AN-32 Plane
-
మళ్లీ సాగేనా?
ఆగిన ఏఎన్-32 గాలింపు అధికారుల సమాలోచన చివరి ప్రయత్నానికి పరిశీలన పరిశోధనకు 54 వస్తువులు సాక్షి, చెన్నై: బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 విమానం గాలింపు ప్రక్రియ ఆగింది. చివరి ప్రయత్నానికి మరోమారు గాలింపునకు అధికార వర్గాలు పరిశీలన సాగిస్తున్నాయి. చెన్నైలోని ఎన్ఐవోటీలో అధికార వర్గాలు తీవ్ర సమాలోచనలో మునిగి ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా మంగళవారం సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు జరిపిన తనిఖీల్లో 54 రకాల వస్తువులు లభించినట్టు, అవి విమాన శకలాలేనా అన్నది నిర్ధారించేందుకు తగ్గట్టుగా పరిశోధనలు వేగవంతం చేశారు.చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్ బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం జూలై 22న బంగాళాఖాతంపై అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతై ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇందులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెంది న వారితో పాటు 29 మంది ఆచూకీ సంబంధించిన ఆశలు అడియాశలు అయ్యాయి. విమానం గల్లంతైనప్పుడు ఎయిర్ బేస్‌కు అందిన సమాచా రం ఆధారంగా చెన్నైకు 150 నాటికన్ మైళ్ల దూరంలో సముద్రంలో కుప్పకూలి ఉండొచ్చన్న సంకేతాలు బయలు దేరాయి. దీంతో ఆ పరిసరాల్లో 20 నౌకలు, 18 విమానాలు, హెలికాప్టర్లు గాలింపును తీవ్రంగానే కొనసాగిస్తూ వచ్చాయి. ఆపరేషన్ తలాష్ పేరుతో సాగిన గాలింపులో చిన్న ఆధారం కూడా చిక్కని దృష్ట్యా, బాధిత కుటుంబాల్లో ఆందోళన, ఆగ్రహం బయలు దేరింది. దీంతో అమెరికా సాయం కోరేందుకు తగ్గ ప్రయత్నాల్లో కేంద్ర రక్షణ శాఖ నిమగ్నమైందని చెప్పవచ్చు. అదే సమయంలో జాతీయ సముద్ర తీర పరిశోధనా విభాగానికి చెందిన సాగర్ నిధి, భారత భౌగోళిక పరిశోధనా సంస్థకు చెందిన సముద్ర రత్నాకర్ నౌకలను రంగంలోకి దించారు. ఈ నౌకలు మూడు వారాలకు పైగా తీవ్రంగా గాలింపులో నిమగ్నం అయ్యాయి. శాస్త్రవేత్త నాగేంద్రన్ నేతృత్వంలో ఎనిమిది మంది పరిశోధకులతో కూడిన బృందం సముద్ర రత్నాకర్‌లో ఉన్న టెక్నాలజీ ఆధారంగా తీవ్ర పరిశోధనలు సాగించారు. అయితే, పూర్తి స్థాయిలో ఆ విమానానికి సంబంధించిన ఆధారాలు చిక్కనట్టుంది. అదే సమయంలో తమకు చిక్కిన వస్తువుల్ని పరిశోధనకు తరలించి ఉన్నారు. ఈనేపథ్యంలో గాలింపు ఈనెల మూడో తేదీ నిలుపుదల చేసి ఉన్నారు. ఇందుకు తగ్గ సమాచారం వెలువడడంతో తదుపరి కసరత్తుల్లో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి. మళ్లీ సాగేనా: గాలింపులో ఉన్న నౌకలు, హెలికాప్టర్లు అన్ని వెనక్కు వచ్చేసినట్టు సమాచారం. సాగర్ నిధి చెన్నైకు, సముద్ర రత్నాకర్ ఫోర్ట్బ్లెయిర్కు తరలి వెళ్లినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో మంగళవారం చెన్నై పళ్లికరణైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐవోటీ)లో అధికారులు సమాలోచనలో మునిగి ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇందులో భారతనౌకాదళం, వైమానిక దళంలతో పాటు ఎన్ఐవోటీ, తదితర విభాగాల అధికారులు పాల్గొని ఉన్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు సాగిన గాలింపు, తమకు చిక్కిన వస్తువులపై పరిశోధనలు సాగించే దిశగా ఈ సమాలోచన సాగినట్టు తెలిసింది. ఇప్పటి వరకు సాగిన గాలింపులో 54 వస్తువులు బయట పడ్డట్టు, అయితే, ఇవి ఆ విమాన శకలాలు అన్నది నిర్ధారణ కాకున్నా, అందుకు తగ్గ పరిశోధన వేగవంతం చేయాలని నిర్ణయించారు. అలాగే, మలివిడతగా గాలింపు సాగించాలా, ఇక ఫుల్ స్టాప్ పెట్టాలా..? అన్న కోణంలోనూ ఈ సమాలోచనలో చర్చ సాగినట్టు సమాచారం. మానవ రహిత పరిశోధనా పరికరాల్ని సముద్ర గర్భంలో 3.5 కి.మీ దూరం మేరకు పంపించి, చివరి ప్రయత్నం చేపట్టే దిశగా ఆ సమాలోచన సాగినట్టుంది. ఇందుకు తగ్గ వివరాలను అధికార వర్గాలు బహిర్గతం చేయని దృష్ట్యా, మళ్లీ ఆపరేషన్ తలాష్ సాగేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. -
ఆ విమానంలో ఎవరూ బతికే చాన్స్ లేదు!
చెన్నై: బంగాళాఖాతంలో అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో ప్రయాణిస్తున్నవారు ఎవరూ బతికే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో తెలిపింది. 29మంది ప్రయాణిస్తున్న భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఈ విమానం గురించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడం ఇదే తొలిసారి. గత నెల 22న అదృశ్యమైన ఈ విమానం జాడ గురించి ఇప్పటికీ చిన్నపాటి ఆధారంకానీ, ఆచూకీ కానీ తెలియలేదు. ఈ విషయమై ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ సహాయమంత్రి రామ్ రావు భామ్రే సమాధానమిస్తూ.. విమానంలో ప్రయాణిస్తున్న వారెవరూ బతికే అవకాశం లేదని తెలిపారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే సభ్యుడు ఎం తంబిదురై అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానం ఇచ్చారు. ఏఎన్-32 విమానం ఆచూకీ దొరికేవరకు గాలింపు చర్యలను మానుకోవద్దని, అది దుర్ఘటనకు గురైన ప్రదేశాన్ని గుర్తించాలని తంబిదురై కేంద్రాన్ని కోరారు. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు వైమానిక దళానికి చెందిన వివిధ యుద్ధవిమానాలతోపాటు హెలికాప్టర్లతోనూ గాలింపు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. ఈ విమానం ఆచూకీని కనిపెట్టేందుకు ఇప్పటికే పరిశోధక నౌకలు రంగంలోకి దిగి ఐదు రోజులు అవుతున్న సంగతి తెలిసిందే. చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్‌లోని పోర్ట్‌బ్లెయిర్‌కు బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం బంగాళాఖాతం గగనతలంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతై ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గ చిన్న పాటి ఆధారంగానీ, సమాచారంగానీ లభించడం లేదు. రోజులు గడుస్తున్న కొద్ది ఇందులో ఉన్న 29 మంది బతికి బయటపడే అవకాశాలు లేవనే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా కేంద్రం కూడా ఇదేవిషయాన్ని వెల్లడించింది. చెన్నైకు 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఆ విమానం కుప్పకూలి ఉండొచ్చన్న సంకేతాలు మాత్రం ఉన్నాయి. ఈ సంకేతాలున్న ప్రదేశంలో మూడు నుంచి ఐదు వేల మీటర్ల లోతులో విమానం కూరుకుపోయి ఉండొచ్చన్న భావనతో ఆ పరిసరాల్లో 20 నౌకలు,18 విమానాలు, హెలిక్టాప్టర్లు గాలింపును తీవ్రంగానే కొనసాగిస్తున్నా ఫలితం శూన్యం. ఓ వైపు అమెరికా సాయంతో శాటిలైట్ ద్వారా అన్వేషణకు తగ్గ ప్రక్రియ సాగుతుంటే, మరో వైపు ఆదివారం భారత్‌కు చెందిన పరిశోధక నౌక లు రంగంలోకి దిగాయి. -
ఇంకా గాలింపే!
కానరాని ఆచూకీ గడుస్తున్న రోజులు పరిశోధక నౌకలతో గాలింపు ముమ్మరం చెన్నై: అదృశ్యమైన ఏయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం ఆచూకీ కానరావడం లేదు. రోజులు గడుస్తున్నాయేగానీ, చిన్నపాటి ఆధారం లభించకపోవడంతో గాలింపులో ఉన్న బృందాలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశోధక నౌకలు రంగంలోకి దిగి ఐదు రోజులు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదు. చెన్నై తాంబరం ఎయిర్ బేస్ నుంచి అండమాన్‌లోని పోర్ట్‌బ్లెయిర్‌కు బయలు దేరిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం బంగాళాఖాతంపై అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంలో గల్లంతై ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గ చిన్న పాటి ఆధారంగానీ, సమాచారంగానీ లభించడం లేదు. రోజులు గడుస్తున్న కొద్ది అందులో ఉన్న 29 మంది ఆచూకీ పై ఆశల్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విమానం గల్లంతై మూడు వారాలు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. చెన్నైకు 150 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఆ విమానం కుప్పకూలి ఉండొచ్చన్న సంకేతాలు మాత్రం ఉన్నాయి. ఈ సంకేతాలున్న ప్రదేశంలో మూడు నుంచి ఐదు వేల మీటర్ల లోతులో విమానం కూరుకుపోయి ఉండొచ్చన్న భావనతో ఆ పరిసరాల్లో 20 నౌకలు,18 విమానాలు, హెలిక్టాప్టర్లు గాలింపును తీవ్రంగానే కొనసాగిస్తున్నా ఫలితం శూన్యం. ఓ వైపు అమెరికా సాయంతో శాటిలైట్ ద్వారా అన్వేషణకు తగ్గ ప్రక్రియ సాగుతుంటే, మరో వైపు ఆదివారం భారత్‌కు చెందిన పరిశోధక నౌక లు రంగంలోకి దిగాయి. జాతీయ సముద్ర తీర పరిశోధనా విభాగానికి చెందిన సాగర్ నిధి, భారత భౌగోళిక పరిశోధనా సంస్థకు చెందిన సముద్ర రత్నాకర్ పరిశోధక నౌకలు రంగలోకి దిగడంతో ఏదేని ఆచూకీ లభిస్తుందన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, ఈ నౌకలు పరిశోధనలు చేపట్టి ఐదు రోజులు అవుతున్నా, ఇంత వరకు ఎలాంటి చిన్న ఆధారం కూడా కన్పించనట్టు సంకేతాలు వచ్చాయి. సాగర్ నిధి, రత్నాకర్ నౌకల్లో ఉన్న అన్ని టెక్నాలజీలను ఉపయోగించి తీవ్రంగా పరిశోధనలు రేయింబవళ్లు సాగుతున్నా, ఆ విమానం ఆచూకీ మాత్రం కాన రాలేదు. సముద్రంలో గల్లంతై ఉండొచ్చని భావిస్తున్న ప్రదేశంలో 20 నాటికల్ మైళ్ల దూరం సాగర్ నిధి, మిగిలిన నాటికన్ మైళ్ల దూరంలో సముద్ర రత్నాకర్ తీవ్రంగా పరిశోధనలతో దూసుకు వెళ్తున్నా, చిన్నపాటి ఆధారం అన్వేషణలో కానరాక పోవడంతో అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ అందులో ఉన్న 29 మంది కుటుంబాల్లో ఆందోళన రెట్టింపు అవుతోంది. -
ఆ విమానంలో ఏఎల్టీ కూడా లేదు!
ముందుకు సాగని ఏఎన్-32 గాలింపు సాక్షి ప్రతినిధి, చెన్నై: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం ఇటీవల గల్లంతవడం, అందులోని పలు లోపాలు బయటపడటం తెలిసిందే. అయితే విమానాన్ని గుర్తించడానికి ఉపయోగించే పరికరం(ఏఎల్టీ) కూడా లేదన్న విషయం మంగళవారం బయటపడింది. సముద్రంపై ప్రయాణించే, సైనిక విమానాలకు ఏఎల్టీని అమరుస్తారు. నీటి అడుగుభాగంలో విమానం ఉన్నట్లయితే ఈ పరికరం నుంచి సిగ్నల్స్ వెలువడి విమానాన్ని గుర్తించవచ్చు. వీటిని ప్రస్తుతానికి సీ130జే, సీ17 విమానాల్లోనే వినియోగిస్తున్నారు. కానీ వీటిని అన్ని రకాల విమానాలకు ఉపయోగించడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో కేంద్ర రక్షణ శాఖ కొని ఉంచింది. ఏఎన్ 32 రకం విమానాల్లో దేనికీ ఈ పరికరాన్ని అమర్చలేదని తెలుస్తోంది. ఈ పరికరమే ఉన్నట్లయితే ఈ పాటికి విమానాన్ని గుర్తించి ఉండే వారిమని గాలింపు చర్యల్లో పాల్గొంటున్న ఓ అధికారి తెలిపారు. గల్లంతయిన విమానం చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్‌కు 29 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ విమానానికి ఏడేళ్ల క్రితమే కాలం చెల్లింది. అలాగే గల్లంతవడానికి వారం రోజుల ముందే 3 సార్లు మరమ్మతులకు గురైంది.