా వ్యక్తమ య్యాయి. ఆయన హెచ్చరికలే భారతదేశాన్ని దాదాపు ఎనిమిది దశా బ్దాలుగా ప్రజాస్వామ్య మార్గంలో నడిపిస్తున్నాయి. అయితే నేడు కులం, మతం, జాతి, భాష మొదలైన సామాజిక విభేదాలతో భారతీ యుల మధ్య సోదరభావాన్ని తగ్గించే ప్రయత్నాలను చూస్తున్నాం.ఆర్య–ద్రావిడ విభజన నుంచి ఎక్కువ ప్రయోజనం పొందగలిగే సమయంలో కూడా ఆర్య దండయాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్‌ తప్పు పట్టారు. ‘ఒక తెగ లేదా కుటుంబం జాతిపరంగా ఆర్యులా లేదా ద్రావిడులా అనేది విదేశీ వ్యక్తులొచ్చి విభజన రేఖ గీసేవరకు భారత ప్రజల మదిలో ఇలాంటి ఆలోచనలు తలెత్తలే’దని 1918లో ప్రచురించిన ఒక పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. పైగా యజుర్వేద, అధర్వణ వేదాల్లోని రుషులు శూద్రులకు తగిన ప్రాధాన్యమిచ్చిన అనేక సందర్భాలను ఉదాహరించారు. ఆర్యులు, ద్రవిడుల కంటే అంటరానివారు జాతిపరంగా భిన్నమైనవారనే సిద్ధాంతాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు.తమ సంకుచిత, మతపరమైన ప్రయోజనాల కోసం భాషా సమస్యలను సాకుగా చూపించేవారు దేశ ఐక్యత విషయంలో అంబే డ్కర్‌ అభిప్రాయాలను తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం పొందుతారు.తాను ప్రావీణ్యం సంపాదించిన తొమ్మిది భాషలలో ఒకటైన సంస్కృతాన్ని అధికారిక భాషగా ఆమోదించడానికి మద్దతుగా 1949 సెప్టెంబరు 10న ఆయన రాజ్యాంగ సభలో ఒక సవరణను ప్రవేశ పెట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై తన ఆలోచనలు వెల్లడిస్తూ... ‘హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి’ అని ప్రకటించారు. హిందీ మాట్లాడే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాక పోయినప్పటికీ, దేశ ప్రాధాన్యాలకు ప్రథమ స్థానమిచ్చా రన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఆయన దార్శనికతకు అనుగుణంగా...’ప్రజాస్వామ్యం విజయవంతంగా సాగడానికి అనుసరించా ల్సిన పద్ధతుల’పై 1952 డిసెంబర్‌ 22న ఒక ప్రసంగమిస్తూ... ప్రజా స్వామ్యం రూపం, ఉద్దేశం కాలక్రమేణా మారుతాయనీ, ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే ఆధునిక ప్రజాస్వామ్యపు లక్ష్యమనీ పేర్కొ న్నారు. ఈ దార్శనికతతోనే మా ప్రభుత్వం గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో విజయం సాధించింది. 16 కోట్ల గృహాలకు కుళాయి నీటిని అందించడానికి కృషి చేశాం. పేద కుటుంబాల కోసం 5 కోట్ల ఇళ్లను నిర్మించాం. 2023లో ‘జన్‌ మన్‌ అభియాన్‌’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ ప్రారంభించారు. బలహీన గిరిజన వర్గాల (పీవీటీజీ) సామాజిక– ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, పీవీటీజీ గృహాలు–ఆవాసా లకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం దీని లక్ష్యం. ప్రధాన మంత్రి 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇది బాబాసాహెబ్‌ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాదు, బాబాసాహెబ్‌ వారసత్వం, రచనల గురించి భవిష్యత్‌ తరాలకు మరింతగా తెలియజెప్పడానికి, మా ప్రభుత్వం పంచతీర్థాన్ని అభివృద్ధి చేసింది. అంబేడ్కర్‌తో ముడిపడిన మహూ (మధ్యప్రదేశ్‌); నాగపూర్‌ (మహారాష్ట్ర) లోని దీక్షా భూమి; లండన్‌ లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ మెమోరియల్‌ హోమ్‌; అలీపూర్‌ రోడ్‌ (ఢిల్లీ) లోని మహాపరినిర్వాణ భూమి, మరియు ముంబయి (మహారాష్ట్ర) లోని చైత్య భూమిలే ఆ పంచ తీర్థాలు.గత నెలలో ప్రధాని దీక్షాభూమిని సందర్శించినప్పుడు, బాబా సాహెబ్‌ ఊహించిన భారతదేశాన్ని సాకారం చేయడానికి మరింత కష్టించి పనిచేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అంబేడ్కర్‌ ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంటామంటూ ప్రతిజ్ఞ చేసే అవకాశాన్ని ఆయన జయంతి కల్పిస్తోంది. జాతి, మత, ప్రాంత, కులాలకు అతీతంగా మనమంతా ‘భారతీయులు’గా సాగిపోదాం. ఆయన్ని ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడిగా చేసే ప్రయత్నాలను అడ్డు కోవాలి. ఒక సందర్భంలో సైమన్‌ కమిషన్‌ ఆధా రాల గురించి అడిగితే... ప్రాంతీయ దురభిమానమూ, సమూహ భావనలకూ లోనయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తూ, ‘మనమె ప్పుడూ భారతీయులమే’ అన్న చైతన్యాన్ని ప్రజల్లో కలిగించడం అత్యవశ్యమని చెప్పారు. బాబాసాహెబ్‌... భారతదేశానికి దేవుడి చ్చిన వరం. ప్రపంచానికి భారతదేశమిచ్చిన బహుమతి. అప్పటి బ్రిటిష్‌ ఇండియా గానీ, నవ స్వతంత్ర భారతం గానీ ఇవ్వని గౌరవ పీఠాన్ని మనం ఆయనకిద్దాం.రాజ్‌నాథ్‌ సింగ్‌వ్యాసకర్త భారత రక్షణ మంత్రి

First defeat for Delhi Capitals in the 18th season of IPL6
పరుగుల వేటలో ఢిల్లీ ‘రనౌట్‌’

వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్రేక్‌ పడింది. ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ రాణించడంతో మంచి స్కోరు చేసిన ముంబై... అనంతరం చివరి వరకు పట్టు వదలకుండా ప్రయత్నించి సీజన్‌లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. చాలా రోజుల తర్వాత ఐపీఎల్‌లో బరిలోకి దిగిన కరుణ్‌ నాయర్‌ ఒంటిచేత్తో ఢిల్లీని గెలిపించేలా కనిపించినా... చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ ఫీల్డర్ల గురికి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఐపీఎల్‌ 18వ సీజన్‌లో తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఈ పోరులో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. మొదట ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (33 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికెల్టన్‌ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆఖర్లో నమన్‌ ధీర్‌ (17 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్, విప్రాజ్‌ నిగమ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. సీనియర్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... అభిషేక్‌ పొరెల్‌ (33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో ఢిల్లీ జట్టు వరుసగా మూడు బంతుల్లో అశుతోష్‌ శర్మ, కుల్దీప్, మోహిత్‌ శర్మ వికెట్లను కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఈ ముగ్గురూ రనౌట్‌ కావడం గమనార్హం. ముంబై బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కరణ్‌ శర్మ 3 వికెట్లు, సాంట్నర్‌ 2 వికెట్లు పడగొట్టారు. తిలక్‌ తడాఖా... గత కొన్ని మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై మిడిలార్డర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ... ఢిల్లీపై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా పాండ్యా బృందం మంచి స్కోరు చేయగలిగింది. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన రికెల్టన్‌ రెండో ఓవర్‌లో సిక్సర్‌తో జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మూడో ఓవర్‌లో రికెల్టన్‌ 2 ఫోర్లు, రోహిత్‌ శర్మ 6, 4 బాదడంతో 19 పరుగులు వచ్చాయి. మంచి టచ్‌లో కనిపించిన రోహిత్‌ (12 బంతుల్లో 18)ను లెగ్‌స్పిన్నర్‌ విప్రాజ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ముంబై తొలి వికెట్‌ కోల్పోగా... సూర్యకుమార్‌ బాధ్యతాయుతంగా ఆడాడు. మరికొన్ని మెరుపుల అనంతరం రికెల్టన్‌ కూడా ఔట్‌ కాగా... తిలక్‌ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఫలితంగా ముంబై 10 ఓవర్లలో 104/2తో నిలిచింది. సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా (2) వరుస ఓవర్లలో ఔట్‌ కాగా... తిలక్‌కు నమన్‌ జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో తిలక్‌ 26 బంతుల్లో ఈ సీజన్‌లో రెండో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కదంతొక్కిన కరుణ్‌.. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతున్న కరుణ్‌ నాయర్‌ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం చూపాడు. ఏడేళ్లుగా ఐపీఎల్లో హాఫ్‌సెంచరీ చేయని నాయర్‌ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే మెక్‌గుర్క్‌ (0) ఔట్‌ కావడంతో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అడుగుపెట్టిన నాయర్‌... క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. రెండో ఓవర్‌లో 3 ఫోర్లు కొట్టిన అతడు... ఐదో ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదాడు. స్టార్‌ పేసర్‌ బుమ్రా వేసిన ఆరో ఓవర్‌లో 6, 4, 6తో కరుణ్‌ 22 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా ఓవర్‌లో 6, 4 కొట్టిన నాయర్‌... కరణ్‌ శర్మ ఓవర్‌లో రెండు ఫోర్లతో సెంచరీకి సమీపించాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 61 బంతుల్లో 119 పరుగులు జోడించిన అనంతరం పొరెల్‌ ఔట్‌ కాగా... మరో ఫోర్‌ కొట్టిన అనంతరం కరుణ్‌ వెనుదిరిగాడు. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (9), స్టబ్స్‌ (1) విఫలం కాగా... కేఎల్‌ రాహుల్‌ (15), అశుతోష్‌ శర్మ (17), విప్రాజ్‌ (14) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. నాయర్‌ మెరుపులతో 11 ఓవర్లు ముగిసేసరికి 128/2తో అలవోకగా విజయం సాధించేలా కనిపించిన ఢిల్లీ... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీ) (బి) విప్రాజ్‌ 18; రికెల్టన్‌ (బి) కుల్దీప్‌ 41; సూర్యకుమార్‌ (సి) స్టార్క్‌ (బి) కుల్దీప్‌ 40; తిలక్‌ (సి) పొరెల్‌ (బి) ముకేశ్‌ 59; హార్దిక్‌ (సి) స్టబ్స్‌ (బి) విప్రాజ్‌ 2; నమన్‌ (నాటౌట్‌) 38; జాక్స్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–47, 2–75, 3–135, 4–138, 5–200; బౌలింగ్‌: స్టార్క్‌ 3–0–43–0; ముకేశ్‌ 4–0–38–1; విప్రాజ్‌ నిగమ్‌ 4–0–41–2; కుల్దీప్‌ 4–0–23–2; అక్షర్‌ 2–0–19–0; మోహిత్‌ 3–0–40–0. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: మెక్‌గుర్క్‌ (సి) జాక్స్‌ (బి) దీపక్‌ చహర్‌ 0; పొరెల్‌ (సి) నమన్‌ (బి) కరణ్‌ శర్మ 33; కరుణ్‌ నాయర్‌ (బి) సాంట్నర్‌ 89; రాహుల్‌ (సి అండ్‌ బి) కరణ్‌ శర్మ 15; అక్షర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 9; స్టబ్స్‌ (సి) నమన్‌ (బి) కరణ్‌ శర్మ 1; అశుతోష్‌ (రనౌట్‌) 17; విప్రాజ్‌ నిగమ్‌ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) సాంట్నర్‌ 14; స్టార్క్‌ (నాటౌట్‌) 1; కుల్దీప్‌ (రనౌట్‌) 1; మోహిత్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్‌) 193. వికెట్ల పతనం: 1–0, 2–119, 3–135, 4–144, 5–145, 6–160, 7–180, 8–192, 9–193, 10–193. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–24–1; బౌల్ట్‌ 2–0–21–0; బుమ్రా 4–0–44–1; సాంట్నర్‌ 4–0–43–2; హార్దిక్‌ పాండ్యా 2–0–21–0; కరణ్‌ శర్మ 4–0–36–3. ఐపీఎల్‌లో నేడులక్నో X చెన్నై వేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Sakshi Editorial On Telugu books and writers7
లాంగ్‌లిస్ట్‌లూ... షార్ట్‌లిస్ట్‌లూ....

ఆంధ్రప్రదేశ్‌లో వందల ఉగాది పురస్కారాల హడావిడిలో రచయితలు ఉండగా, తెలంగాణలో కంచ గచ్చిబౌలి స్థలాలకు సంబంధించి తమ పర్యావరణ స్పృహను సోషల్‌ మీడియా పోస్టులతో వెల్లడించే పనిలో సాహితీకారులు ఉండగా దేశాన కొన్ని ఆసక్తికరమైన సాహితీ ఘటనలు చోటు చేసుకున్నాయి. తన మానాన తానుంటూ తన రాతేదో తాను రాసుకుంటూ వచ్చిన హిందీ కవి వినోద్‌ కుమార్‌ శుక్లాకు జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించడం వాటిలో ఒకటి. ఆయన సీదాసాదా మనిషి. రచనల శీర్షికలు కూడా బహు సరళంగా ఉంటాయి. ‘పనివాడి అంగీ’... ‘గోడలో ఒక కిటికీ ఉండేది’... వినోద్‌ కుమార్‌ శుక్లా మొదట రచ్చ గెలిచారు. ప్రతిష్ఠాత్మకమైన ‘పెన్‌ నబకోవ్‌ అవార్డ్‌’ను 2023 సంవత్సరానికి గెలుచుకున్నారు. ఆ అవార్డు పొందిన ఏకైక భారతీయ కవి ఆయనే. కాబట్టి విలువైన ఆయన సాహిత్యానికి సర్వోత్కృష్ట జ్ఞానపీఠం దక్కడం అందరూ హర్షించారు. శుక్లా గారితో పోటీ పడినవారిలో ఒక తెలుగు పేరు ఉంది. జ్ఞానపీఠం షార్ట్‌లిస్టులో తెలుగు పేరు ఉండటం ఘనతే. రావూరి భరద్వాజ తర్వాత తాము జ్ఞానపీఠ పురస్కారానికి యోగ్యులమని భావిస్తున్నవారు ఉన్నారు. అయితే అలా యోగ్యులమని అనుకునేవారిలో కొందరి పేర్లు హడలిచచ్చేలా ఉన్నాయనే గిట్టనివారూ ఉన్నారు.భారతదేశంలో స్థానికంగా గాని, జాతీయస్థాయిలో గాని షార్ట్‌లిస్టులలో పేరు చేరేవారు కొందరైతే చేర్పించుకునేవారు కొందరు. ‘సాహిత్య అకాడెమీ అవార్డు’ షార్ట్‌లిస్టుల్లో చేర్చబడ్డాయేమో అనిపించేలా కొన్ని పేర్లు చూసి ఆకలిదప్పులు మాని మంచం పట్టే సాహిత్యాభిమానులు ఉన్నారు. ప్రతిఏటా ఈ షార్ట్‌లిస్ట్‌ వీరి పాలిట ప్రాణాంతకంగా మారడం ఆందోళనకరం. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇలా చేర్పించుకోవడం సాధ్యం కాదు. అందుకే కన్నడ నేలన ఇప్పుడు సంబరాలు సాగుతున్నాయి. కారణం ‘ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రెజ్‌ 2025’ షార్ట్‌లిస్ట్‌లో మొదటిసారి కన్నడ పుస్తకానికి చోటు దక్కింది. సీనియర్‌ కన్నడ రచయిత్రి బాను ముష్టాక్‌ రాసిన కథాసంపుటి ‘హార్ట్‌ ల్యాంప్‌’ ఈ షార్ట్‌లిస్టులో ఉంది. యాక్టివిస్ట్‌గా ఉంటూ దళిత, మైనార్టీ మహిళా జీవితాలను ఎక్కువగా రాసే బాను ముష్టాక్‌ పుస్తకంతో పాటు కేవలం 6 పుస్తకాలతో ఉన్న షార్ట్‌లిస్ట్‌ నుంచి మే 20న విజేతను ప్రకటిస్తారు. 50 లక్షల రూపాయల బహుమతి ఉంటుంది. అదొక్కటే కాదు ఆ నవల ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువవుతుంది. బాను ముష్టాక్‌ గెలిస్తే కన్నడ భాష ఘనతకు మరో నిదర్శనమవుతుంది. ఇలాగే 2022లో ‘రేత్‌ కీ సమాధి’ నవల ఇంగ్లిష్‌ అనువాదం ‘టూంబ్‌ ఆఫ్‌ శాండ్‌’కు గీతాంజలిశ్రీ బుకర్‌ప్రెజ్‌ గెలుచుకున్నారు. అప్పుడుగాని ఇప్పుడుగాని తెలుగు నవల, కథ ఈ దారుల్లోకి రాకపోవడం మన వరకూ ఘనతే.ప్రపంచ దేశాలలో తెలుగు రాష్ట్రాలలో ఒక జిల్లా అంత ఉన్నవారు, హైదరాబాద్‌ జనాభా అంత సంఖ్యలో భాషను మాట్లాడేవారు, మన దేశంలో పదేళ్ల కాలంలో కేవలం యాక్సిడెంట్లలో మరణించేంతమంది మాత్రమే రాసే, చదివే భాష ఉన్నవారు కూడా అంతర్జాతీయస్థాయి అవార్డుల లాంగ్‌లిస్టులలో, షార్ట్‌లిస్టులలో కనిపిస్తారు. రెండు కోట్ల మంది జనాభా ఉన్న శ్రీలంక నుంచి ఎందరో అంతర్జాతీయ స్థాయి రచయితలు ఉన్నారు. పది కోట్ల తెలుగు జనాభా నుంచి అంతర్జాతీయ అవార్డుల సంగతి అటుంచి పెంగ్విన్‌ వంటి ప్రసిద్ధ పబ్లిషర్ల వరకూ చేరే రచనలు ఎన్ని... రచయితలు ఎందరు?‘ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ 2025’ కోసం 12 దేశాల నుంచి 13 మంది రచయితల పుస్తకాలు లాంగ్‌లిస్ట్‌ అయ్యాయి. విశేషం ఏమిటంటే వీరంతా మొదటిసారి నామినేట్‌ అయినవారు. బోణి కొట్టి తమ ఉనికి చాటినవారు. వీరి నుంచి ఆరు మందితో షార్ట్‌లిస్ట్‌ను ప్రకటించారు. ఆ షార్ట్‌లిస్ట్‌లో కన్నడ నుంచి బాను ముష్టాక్‌ ఉన్నారు. షార్ట్‌లిస్ట్‌ను ప్రకటిస్తూ బుకర్‌ ప్రైజ్‌ కమిటి యు.కె.కు చెందిన ట్రాన్‌ ్సలేటర్‌ సోఫీ హ్యూస్‌ను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆమె అనువాదం చేసిన రచనలు ఇప్పటికి ఐదుసార్లు లాంగ్‌లిస్ట్‌లో మూడుసార్లు షార్ట్‌లిస్ట్‌లో వచ్చాయి. ఇది రికార్డు. ఇక్కడే తెలుగు వారి ఘనత ఉంది. తెలుగు పుస్తకాలు గతంలో కాని వర్తమానంలోగాని ఇంగ్లిష్‌లో గట్టిగా అనువాదం చేసేవారి సంఖ్య చేతి వేళ్లకు మించి లేకపోవడమే ఆ ఘనత. విదేశాలకు లక్షలమంది తెలుగువారు పైచదువులకు వెళ్లినా వారిలో సాంకేతిక విద్య, దాని వల్ల వచ్చే సంపద లక్ష్యంగా కనిపిస్తుంది గాని లింగ్విస్టిక్స్‌ చదవడం, ఇతర భాషలు నేర్చి తెలుగు సాహిత్యాన్ని అనువాదం చేయడం అనేదే లేదు. మిగిలిన భాషల వారు ఈ పని చేస్తున్నారు. ప్రపంచ భాషలు నేర్చి తమ సాహిత్యానికి వాహకులుగా మారుతున్నారు. సోఫీ హ్యూస్‌లాంటి వారు మనలో తయారవ్వాలి లేదా మన కోసం రావాలి.సిఫార్సులు, పైరవీలు లేకుండా... గ్రూపులూ గుంపులూ కట్టకుండా మంచి సాహిత్యం కోసం కృషిని లగ్నం చేసిన తెలుగు రచయితలు ఉన్నారు. ప్రపంచం దృష్టికి వెళ్లాల్సిన రచనలు వీరివి కొద్దిగా అయినా సరే ఉన్నాయి. స్థానిక రాజకీయాలకు ఎడంగా జరిగి దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో మనమేంటి, మనమెక్కడ అనే ఆలోచనతో సాహితీ పరివారం మేలుకోవాల్సిన తరుణం ఇది. రచయితలు, అనువాదకులు, పబ్లిషర్లు, యూనివర్సిటీలు... దండు కట్టి దృష్టి పెట్టగలిగితే నేడు కన్నడ సీమలో జరుగుతున్న సంబరాలు తెలుగులో జరక్కపోవు. షార్ట్‌లిస్టులలో చేరాల్సిన వారి గురించి పట్టకపోతే చేర్చబడేవారే మన ప్రతినిధులుగా కాన వస్తారు. ప్రస్తుతానికి లక్ష్యం క్రోసులకొద్ది దూరం. మొదటి అడుగు పడితే గమ్యం ఎంతసేపని?

 Man Who is In Karnataka Kidnapped Girl Dies In Encounter8
ఐదేళ్ల బాలికపై హత్యాచార నిందితుడు ‘ఎన్ కౌంటర్’!

బెంగళూరు: ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడు తాజాగా పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయినట్లు తెలుస్తోంది. నిందితుడ్ని పట్టుకునే క‍్రమంలో తప్పించుకోబోయిన 35 ఏళ్ల నితీష్ కుమార్.. పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. ఇదే విషయాన్ని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు.‘మేము నిందితుడి నితీష్ కుమార్ ను పట్టుకున్న తర్వాత మాపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే పారి\పోయే యత్నం చేశాడు. దీనిలో భాగంగా మేము ఓ హెచ్చరిక జారీ చేస్తూ ‘వార్నింగ్ షాట్( అతనిపై కాల్చాం. అయినా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. మేము కేసు రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా అతని ఊరికి తీసుకెళ్లాం. అక్కడ మా టీమ్ పై దాడికి పాల్పడ్డాడు. హుబ్బాల్లి పోలీస్ అధికారి శశి కుమార్ మీడియాకు వెల్లడించారు.తప్పించుకునే క్రమంలో తమ వాహనాలను కూడా అతడు ధ్వంసం చేశాడని, ఈ క్రమంలో తమ టీమ్ లోని ఒక పోలీస్ అధికారి గాల్లోకి కాల్పులు జరపాడన్నారు. అయినా కూడా తప్పించుకునేందుకు యత్నించడంతో అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపామన్నారు. ఆపై వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే యత్నం చేశామని, కానీ డాక్టర్లు అతను చనిపోయినట్లు ధృవీకరించారని సదరు పోలీస్ అధికారి వెల్లడించారు.కన్నేసి.. కిడ్నాప్‌ చేసి హత్యాచారంఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని కొప్పాల్ జిల్లాలో ఐదేళ్ల బాలిక కిడ్నాప్ కు గురి కావడమే కాకుండా ఆపై అత్యాచారం, హత్య గావించబడింది. ఇళ్లలో పని చేసుకునే ఓ మహిళ కూతుర్ని నితీష్ కుమార్ అనే వ్యక్తి హత్యాచారం చేశాడు. తల్లి పనిలో వెళ్లడాన్ని గమనించిన అతను.. పాపను ఇంటి నుంచి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై ఆ పాపను హత్య చేశాడు. ఈ విషయం సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో అతన్ని పోలీసులు పట్టుకుని కస్టడీకి తీసుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు అతని ఊరికి తీసుకెళ్లగా, పోలీసుల్ని ఎదురించి దాడికి యత్నించాడు. దాంతో పోలీసులు జరిగిపన కాల్పుల్లో నితీష్ కుమార్ మరణించాడు.

A 30 Day Warning For Foreign Nationals Staying In US9
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి

వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025 వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

Fire Accident In Anakapalli District10
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య

విశాఖ,సాక్షి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పుతున్నారు.ప్రమాదంపై పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో మృతుల సంఖ్య అంతకంత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆదివారం కావడంతో బాణా సంచా కేంద్రంలో పని చేసేందుకు 15మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ విచారణకు ఆదేశించారు. బాణాసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు:1. దాడి రామలక్ష్మి (35),W/oవెంకటస్వామి, R/o రాజుపేట .2. పురం పాప (40),W/o అప్పారావు, R/o కైలాసపట్నం. 3. గుంపిన వేణుబాబు (34),S/o దేముళ్ళు,R/o కైలాసపట్నం.4. సంగరాతి గోవిందు (40),S/o సత్యనారాయణ, R/o కైలాసపట్నం.5. సేనాపతి బాబూరావు (55)S/o గెడ్డప్ప ,R/o చౌడువాడ.6. అప్పికొండ పల్లయ్య (50)S/o నూకరాజు ,R/o కైలాసపట్నం.7. దేవర నిర్మల (38)W/o వీర వెంకట సత్యనారాయణ, R/o వేట్లపాలెం.8. హేమంత్ (20)R/o భీమిలి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement