Top Stories
ప్రధాన వార్తలు
కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గం: వైఎస్ జగన్
తాడేపల్లి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి తొక్కిసలాట(tirupati stampede) జరిగి ఆరుగురు మృతి చెందితే ఆ ఘటనకు సంబంధించిన బాధ్యుల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan mohan reddy) ధ్వజమెత్తారు ఈ విషయంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్. మొత్తం పోలీసుల బలగం అంతా చంద్రబాబు చుట్టూనే..‘‘చంద్రబాబుగారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం మొదలు, టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాలమీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా, స్థానిక కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో, విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనేకదా అర్థం? తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? తూతూమంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్‌ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్‌ను డిస్మిస్ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా?’ అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం తీరు ఇంకా హాస్యాస్పదంప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబుగారు దాన్నికూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు డిప్యూటీ సీఎంగారు క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగారేమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎంగారేమో, లేదు… క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట(tirupati stampede Incident) జరిగి, 6 గురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీ లేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు. చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్లందరినీ వెంటనే డిస్మిస్ చేసి, వీరిపై కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని హెచ్చరించారు వైఎస్ జగన్.ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, 6గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో @ncbn గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. చంద్రబాబుగారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2025
మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/అలంపూర్: నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం (74) అనా రోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు.1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి సంతాపంమందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రంలో మందా జగన్నాథం పోషించిన పాత్ర మరువరానిదని అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలం ఎంపీగా ప్రజలకు సేవలందించిన జగన్నాథం మృతి బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు.
'నా భార్యకు నన్ను చూస్తూ ఉండటం ఇష్టం'
ప్రస్తుతం దేశం మొత్తం మీద పనిగంటలపై చర్చ జరుగుతోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని చెబితే.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణ్యన్ అన్నారు. ఈ వ్యాఖ్యపై పలువురు పారిశ్రామిక వేత్తలు స్పందించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనావల్లా' (Adar Poonawalla) కూడా చేరారు.ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నది ముఖ్యం. 10 గంటలు పని చేస్తే ప్రపంచాన్నే మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మాటలతో.. అదార్ పూనావల్లా ఏకీభవించారు. నా భార్య కూడా నేను అద్భుతంగా ఉన్నాను అని అనుకుంటుంది. ఆమె ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటానికి ఇష్టపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో, పని గంటల పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి.. ఇతర కార్పొరేట్ నాయకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అయితే నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని గంటలపై కాకుండా.. పని నాణ్యతపై దృష్టి పెట్టాలి. కాబట్టి 70 గంటలు & 90 గంటలు కాదు. నాణ్యమైన పని 10 గంటలు చేస్తే చాలు. ప్రపంచాన్నే మార్చేయొచ్చని ఆయన అన్నారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాఇంట్లో కూర్చుని.. భార్యను ఎంత సేపు చూస్తారు. ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండని చెప్పిన ఎస్ఎన్ సుబ్రమణ్యన్ (Subrahmanyan) వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘నా భార్య ఎంతో మంచిది, ఆమెను తదేకంగా చూడటం నాకు చాలా ఇష్టం’ అని అన్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలపై కేవలం పారిశ్రామిక దిగ్గజాలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.Yes @anandmahindra, even my wife @NPoonawalla thinks i am wonderful, she loves staring at me on Sundays. Quality of work over quantity always. #worklifebalance pic.twitter.com/5Lr1IjOB6r— Adar Poonawalla (@adarpoonawalla) January 12, 2025
పేస్ బౌలర్లని తీర్చి దిద్దడంపై బోర్డు ప్రణాళిక ఏమైంది?
ఇంగ్లాండ్‌తో సొంతగడ్డ పై జరగనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కి వెటరన్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. అయితే ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లోని చివరి మ్యాచ్ లో గాయమైన కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోయిన మహమ్మద్ సిరాజ్ కి జట్టులో చోటు దొరకలేదు. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సెలెక్టర్లు అతనికి విశ్రాంతి ఇచ్చారని భావించాలి.షమీ చివరిసారిగా నవంబర్ 2023లో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఆడాడు. ఈ టోర్నమెంట్ తరవాత చీలమండ శస్త్రచికిత్స, మోకాలి సమస్యల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో బుమ్రా విజృభించి ఏకంగా 32 వికెట్లు పడగొట్టగా, షమీ వంటి ఏంటో అనుభవజ్ఞుడైన బౌలర్ నుంచి అతనికి సహకారం లభించినట్లయితే భారత్ ప్రదర్శన భిన్నంగా ఉండేదండంలో సందేహం లేదు.అయితే ఆటగాళ్ల గాయాలకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుని కానీ మరెవరినో కానీ తప్పుబట్టడం సరికాదు. యువ బౌలర్లను తీర్చిదిద్దడం, వారికి సరైన సయమంలో విశ్రాంతి ఇవ్వడం బిసిసిఐ చేతిలో పనే. కానీ ఈ విషయం లో మాత్రం బిసిసిఐ విఫలమైంది. ఇటీవల కాలంలో భువనేశ్వర్‌కుమార్,ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ వరసగా భారత్ జట్టు నుంచి తప్పుకున్నారు. షమీ కూడా ఎక్కువ కాలం భారత్ జట్టులో కొనసాగే అవకాశం తక్కువే. అయితే షమీ తరువాత ఎవరు అంటే బోర్డు వద్ద సమాధానం లేదు. ఈ విషయం ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో తేలిపోయింది.తాజాగా మరో యువ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం బంగ్లాదేశ్‌పై టి20 సిరీస్ లో అరంగేట్రం చేసిన మయాంక్, దేశంలో అత్యంత వేగవంతంగా పేస్ బౌలింగ్ ఆశావహుల్లో ఒకరిగా పేరు గడించాడు. 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగల అతని సామర్థ్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బాగా ఉపయోగపడిండి. " మయాంక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌కు అతని ఫిట్ నెస్ కష్టమే" అని బోర్డు వర్గాలు తెలిపాయి.అన్ని ఫార్మాట్లలో భారత పేస్ బౌలింగ్ యూనిట్లో అంతర్భాగంగా ఉండే విధంగా మయాంక్ వంటి బౌలర్లని బోర్డు ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయాల్సిన అవసరం ఉందనేది ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో వెల్లడయింది. కానీ బోర్డు ఇప్పటికయినా తగిన రీతిలో ముందుచూపుతో వ్యవహరిస్తుందని ఆశిద్ద్దాం.
ఇదేనా రైతురాజ్యం: హరీష్‌రావు
సిద్దిపేట జిల్లా: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. రైతులకు అది చేస్తా.. ఇది చేస్తాం అని రైతులను ముంచాడన్నారు. ఈరోజు(ఆదివారం) సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘ తెలంగాణ సీఎం రేవంత్.. రైతులను ముంచుండు, మోసం చేసిండు, ఇదే విషయంలో కాంగ్రెస్ నాయకుల్ని గ్రామాల్లో నిలదీస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన హామీని కూడా నిలబెట్టుకోలేదు.. చర్చకు సిద్ధం.ఎకరాకు రూ. 9 వేలు ఎగబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరానికి రూ. 15 వేలు ఇచ్చే వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి. రేవంత్‌రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఇస్తానని చెప్పి.. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు.గొంతు మూగబోయింది. ఇదేనా రైతు రాజ్యం.. కౌలు రైతు రైతుబంధు ఎగబెట్టినందకుకు పాలాభిషేకం చేయాలా?, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎన్నికలు అప్పుడు మాటలు కోటలు దాటాయి.. ఇప్పుడు కోతలు పెడుతున్నారు. ఒక ఎకరం భూమి ఉన్నా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి రూ. 12వేలు ఇవ్వాలి. ఐదు గంటలు ఉంటే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం వర్తించక నష్టపోతున్నారు. ఇదేమీ పథకం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఇలా చేస్తాడా, మట్టి పనికి పోయే ఒక కోటి మందికి వ్యవసాయ కూలీ పథకం ఇవ్వాలి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రేవంత్‌రెడ్డి రుణమాఫీ అయిపోయిందని సంకలు గుద్దుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. కనపడ్డ దేవుళ్ల మీద ఒట్టు పెడితివి. లక్ష రుణమాఫీ ఉన్న రైతులకు కూడా కాలేదు. నారాయణ ఖేడ్ రైతు భీముని అంజయ్య రుణమాఫీ కాలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డిని అడిగితే గూండాలను నా ఇంటికి మీదకి పంపుతాడు. పంటల బీమా పథకం అటకెక్కింది. రూ. 15 వేల కోట్లు ఇంకా రుణమాఫీ పెండింగ్‌లో ఉంది. ఏ ముఖం పెట్టుకుని పాలాభిషేకం చేయమంటారు’ అని ప్రశ్నించారు హరీష్.అందుకే ఈ దాడులు..అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. అన్ని రంగాల్లో ప్రజలు దృష్టి మరల్చడానికి నా కార్యాలయం మీద, కేటీఆర్, అల్లు అర్జున్ మీద దాడులు చేస్తోంది. రేవంత్‌రెడ్డి హింస రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. శాంతి భద్రతల సమస్యను రేవంత్‌రెడ్డి సృష్టిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను రేవంత్ సృష్టిస్తున్నారు’ అని విమర్శించారు.
ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది.జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.
మ్యాక్స్‌వెల్ ఊచకోత.. సిక్సర్ల సునామీ
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (45/4) ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్.. 52 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మ్యాక్సీ.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ నుంచి గేర్ మార్చాడు. ఆడమ్ జంపా వేసిన 16వ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన మ్యాక్స్‌వెల్.. కేన్ రిచర్డ్సన్ వేసిన ఆతర్వాతి ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. ఈ ఓవర్లో అతను బౌండరీ, రెండు భారీ సిక్సర్లు బాదాడు. GLENN MAXWELL HITS 122 METER SIX IN BBL. 🤯- Glenn Maxwell, The Big Show..!!! 🔥pic.twitter.com/zcwV3b28Hd— Tanuj Singh (@ImTanujSingh) January 12, 2025ఈ ఓవర్లోని తొలి సిక్సర్ (రెండో బంతి) బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే అతి భారీ సిక్సర్‌గా రికార్డైంది. ఈ సిక్సర్ 122 మీటర్ల దూరం వెళ్లింది. మ్యాకీకి ముందు బీబీఎల్‌లో భారీ సిక్సర్ రికార్డు సహచరుడు హిల్టన్ కార్ట్‌రైట్ పేరిట ఉండింది. ఇదే సీజన్లో కార్ట్‌రైట్ 121 మీటర్ల సిక్సర్ బాదాడు.అనంతరం సదర్‌ల్యాండ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో అతను మూడు భారీ సిక్సర్లు సహా ఓ బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో మ్యాక్సీ వరుసగా తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. సెంచరీకి 10 పరుగుల దూరంలో ఉండగా మ్యాక్సీ 20వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. కేన్ రిచర్డ్సన్ మ్యాక్సీని క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాక్స్‌వెల్ పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 165 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌కు ఎవరి సహకారం లభించనప్పటికీ ఒక్కడే ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఖాతా కూడా తెరవని ఉసామా మిర్‌తో మ్యాక్స్‌వెల్ ఎనిమిదో వికెట్‌కు 81 పరుగులు జోడించడం విశేషం. ఈ 81 పరుగులను మ్యాక్స్‌వెల్ ఒక్కడే చేశాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బెన్ డకెట్ (21), బ్యూ వెబ్‌స్టర్ (15) కొద్దిసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. 32 పరుగుల వద్ద బెన్ డకెట్, థామస్ రోజర్స (0) ఔటయ్యారు. అనంతరం 45 పరుగుల వద్ద వెబ్‌స్టర్, 55 పరుగుల వద్ద సోయినిస్ (18), 63 పరుగుల వద్ద కార్ట్‌రైట్ (6), 75 పరుగుల వద్ద జోయల్ పారిస్ (3) పెవిలియన్‌కు చేరారు. 11 ఓవర్లలో మెల్బోర్న్ స్టార్స్ ఏడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. ఈ దశలో మ్యాక్సీ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రెనెగేడ్స్ బౌలర్లలో టామ్ రోజర్స్, ఫెర్గస్ ఓనీల్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జేకబ్ బేతెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.NOVAK DJOKOVIC AT THE BBL. 🐐- The reaction after Stoinis was out. 😄pic.twitter.com/eruRdky7yL— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన జకోవిచ్ఈ మ్యాచ్ చూసేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ వచ్చాడు. జకో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో జకో మెల్బోర్న్ స్టార్స్‌కు మద్దతుగా నిలిచాడు. స్టార్స్ కెప్టెన్ స్టోయినిస్ ఔట్ కాగానే జకో నిరాశ చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.తడబడుతున్న రెనెగేడ్స్166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రెనెగేడ్స్ 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. మార్క్ స్టీకిటీ (3-0-14-3) అద్భుతంగా బౌలింగ్ చేసి రెనెగేడ్స్‌ను దెబ్బకొట్టాడు. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో జోష్ బ్రౌన్ 4, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 19, జేకబ్ బేతెల్ 1, విల్ సదర్‌ల్యాండ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. టిమ్ సీఫర్ట్ 26, హ్యారీ డిక్సన్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రెనెగేడ్స్ గెలవాలంటే 42 బంతుల్లో 88 పరుగులు చేయాలి.
హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఈ-కార్ రేస్‌లో కేటీఆర్‌కు తాను క్లీన్చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్‌కు ఇమేజ్ పెరిగిందని మాత్రమే చెప్పానని.. విచారణ జరిగేటప్పుడు కామెంట్ చేయడం సరికాదన్నారు. క్విడ్‌ప్రోకో జరిగిందా లేదా తేల్చాలి. హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెబుతున్నాను. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. తాను ఫైటర్‌ను.. ఉప ఎన్నికకు భయపడేది లేదని దానం అన్నారు.‘‘నేను ఏది మాట్లాడినా కూడా సంచలనమే అవుతుంది. మూసీపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు. వారి ఇళ్లల్లోనే చేసిన జొన్న రొట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబయికి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.’’ అని దానం నాగేందర్ చెప్పారు.‘‘పదేళ్ల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎంకి పాలాభిషేకం చేయాలి’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!
ఈ సంక్రాంతి.. పచ్చ నేతలకే పండగ.. ప్రజలకు కాదు: కన్నబాబు
సాక్షి, కాకినాడ: గత సంక్రాంతికి ఈ ఏడాది పండగకు చాలా వ్యత్యాసం ఉందని.. గత ఏడాది సంక్రాంతికి ప్రతి కుటుంబాన్ని వైఎస్ జగన్ చేయి పట్టుకుని నడిపించారని.. ఈ సంక్రాంతికి చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పేదల పండగ కాదు.. పచ్చ నేతల పండగ అంటూ దుయ్యబట్టారు. పేదల జేబుల్లో డబ్బుల్లేవు.. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. కూటమి నేతలు తరిమేసినవారు పండక్కి రావడానికి భయపడుతున్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం లేదు’’ అని కన్నబాబు చెప్పారు. ఈ సంక్రాంతికి చంద్రన్న కానుక పథకం ఏమైంది?. కూటమి నేతలకే పండగ.. ప్రజలకు కాదు. ఇష్యూ వస్తే డెవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌ను తిట్టడమే కూటమి నేతలు పనిగా పెట్టుకున్నారు. తిరుపతి తొక్కిసలాట చూసి కూటమి నేతలు సిగ్గుపడాలి. తిరుపతి తొక్కిసలాట కూటమి ప్రభుత్వ వైఫల్యం కాదా?. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమాపణ అన్నట్లు బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాటపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. తిరుమల ప్రసాదంపై కూడా దుష్ప్రచారం చేశారు. వెంకన్న స్వామిని రాజకీయాల్లోకి లాగితే ఫలితాలు ఇలానే ఉంటాయి’’ అని కన్నబాబు వ్యాఖ్యానించారు.‘‘భక్తుల ఫోన్ నంబర్లతో కూటమి ప్రభుత్వానికి ఏం పని?. చంద్రబాబు మనుషులు చేసే తప్పులకు భక్తులు బలైపోతున్నారు. టీటీడీ సమావేశంలో ప్రైవేట్ వ్యక్తులకు ఏం పని?. సనాతన ధర్మాన్ని కాపాడే పెద్దలు ప్రైవేట్ వ్యక్తులపై ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..!
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
టైటిల్: డాకు మహారాజ్నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: బాబీ కొల్లిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్విడుదల తేది: జనవరి 12, 2025కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు. రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్ ఫార్మెట్లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్ విలన్ని సెకండాఫ్ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది. చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు. యాక్షన్ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొత్తగా ఉంటుంది. బల్వంత్ ఠాకూర్‌గా బాబీ డియోల్ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్ ఖేడ్కర్, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్రజల కొనుగోలు శక్తి ఢమాల్ !
ఎలాగైనా వెళ్లాల్సిందే
భవిత ఏఐతుందో..?
ఘుమఘుమల సంక్రాంతి
రోగ్యం... ధ్యాత్మికం
కూసుమంచిలో ‘ఇందిరమ్మ’ నమూనా ఇల్లు
భూభారతిలో నమోదైన భూములకే భరోసా
గ్రీన్ హైడ్రోజన్‌కు రెడ్ కార్పెట్!
అయ్యవారికి దండం పెట్టు..
దక్షిణ వలయం.. అయోమయం
సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు
Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ
నెలకు కనీసం రూ.7,500 పెన్షన్ ఇవ్వండి
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
ర్యాంకు ఆధారంగా ఇందిరమ్మ ఇల్లు
TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!
గతంలో లడ్డూపై చేసిన వ్యాఖ్యలకా? నిన్న జరిగిన సంఘటనకా చెప్పేదీ!
ప్రజల కొనుగోలు శక్తి ఢమాల్ !
ఎలాగైనా వెళ్లాల్సిందే
భవిత ఏఐతుందో..?
ఘుమఘుమల సంక్రాంతి
రోగ్యం... ధ్యాత్మికం
కూసుమంచిలో ‘ఇందిరమ్మ’ నమూనా ఇల్లు
భూభారతిలో నమోదైన భూములకే భరోసా
గ్రీన్ హైడ్రోజన్‌కు రెడ్ కార్పెట్!
అయ్యవారికి దండం పెట్టు..
దక్షిణ వలయం.. అయోమయం
సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు
Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ
నెలకు కనీసం రూ.7,500 పెన్షన్ ఇవ్వండి
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
ర్యాంకు ఆధారంగా ఇందిరమ్మ ఇల్లు
TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
Ind vs Eng: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!
గతంలో లడ్డూపై చేసిన వ్యాఖ్యలకా? నిన్న జరిగిన సంఘటనకా చెప్పేదీ!
సినిమా
'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని ప్రముఖ బుల్లితెర నటి రూపల్ త్యాగి తెలిపింది. చదువు కోసం వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంది. ఇటీవల దాదాపు నెల రోజులు పాటు అక్కడే ఉన్నానని వెల్లడించింది. తాను స్వదేశానికి విమానంలో బయలుదేరినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగలు చూశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఇంత స్థాయిలో ఉంటుందని ఊహింలేదన్నారు. తాను చూసిన ప్రదేశాలు బూడిదగా మారడం చూసి హృదయ బద్దలైందని విచారం వ్యక్తం చేసింది.రూపల్ త్యాగి మాట్లాడుతూ.. "పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ అగ్ని ప్రమాదాలు సాధారణమే. కానీ అది అంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. నేను విమానం నుంచి పొగను చూశా. అప్పుడే ఇక్కడ ప్రమాదాలు మామూలే అని అనుకున్నా. కానీ నేను ముంబయిలో దిగే సమయానికి కార్చిచ్చు వల్ల ఎంత ప్రమాదం జరిగిందో అప్పుడే తెలిసింది. నేను చూసిన ప్రదేశాలు ప్రతిదీ కాలిపోయాయని నాకు తెలిసింది. దృశ్యాలను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించింది. తాను ఇంటికి తిరిగి వచ్చే ముందు అదే రోడ్డులో కారులో ప్రయాణించా. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. అదృష్టవశాత్తూ నా స్నేహితులందరూ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. నేను వారి గురించి ఆందోళన చెందుతున్నా. సమయానికి బయలుదేరి ప్రాణాలు దక్కించుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ సంక్షోభ సమయంలో నా స్నేహితులతో లేకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రకృతి కోపాన్ని చూసి చలించిపోయా' అని అన్నారు.ఇలాంటి సంఘటనలు మన జీవితాలు ఊహించని విధంగా మార్చేస్తాయని రూపల్ త్యాగి అన్నారు. ఒక్క రోజులోనే నగరం కాలిపోతుందని ఎవరూ ఊహించరు.. ఇది నమ్మశక్యం కాని ఘటన అని చెప్పింది. మన జీవితంలో ప్రతి రోజు పూర్తిగా అస్వాదించాలనేన ఆలోచన మంచిదే.. ఎందుకంటే మరుసటి రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన ప్రజలు త్వరలోనే కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.కాగా.. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు వల్ల దాదాపు వేలమంది నిరాశ్రయులయ్యారు. అడవిలో ఏర్పడిన మంటలు గాలి ధాటికి విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 12 వేలకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వచ్చే వారం ప్రారంభంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా.. రూపల్ త్యాగి బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. బాలీవుడ్లో కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్, రంజు కీ బేటియాన్, హమారీ బేటియాన్ కా వివాహ్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది.
'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం అజిత్ కుమార్(ajith Kumar) విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. కానీ ఊహించని కారణాలతో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు.అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా అజిత్ ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. మోటార్‌స్పోర్ట్స్ పట్ల తనకున్న ఇష్టాన్ని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్‌ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. ప్రస్తుతం దుబాయ్‌లో జరగనున్న 24హెచ్ కారు రేసింగ్‌లో అజిత్ పాల్గొంటున్నారు.ఈ వీడియోలో అజిత్ మాట్లాడుతూ.. 'నేను చాలా సంతోషంగా ఉన్నా. మోటార్ స్పోర్ట్స్ నా జీవితాంతం ఇష్టమైంది. చాలా మంది అభిమానులు ఇక్కడకు వచ్చారు. మీరందరూ సంతోషం, ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నా. ముందు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని వృథా చేయకండి. బాగా చదవండి. కష్టపడి పనిచేయండి. జీవితంలో మీకు నచ్చినది చేసినప్పుడు విజయం సాధిస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. అంతే కానీ, విజయం సాధించకలేకపోయామని అక్కడే ఆగిపోవద్దు. ఈ ప్రపంచంలో పోటీ చాలా ముఖ్యం. ఎప్పటికైనా మీ సంకల్పం, అంకితభావాన్ని వదులుకోవద్దు. మీ అందరినీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా' అంటూ రిలీజ్ చేశారు.కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్‌లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్‌తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయి' అని అన్నారు.కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్‌లో పోటీపడుతోంది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్‌లో పాల్గొంటానని అజిత్ తెలిపారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. Ak. My fans Their commitments. pic.twitter.com/5fW17Gghgu— Suresh Chandra (@SureshChandraa) January 11, 2025
బాలీవుడ్ పట్టించుకోలేదు.. మరి టాలీవుడ్?
యాడ్ షూట్‌తో మొదలై హాలీవుడ్ స్థాయికి చేరిన తార బనితా సంధూ. ప్లాట్‌ఫామ్ ఏదైనా పర్ఫామెన్స్ ప్రాధాన్యంగా వరుస సినీ, సిరీస్‌లతో దూసుకెళ్తున్న ఆమె గురించి కొన్ని విషయాలు.. బనితాది బ్రిటన్‌లో స్థిరపడిన సిక్కు కుటుంబం. పుట్టింది, పెరిగింది వేల్స్లో. లండన్, కింగ్స్ కాలేజ్‌లో ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది.తొలిసారి ‘అక్టోబర్’ హిందీ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. అది ఆమెకెలాంటి గుర్తింపునివ్వలేదు. తర్వాత చేసిన ‘సర్దార్ ఉధమ్’ కూడా అంతే.బాలీవుడ్ ఇవ్వలేని గుర్తింపు తమిళ సినిమా ‘ఆదిత్య వర్మ’ ఇచ్చింది. దాంతో ఏకంగా ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘పండోరా’లో నటించే అవకాశాన్ని అందుకుంది. తర్వాత ‘ఎటర్నల్ బ్యూటీ’ అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించింది.‘బిడ్జర్టన్’తో వెబ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. అది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగు తెరకూ పరిచయం కానుంది.. ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ2’తో.విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం. అందుకే, స్క్రిప్ట్ కంటే ముందు నా పాత్రపైనే ఎక్కువ దృష్టి పెడతా! – బనితా సంధూచదవండి: నాంపల్లి కోర్టు వార్నింగ్.. దగ్గుబాటి హీరోలపై కేసు నమోదు
అనారోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్
హీరో విశాల్ (Vishal) ప్రధాన పాత్రలో నటించిన మదగజరాజ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షూటింగ్ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత ఈ చిత్రం రిలీజ్‌కు నోచుకోవడం గమనార్హం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశాల్ బక్కచిక్కిపోయి వణుకుతూ కనిపించాడు. మైక్ పట్టుకున్నప్పుడు అతడి చేతులు వణకడంతో పాటు మాట కూడా తడబడుతూ వచ్చింది. సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులు విశాల్‌కు ఏమైందని ఆందోళన చెందారు.వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విశాల్ఈ క్రమంలో విశాల్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం అతడు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ విశాల్ సినిమా ఈవెంట్‌కు రావడాన్ని పలువురూ అభినందిస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఆయన ఆరోగ్యంపై దృష్టి సారించాలని, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేశారు.ఆరు నెలలకోసారి దూరం?తాజాగా విశాల్ కోలుకున్నట్లు తెలుస్తోంది. మదగజరాజ సినిమా (Madha Gaja Raja Movie) ప్రీమియర్ షోకు హాజరైన విశాల్.. తన హెల్త్ అప్డేట్ ఇచ్చాడు. మా నాన్నగారి సంకల్పం వల్లే నేను ధృడంగా ఉండగలుగుతున్నాను. ఆయన ఇచ్చిన శక్తి వల్లే నా జీవితంలో ఎదురైన అడ్డంకులను దాటగలుగుతున్నాను. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మూడు, ఆరు నెలలకోసారి సినిమాలకు దూరంగా ఉంటున్నానని, సరిగా పని చేయట్లేదని అంటున్నారు. ఎన్ని మాటలన్నా నేను మరింత శక్తి కూడదీసుకుని మీ ముందుకొస్తాను.(చదవండి: Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)ఇప్పుడు బానే ఉన్నానునేను అనారోగ్యంగా ఉండటం చూసి అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు నేను బాగున్నాను. చూడండి, నా చేతులు కూడా వణకడం లేదు. నా ఆరోగ్యం బాగుంది. మీరు చూపించిన ప్రేమకు తుదిశ్వాస వరకు రుణపడి ఉంటాను. మీ అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చాడు.ఆ సినిమాతో హీరోగా క్రేజ్కాగా విశాల్.. చెల్లమే (Chellamae Movie) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. సండ కోడి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇంది తెలుగులో పందెం కోడిగా విడుదలవగా ఇక్కడ కూడా హిట్‌గా నిలిచింది. తామిరభరణి, మలైకొట్టాయి, సత్యం, తోరణై (పిస్తా), అవన్ ఇవన్, వేడి, పాట్టతు యానై, పాండియ నాడు, తుప్పరివాలన్, ఎనిమీ, సండకోడి 2, మార్క్ ఆంటోని వంటి పలు చిత్రాలతో అలరించాడు.ఎయిట్ ప్యాక్‌తో విశాల్మార్క్ ఆంటోని మూవీలో అదరదా పాట.. విశాలే ఆలపించాడు. అంతేకాదు మదగజరాజ సినిమాలోని మై డియర్ లవరూ సాంగ్ కూడా అతడే పాడటం విశేషం. ఇందులో విశాల్ ఎయిట్ ప్యాక్స్‌లో కనిపిస్తాడని డైరెక్టర్ సుందర్ తెలిపాడు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో సుందర్ మాట్లాడుతూ.. క్లైమాక్స్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించాలని హీరోకు చెప్పాను. కొన్ని కారణాల వల్ల ఆ క్లైమాక్స్ షూట్ ఆలస్యమైంది. అయినా సరే విశాల్ తన ఎయిట్ ప్యాక్ బాడీని ఏడాదిపాటు మెయింటెన్ చేశాడు అని సుందర్ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటించగా ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. #Vishal Watching #MadhaGajaRaja Special Premiere 💯pic.twitter.com/sb9XNuvrt0— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) January 11, 2025 చదవండి: పుష్ప-2 రీ లోడ్ వర్షన్.. మేకర్స్ బిగ్ అప్డేట్
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్
బెంగళూరులోని ఆలుర్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న అండర్-19 మహిళల వన్డే కప్‌లో 14 ఏళ్ల ముంబై అమ్మాయి ట్రిపుల్ సెంచరీ సాధించింది. మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో ఐరా జాదవ్ 157 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 220.38 స్ట్రయిక్‌రేట్‌తో 346 పరుగులు (నాటౌట్) చేసింది. భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లో అయినా ఇదే అత్యధిక స్కోర్. ఇరా జాదవ్ వైట్ బాల్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయురాలు.మహిళల అండర్-19 లెవెల్లో ఐరా జదావ్‌కు ముందు నలుగురు డబుల్ సెంచరీలు సాధించారు. ప్రస్తుత టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన 224 నాటౌట్, రాఘ్వి బిస్త్ 219 నాటౌట్, జెమీమా రోడ్రిగెజ్ 202 నాటౌట్, సనికా ఛాల్కే 200 పరుగులు చేశారు. ఛాల్కే త్వరలో జరుగనున్న మహిళల అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించనుంది. రాఘ్వి బిస్ట్ విషయానికొస్తే.. ఈ అమ్మాయి ఇటీవలే భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసింది.ఐరా ట్రిపుల్.. ముంబై రికార్డు స్కోర్మ్యాచ్ విషయానికొస్తే.. ఐరా జాదవ్ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కడంతో మేఘాలయాపై ముంబై కనీవినీ ఎరుగని స్కోర్ చేసింది. ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 563 పరుగులు చేసింది. అండర్-19 మహిళల వన్డే కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ముంబై తరఫున ఇదే అత్యధిక స్కోర్. మేఘాలయాతో మ్యాచ్‌లో ఐరాతో పాటు మరో ప్లేయర్ మూడంకెల స్కోర్ చేసింది. హర్లీ గాలా 79 బంతుల్లో 116 పరుగులు సాధించింది.ఐపీఎల్ వేలంలో ఎవరూ పట్టించుకోలేదు..!హిట్టర్‌గా పేరున్న ఐరా జాదవ్‌ను మహిళల ఐపీఎల్-2025 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 10 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో ఐరా మెగా వేలంలో పాల్గొంది.
టీమిండియా బ్యాటర్ల వీరవిహారం.. వన్డేల్లో అత్యధిక స్కోర్
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఐర్లాండ్‌తో ఇవాళ (జనవరి 12) జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్. గతంలో భారత అత్యధిక స్కోర్ 358/2గా ఉండింది. 2017లో ఇదే ఐర్లాండ్‌పై భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. గతేడాది డిసెంబర్లో భారత్ విండీస్‌పై కూడా ఇదే స్కోర్ (358/5) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ జరిగిన రెండో వన్డేలో భారత్ అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. తొలి ముగ్గురు బ్యాటర్లు స్మృతి మంధన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రతిక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, సిక్సర్), హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్, అర్లీన్ కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జీనా డెంప్సే ఓ వికెట్ దక్కించకుంది.వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోర్లు..370/5 ఐర్లాండ్‌పై (2025)358/2 ఐర్లాండ్‌పై (2017)358/5 వెస్టిండీస్‌పై (2024)333/5 ఇంగ్లండ్‌పై (2022)325/3 సౌతాఫ్రికాపై (2024)317/8 వెస్టిండీస్‌పై (2022)314/9 వెస్టిండీస్‌పై (2024)302/3 సౌతాఫ్రికాపై (2018)కాగా, ఐర్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లెవిన్ (92) ఆ జట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసింది. లియా పాల్ (59) అర్ద సెంచరీతో రాణించింది.భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, టిటాస్ సాధు, సయాలీ సత్గరే, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో భారత్ 34.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ప్రతిక రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్) అర్ద సెంచరీతో సత్తా చాటారు. స్మృతి మంధన (41) ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్ ఏమీ మగూర్ 3 వికెట్లు పడగొట్టింది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు
పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా నజ్ముల్ హొస్సేన్ షాంటో నియమితుడయ్యాడు. షాంటో గాయం కారణంగా ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. షాంటో గైర్హాజరీలో విండీస్ పర్యటనలో మెహిది హసన్ మిరాజ్ బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరించాడు. విండీస్‌తో సిరీస్‌ను బంగ్లాదేశ్ 0-3 తేడాతో కోల్పోయింది.షాంటోతో పాటు గాయాల బారిన పడ్డ ముష్ఫికర్ రహీం, తౌహిద్ హృదోయ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఛాంపియన్స్ ట్రోఫీతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆటగాడు లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. విండీస్ పర్యటనలో చెత్త ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 6 పరుగులు) కారణంగా దాస్ జట్టులో చోటు కోల్పోయాడు. దాస్‌పై వేటు వేసినట్లు బంగ్లా చీఫ్ సెలెక్టర్ ఘాజీ అష్రఫ్ హొస్సేన్ తెలిపాడు. లిటన్ దాస్ గైర్హాజరీలో జాకెర్ అలీ బంగ్లా వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపడతాడని అష్రఫ్ అన్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో లిటన్ దాస్‌తో పాటు షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్‌లకు కూడా చోటు దక్కలేదు. షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్ కూడా విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యారు.బంగ్లా జట్టు పేస్ విభాగం యువకులు, సీనియర్లతో (నహీద్ రాణా, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్) సమతూకంగా ఉంది. స్పిన్ విభాగాన్ని లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ లీడ్ చేస్తాడు. రిషద్‌తో పాటు స్పిన్ విభాగంలో మెహిది హసన్, నసుమ్ అహ్మద్ ఉన్నారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే.. నజ్ముల్, ముష్ఫికర్, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్ లాంటి సీనియర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.గత వారం జరిగిన బౌలింగ్ అసెస్మెంట్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన షకీబ్ అల్ హసన్ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. సీనియర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడని తొలుత ప్రచారం జరిగింది. ఇటీవలే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బంగ్లా సెలెక్టర్లు ఇతన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్.. భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. బంగ్లా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న టీమిండియాతో ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు..నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, జాకర్ అలీ అనిక్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, నహిద్ రాణా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
రాయల్స్ ఓపెనర్ విధ్వంసం.. మార్క్రమ్ మెరుపు ఇన్నింగ్స్ వృధా
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) నిన్న (జనవరి 11) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌పై పార్ల్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ 49 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జోర్డన్ హెర్మన్ 10, జాక్ క్రాలే 27, టామ్ ఏబెల్ 20, మార్కో జన్సెన్ 4, ట్రిస్టన్ స్టబ్స్ 28 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో క్వేనా మపాకా, ముజీబ్ ఉర్ రెహ్మాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 18.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ లుహాన్ డ్రే ప్రిటోరియస్ (51 బంతుల్లో 97; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) రాయల్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ జో రూట్ 44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రూట్‌కు కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (17 నాటౌట్) సహకరించాడు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ మార్కో జన్సెన్కు దక్కింది.డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేసిన సూపర్ కింగ్స్నిన్ననే జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌పై జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు జార్జ్ లిండే (48 నాటౌట్), డెలానో పాట్గెటర్ (44 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఎంఐ ఈ మాత్రమే స్కోరైనా చేయగలిగింది. కేప్‌టౌన్ 75 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోగా.. లిండే, పాట్గెటర్ తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జోబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో తబ్రేజ్ షంషి, డేవిడ్ వీస్, సిపామ్లా, ఈవాన్ జోన్స్ తలో వికెట్ పడగొట్టారు.141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌కింగ్స్‌కు వర్షం పలుమార్లు అడ్డుతగిలింది. 11.3 ఓవర్ల అనంతరం మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి సూపర్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే 9, డుప్లెసిస్ 30, లుస్ డు ప్లూయ్ 24 (నాటౌట్), జానీ బెయిర్‌స్టో 14 పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఎంఐ బౌలర్లలో రబాడకు రెండు, ట్రెంట్ బౌల్ట్‌కు ఓ వికెట్ దక్కాయి.
బిజినెస్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఆల్ టైమ్ హై!
హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ (real estate) ఆల్ టైం హై స్థాయికి చేరుకుంది. గతేడాది నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు, ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్ల పెంపు, హైడ్రా దూకుడు ఇవేవీ భాగ్యనగరంలో స్థిరాస్తి రంగాన్ని కదిలించలేకపోయాయి. కొత్త ప్రభుత్వ విధానాలతో కొద్ది కాలం అస్థిరత ఏర్పడినా.. మార్కెట్ తిరిగి శరవేగంగా పుంజుకుంది. దీంతో హైదరాబాద్ రియల్టీలో పూర్వ వైభవం సంతరించుకుంది. నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించగా.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఆర్థికవృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, కొనుగోలుదారుల అభిరుచిలో మార్పుల కారణంగా హైదరాబాద్‌లో గృహ విక్రయాలు పెరిగాయి. గతేడాది నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 36,974 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం సిటీలో అపార్ట్మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.5,974. ఏడాదిలో అపార్ట్మెంట్ల ధరలు 8 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయ్యింది. పశ్చిమ హైదరాబాదే.. హైటెక్ సిటీ, కోకాపేట, రాయదుర్గం, కూకట్పల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాదే కస్టమర్ల చాయిస్‌గా ఉంది. ఎల్బీనగర్, కొంపల్లి ప్రాంతాల్లో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో వరుసగా 11, 10 శాతం మేర రేట్లు పెరిగాయి. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో 8 శాతం, కోకాపేటలో 8 శాతం, మణికొండలో 6, నాచారం, సైనిక్‌పురిలో 5 శాతం మేర ధరలు పెరిగాయి. ప్రస్తుతం నగరంలో అత్యధికంగా చ.అ.ధరలు బంజారాహిల్స్‌లో రూ.14,400–16,020 మధ్య ఉండగా.. జూబ్లీహిల్స్‌లో 13,400–14,034, కోకాపేటలో 10,045–12,500, మణికొండలో రూ.8,500–9,220 మధ్య ధరలు ఉన్నాయి.ఆఫీస్ అ‘ధర’హో.. 2024లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. గతేడాది కొత్తగా 1.03 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ పూర్తి కాగా.. 1.56 కోట్ల చ.అ. స్పేస్ లావాదేవీలు జరిగాయి. కార్యాలయాల స్థలం లీజు, కొనుగోళ్లలో గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్(జీసీసీ) ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గతేడాది జరిగిన ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో జీసీసీ వాటా 49 శాతంగా ఉంది. 51 లక్షల చ.అ.ఆఫీస్ స్పేస్‌ను బహుళ జాతి కంపెనీలు జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. దేశీయ వ్యాపార సంస్థలు 24 లక్షల చ.అ.లు, ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ 18 లక్షల చ.అ.లు, 12 లక్షల చ.అడుగుల స్థలంలో థర్డ్ పార్టీ ఐటీ సంస్థల లావాదేవీలు ఉన్నాయి. నగరంలో ఆఫీస్ స్పేస్ ధర చ.అ.కు సగటున రూ.70గా ఉంది. ఏడాది కాలంలో ధరలు 7 శాతం మేర పెరిగాయి.దేశవ్యాప్తంగా ఇలా.. గతేడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 3,72,936 యూనిట్లు లాచింగ్ కాగా.. 3,50,612 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే లాంచింగ్స్‌లో 6 శాతం, విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇంకా 4,95,839 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 నెలల సమయం పడుతుంది. ఇక, గతేడాది 7.19 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. 5.03 కోట్ల చ.అ. స్థలం కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 8 నగరాల్లో మొత్తం 97.3 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది.
ఇలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కష్టమే!
డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) పొందడం మరింత కష్టతరంగా మారుతోంది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి వచ్చే దరఖాస్తుదారులు సిమ్యులేటర్, 108 కెమెరాల పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ (DTC) డ్రైవింగ్ పరీక్షను మరింత కష్టతరం చేయనుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ మోసాలను అరికట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తుంది.ఇప్పటి వరకు ఇలా..ఇప్పటి వరకు డివిజనల్ రవాణాశాఖ కార్యాలయంలో మాన్యువల్‌గా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేవారు. ఏదో ఫార్మాలిటీగా మాత్రమే ఈ పరీక్ష ఉండేది. దీంతో డ్రైవింగ్ తెలియని వారు కూడా పరీక్ష రాసేవారు. ఇలా డ్రైవింగ్ లైసెన్స్ పొందినవారు వాహనాలు నడుపుతుండటంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.‘జనవరి 16 నుంచి డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. ఇందులో కెమెరాలు, సిమ్యులేటర్లు ఉంటాయి. ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అందులో మోసానికి ఆస్కారం ఉండదు. డ్రైవింగ్ తెలిసిన వారు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉన్నవారు మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణులవుతారు’ అని ప్రాంతీయ రవాణా అధికారి ప్రమోద్ కుమార్ సింగ్ చెబుతున్నారు.ఘజియాబాద్‌లో ప్రతిరోజూ సగటున 225 మంది మాన్యువల్ డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతున్నారు. అత్యాధునిక డ్రైవింగ్ టెస్ట్ కోసం డిపార్ట్మెంట్ డీటీసీని ఏర్పాటు చేసింది. డీటీసీ పనులు పూర్తయ్యాయి. డీటీసీలో 108 కెమెరాలను ఏర్పాటు చేశారు. కేంద్రం నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు.డ్రైవర్ పరీక్ష ఏజెన్సీ పర్యవేక్షణలో జరుగుతుంది. అయితే పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారా లేదా విఫలమయ్యారా అనేది అధికారులు నిర్ణయిస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అభ్యర్థుల ప్రతి కదలికనూ వీడియో రికార్డింగ్ చేస్తారు.దరఖాస్తుదారు డ్రైవింగ్‌తో పాటు ట్రాఫిక్ నియమాలన్నింటినీ తెలుసుకోవాలి. డ్రైవింగ్‌తో పాటు ప్రతి నియమం తెలిస్తేనే పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. దీంతో టెస్టింగ్‌లో మోసాలు పూర్తిగా నిలిచిపోతాయి. 108 కెమెరాల వీడియో రికార్డును కేంద్రంలో భద్రంగా ఉంచుతారు. ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు.సిమ్యులేటర్ అంటే ఏమిటి?సిమ్యులేటర్ అనేది నిజమైన కారుకు ప్రతిరూపం. ఇందులో స్టీరింగ్ వీల్, గేర్లు, బ్రేక్‌లు, పెడల్స్, సూచికలు, స్విచ్‌లు, స్పీడ్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ ద్వారా ఈ సిమ్యులేటర్ నడుస్తుంది. డ్రైవింగ్ ప్రవర్తనను అధ్యయనం చేయడానికి దీనిని ప్రయోగశాలగా కూడా వ్యవహరిస్తారు. దీని ద్వారా ఎకో డ్రైవింగ్ శిక్షణ కూడా అందించవచ్చు.
మొదట కొనేది ఇల్లే.. ఆ తర్వాతే పెళ్లి, ఫ్యూచర్
చదువు పూర్తయ్యిందా.. మంచి ఉద్యోగం, తర్వాత పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ నాటికి ఓ సొంతిల్లు.. మన నాన్నల ఆలోచనలివే కదూ! కానీ, ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులూ మారాయి. చదువు కొనసాగుతుండగానే ఉద్యోగావకాశాలు నడిచొస్తున్నాయి. దీంతో యువత ముందుగా స్థిరమైన నివాసానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి, విదేశీ ప్రయాణాలు, ఫ్యూచర్ ఇతరత్రా వాటి కోసం ప్లానింగ్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోవిరివిగా రుణాల లభ్యత, బహుళ ఆదాయ మార్గాలు, మంచి ప్యాకేజీతో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు యువత ఆసక్తి చూపిస్తోంది. 2018లో గృహ కొనుగోలుదారుల్లో మిలీనియల్స్ (25–35 ఏళ్ల వయస్సు గలవారు) వాటా 28 శాతంగా ఉండగా.. గతేడాదికి 37 శాతానికి పెరిగింది. 2030 నాటికి 60 శాతానికి చేరుతుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది.ఇటీవల కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి. గతంలో రిటైర్డ్, సీనియర్ సిటీజన్స్, సంపన్న వర్గాల గృహ కొనుగోళ్లు, పెట్టుబడులు ఉండేవి. కానీ, కొన్నేళ్లుగా మిలీనియల్స్, జెన్–జెడ్ కస్టమర్ల వాటా పెరిగింది. జీవితం ప్రారంభ దశలోనే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి కారు, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్‌లాగే ప్రాపర్టీకి నేటి యువత ప్రాధాన్యత ఇస్తోంది. అందుబాటులో టెక్నాలజీ.. మ్యాజిక్‌బ్రిక్స్.కామ్, హౌసింగ్.కామ్, 99 ఎకర్స్ వంటి రియల్ ఎస్టేట్ యాప్స్ యువ కొనుగోలుదారుల ప్రాపర్టీ శోధనను మరింత సులువు చేశాయి. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే భౌతికంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడం, పరిసర ప్రాంతాల వాకబు వంటివి పెద్ద ప్రయాస ఉండేది. కానీ, నేటి యువతరానికి అంత టైం లేదు. దుస్తులు, ఫుడ్ ఆర్డర్ చేసినంత సులువుగా ప్రాపర్టీ కొనుగోళ్లు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టు ప్రాపర్టీ సమీక్ష, రేటింగ్ యాప్స్, త్రీడీ వ్యూ, వర్చువల్ టూర్ వంటి సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. గృహ రుణాలకు పోటీ.. యువ గృహ కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం పోటీపడి హోమ్లోన్స్ అందిస్తున్నాయి. రుణాల మంజూరులో వేగం, తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. క్రౌడ్ ఫండింగ్, ప్రాపర్టీ షేరింగ్ వంటి పాక్షిక యాజమాన్య ప్లాట్‌ఫామ్‌లు పరిమిత మూలధనంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో భారీ ముందస్తు చెల్లింపులు అవసరం లేకుండానే నేటి యువ కస్టమర్లు లక్ష కంటే తక్కువ ప్రారంభ పెట్టుబడితో యువ ఇన్వెస్టర్లు ఖరీదైన, విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఐటీ హబ్‌లలో యువ పెట్టుబడులు.. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లలో యువ ఐటీ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ మార్కెట్లో గణనీయమైన ప్రభావం చూపుతున్నారు. రూ.80 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల కొనుగోళ్లలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంది. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్‌తో యువ ఉద్యోగులకు నిత్యం ఆఫీస్‌కు వెళ్లాలనే టెన్షన్ లేదు. దీంతో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు ఉండాలనుకోవడం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటే సిటీకి కాస్త దూరమైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ప్రధాన ప్రాంతంలో కొనుగోలు చేసే ధరతోనే శివార్లలో పెద్ద సైజు ఇళ్లు, వసతులను పొందవచ్చనేది వారి అభిప్రాయం. అయితే గ్రీనరీతో పాటు విద్యుత్, నీటి వినియోగాన్ని ఆదా చేసే ప్రాజెక్ట్‌లు, సౌర ఫలకాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉండే ఇళ్లను కోరుకుంటున్నారు.పెరిగిన పట్టణ గృహ యజమానులు.. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్ విధానంతో యువ ఉద్యోగులు ఆఫీసులో కూర్చొని పనిచేసే అవసరం లేదు. వారు ఇప్పుడు తమ పనికి కాకుండా జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వారికి నచ్చిన ప్రాంతంలో నివసించే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల అభిరుచులతో గృహ కొనుగోలుదారుల్లో మార్పులు వచ్చాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కీలకమైన వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 2020లో పట్టణ గృహ యజమానుల రేటు 65 శాతంగా ఉండగా.. 2025 నాటికి 72 శాతానికి పెరుగుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. సరసమైన గృహ రుణాలు, నివాస సముదాయంలో యువ కొనుగోలుదారుల ప్రాధాన్యతే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు.
కాగ్నిజెంట్ సరికొత్త ఎత్తుగడ.. ప్రత్యర్థులకు దడ!
ప్రముఖ బహుళజాతి ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) భారత్‌లోని తమ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును (retirement age) 58 నుండి 60 సంవత్సరాలకు పెంచింది. విస్తృత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.పేరోల్‌లో ఎలాంటి మార్పు లేకుండా ఆన్-సైట్లో బదిలీ అయిన వారితో సహా దేశంలోని కాగ్నిజెంట్ ఉద్యోగులందరికీ ఈ మార్పు వర్తిస్తుంది. అనుభవజ్ఞులను నిలుపుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మెమోలో వివరించింది.దేశంలోని చాలా ఐటీ కంపెనీల్లో (IT Company) ప్రస్తుతం పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలుగా ఉంది. అయితే రిటైర్మెంట్ వయసును పెంచుతూ కాగ్నిజెంట్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో పోటీతత్వ ప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి. అనుభవజ్ఞులైన నిపుణులను సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీకి ఆస్కారం ఏర్పడుతుంది.చిన్న నగరాలపై దృష్టిభారత్లో జరిగిన ఒక కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. కంపెనీ ప్రపంచ కార్యకలాపాలలో భారత్ పాత్ర ఉంటుందన్నది వివరించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుండి ఇటీవల ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2025 అవార్డును అందుకున్న రవి, గ్లోబల్ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌లో భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.“కాగ్నిజెంట్ చాలా పెద్ద కంపెనీ. భారత్‌లో మాకు 250,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంతకుముందు, మేము పెద్ద నగరాల నుండి ఆపరేట్ చేశాము. ఇప్పుడు మేము చిన్న నగరాల నుండి ఆపరేట్ చేస్తున్నాము. మా ప్రయత్నం చిన్న నగరాలకు తీసుకెళ్లడం, కాబట్టి మేము ఇండోర్‌లో ప్రారంభించాము” అని పేర్కొన్నారు.పదవీ విరమణ వయస్సును పెంచడంతోపాటు భారత్-ఆధారిత ప్రతిభ వ్యూహాన్ని రెట్టింపు చేయడం ద్వారా గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న భారత్‌కు సహకారం అందిస్తూనే ప్రపంచ ఐటీ సేవల మార్కెట్లో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని కాగ్నిజెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఫ్యామిలీ
నేలకు చుక్కలు
ఒకప్పటి రోజుల్లో ఇంటి ఇల్లాలు ΄పొద్దున్నే లేవగానే చేసే పని,,, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేయడం. వెసులుబాటును బట్టి, సందర్భాన్ని బట్టీ చిన్న ముగ్గెయ్యాలో... పెద్ద ముగ్గెయ్యాలో... చుక్కల ముగ్గు పెట్టాలో, గీతల ముగ్గు వెయ్యాలో ముందే అనుకునేవారు. ఇక సంక్రాంతి నెల వచ్చిందంటే పోటా పోటీలుగా ముగ్గులు వేసేవారు. పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు కూడా పెట్టేవాళ్లు. ముగ్గుల మీద కార్టూన్లు కూడా బాగానే పడేవి. ఇక ముగ్గులోకి దించటం, ముగ్గు΄పొయ్యటం లాంటి జాతీయాలు, ముత్యాల ముగ్గు లాంటి సినిమాల సంగతి సరేసరి. ముగ్గులు ఒకప్పుడు శుభాశుభ సంకేతాలుగా పనిచేసేవి. పూర్వం సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు రోజూ ఇల్లిల్లూ తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటిలోకి అడుగుపెట్టేవారు కాదు. వారే కాదు యాచకులు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్లేవారు కాదు! ఎందుకంటే, ఇంటి వాకిట్లో ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. ధనుర్మాసంలో ప్రతి ఇంటిముందు తెల్లవారుఝామున ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజించడం ఆచారం. ఎందుకంటే గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుందని విశ్వాసం.గొబ్బియల్లో... గొబ్బియల్లోముగ్గులకు ఎంత ప్రాధాన్యముందో, ముగ్గులలో పెట్టే గొబ్బిళ్లు లేదా గొబ్బెమ్మలకు కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు తెలుగువాళ్లు. ఎందుకంటే గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపాలకి సంకేతంగా భావిస్తారు. ముగ్గుమధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లి అవుతుందని విశ్వాసం. గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ గొబ్బియెల్లో గొబ్బియెల్లో.. అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికలకి ఉన్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు.గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టేనని భావిస్తారు. శ్రీ కృష్ణుడి చుట్టూ గోపికలు ఎలా అయితే చేరి పాటలు పాడి సరదాగా నృత్యాలు చేస్తారో,, అలాగే గొబ్బిళ్ళ చుట్టూ కూడా చేరి పాటలు పాడుతారు.– డి.వి.ఆర్. భాస్కర్
వచ్చాడు బసవన్న
ఉదయం పూట చెట్ల కొమ్మలపై మంచుపూలు స్వాగతం పలుకుతుండగా సన్నాయి రాగం మధురంగా వినిపిస్తుంది. చేగంట మోగుతుండగా బసవన్న పాట వినిపిస్తుంది... ‘డూ డూ బసవన్నా ఇటురారా బసవన్నా/ఉరుకుతూ రారన్న రారన్న బసవన్నా/అమ్మవారికి దండం బెట్టు అయ్యగారికి దండం బెట్టు/రారా బసవన్నా... రారా బసవన్నా....’గంగిరెద్దులు ఊళ్లోకి అడుగు పెడితే ఊరికి సంక్రాంతి కళ సంపూర్ణంగా వచ్చినట్లే. విశేషం ఏమిటంటే... గంగిరెద్దుల ముందు పెద్దలు చిన్న పిల్లలై పోతారు. ‘దీవించు బసవన్నా’ అంటూ పిల్లలు పెద్దలై భక్తిపారవశ్యంతో మొక్కుతారు. కాలం ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో కళలు వెనక్కి పోతూ చరిత్రలో కలిసిపోయాయి. అయితే గంగిరెద్దుల ఆట అలా కాదు. కాలంతో పాటు నిలుస్తోంది. ‘ఇది మన కాలం ఆట’ అనిపిస్తోంది...కొత్త కాలానికి... కొత్త చరణాలుకాలంతో పాటు బసవన్న పాటలోకి కొత్త చరణాలు వస్తుంటాయి. సందర్భాన్ని బట్టి ఆ పాటలో చరణాలు భాగం అవుతుంటాయి. ఒక ఊళ్లో... సంక్రాంతి సెలవులకు వచ్చిన పిల్లాడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది ఎన్నో సంవత్సరాల చేదు జ్ఞాపకం అయినా సరే, ఊళ్లో సంక్రాంతి రోజు ప్రతి ఇల్లు పండగ కళతో కళకళలాడినట్లు ఆ ఇల్లు కనిపించదు. జ్ఞాపకాల దుఃఖభారంతో కనిపిస్తుంది. ఆ భారం నుంచి ఆ ఇంటి వాళ్లను తప్పించడానికి బసవడు ఆడుతాడు పాడుతాడు. ‘నవ్వించు బసవన్న నవ్వించు/అమ్మ వారికి దండం పెట్టి నవ్వించు/అయ్యవారికి దండం పెట్టి నవ్వించు/ వాళ్లు హాయిగా ఉండేలా దీవించు..ఆ దీవెన ఎంతో పవర్‌పుల్.పండగపూట బసవన్న ఇంటిముందుకు రాగానే బియ్యం లేదా పాత బట్టలతో రావడం ఒక విషయం అయితే... భవిష్యత్ వాణి అడగడం, ఆశీర్వాదం ఒక మరో విషయం. గంగిరెద్దులాయన సంచిలో బియ్యం పోస్తు ‘మా అబ్బాయికి ఈ సంవత్సరమన్నా ఉద్యోగం వస్తుందా బసవన్నా’ అని అడుగుతుంది ఒక అమ్మ, ‘అవును’ అన్నట్లు తల ఆడిస్తుంది. ‘మా తల్లే’ అని కంటినిండా సంతోషంతో గంగిరెద్దు కాళ్లు మొక్కుతుంది ఆ అమ్మ. గంగిరెద్దుల ఆటలో విశేషం ఏమిటంటే, తెలుగు ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ప్రత్యేతలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో గంగిరెద్దుల వారి పాటల్లో తత్వం ధ్వనిస్తుంది. సామాజిక విశ్లేషణ ఉంటుంది. ఉదా: ‘దేవా! ఏమి జరుగుతున్నది ప్రపంచం/అహో! ఏం చిత్రంగున్నదీ ప్రపంచం/ పసుపురాత తగ్గిపోయి....΄పౌడరు రాతలెక్కువాయె’...సంక్రాంతి రోజుల్లో బసవన్నల విన్యాసాలకు ప్రత్యేకంగా రంగస్థలం అక్కర్లేదు. ఊళ్లోకి అడుగుపెడితే... అణువణువూ ఆ కళకు రంగస్థలమే. మనసంతా ఉల్లాసమే. తరతరాల నుంచి ప్రతి తరానికి దివ్యమై అనుభవమే.– బోణం గణేష్, సాక్షి, అమరావతి
జీన్స్ తొడుక్కుని స్క్వాటింగ్ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్
ఆధునిక కాలంలో జీన్స్ ప్యాంట్లు లేనిదే కాలం గడవదు. ట్రెండ్‌కు,ఫ్యాషన్‌కు తగ్గట్టు అనేక రకాల జీన్స్ ప్యాంట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువగా జీన్ ప్యాంట్లను వినియోగిస్తారు. ఆఫీసులకు, బయటికి వెళ్లినప్పుడు, పార్టీలకు ఇలా ఏదైనా జీన్స్ ప్యాంట్లకే ప్రాధాన్యత ఉంటుంది. అన్ని వయసుల వారికి ఫిట్ అయ్యే జీన్స్ అనేవి చాలా పాపులర్. అనేక రకాల మోడల్స్‌లో ఇవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ధరించడం వలన చాలా కంఫర్ట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వీటిని ఉతుక్కోవడం ఈజీ కావడం కూడా వీటికి ఆదరణ ఎక్కువ. కానీ జీన్స్పాంట్లు వేసుకున్నపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు వేసుకుని కూర్చునేవారు పైకి లేవగానే నడవలేని పరిస్థితి వచ్చేందుకూ అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇక వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ అస్సలు తొడుక్కోవద్దనీ, వాటిని తొడిగి ‘స్క్వాటింగ్’ ఎక్సర్సైజ్ చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. అవే కాకుండా బాగా బిగుతుగా ఉండే జీన్స్ వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశముందని కూడా మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.జీన్స్ ప్యాంట్లు బాగా టైట్‌గా ఉండే జీన్స్ ప్యాంట్ ధరించి పడుకుంటే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో దురదలు, చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు వస్తాయి. రక్తప్రసరణకు కష్టం : జీన్స్ ప్యాంట్ బిగుతుగా ఉండటంతో రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో కొన్ని అవయవాలకు రక్తం సరిగా అందదు. జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రించడం వల్ల శరీరంలోని వేడీ పెరుగుతుంది. పేగుల కదలికకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది.
జుట్టు రాలిపోతోందా? డోంట్ వర్రీ..టీ వాటర్‌తో ఇలా చేస్తే..!
Tea Water for Hair: జుట్టు రాలడం చాలా సహజమైనదే. అయితే ఎప్పడికప్పుడు కొత్త జుట్టు వస్తూ ఉంటుంది. జుట్టు రాలిన విషయంమనకు తెలియకుండానే ఈప్రక్రియ జరిగిపోతుంది.అయితే అకారణంగా, చాలా ఎక్కువగా జుట్టురాలిపోవడం ఆందోలన కలిగించే అంశం. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. దీనిని ఎదుర్కోవడానికి లెక్కలేనన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజమైన పద్ధతులను ఎంచుకోవడం మంచిది. అలాంటి వాటిట్లో ఒకటి టీ నీటితో జుట్టును కడగడం. యాంటీఆక్సిడెంట్లు , పోషకాలతో సమృద్ధిగా ఉన్న టీ, జుట్టును బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మాడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరి దీని తయారీ, ఎలా ఉపయోగించాలో చూద్దాం.టీ వాటర్ ఎలా తయారు చేయాలిహెయిర్ వాష్ కోసం టీ వాటర్ ను తయారు చేయడం చాలా సులభంకావాల్సిన పదార్థాలు:2–3 టీ బ్యాగులు (బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ)2–3 కప్పుల నీరుకావాలంటే ఇందులో లావెండర్ లేదా రోజ్మేరీ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఎలా తయారు చేయాలి? ఎలావాడాలి?నీటిని మరిగించి, అందులో టీ బ్యాగులను 5–10 నిమిషాలు నానబెట్టాలి.ఇందులో కొద్దిగా లావెండర్, రోజ్మేరీ ఆయిల్ చుక్కలు కలపాలి.చల్లారిన తరువాత టీ నీటిని శుభ్రమైన స్ప్రే బాటిల్ లేదా కంటైనర్‌లో పోసుకోవాలి.ఇపుడు తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును శుభ్రంగా వాష్ చేయాలి.షాంపూ చేసిన తర్వాత జుట్టుంతా తడిచేలా స్ప్రే చేయాలి. తర్వాత 5–10 నిమిషాలు పాటు చేతులతో సున్నితంగా మసాజ్ చేయాలి.15-20 నిమిషాలు పాటు ఉంచుకుని సాధారణ నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియోప్రయోజనాలు జుట్టు సిల్కీగాఅవుతుంది. కొత్త మెరుపువస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది, యాంటీఆక్సిడెంట్లు ,కెఫిన్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.మాడు ఆరోగ్యానికి కూడా మంచిది. చుండ్రు, దురద లాంటి సమస్యలు తగ్గుతాయి. టీ వాటర్ జుట్టు క్యూటికల్‌ను మూసివేస్తుంది.కెఫిన్ కారణంగా రక్త ప్రసరణ బాగా జరిగిన జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుంది. హెయిర్ ఫోలికల్స్ ను ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఇది ఈ హార్మోన్ల ప్రభావాలను తగ్గించి జుట్టు రాలడాన్ని నిరోధించే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. కనుక ఈ ప్రక్రియ చాలామంచిది. జుట్టు చిట్లడం అనే సమస్యను కూడా దూరం చేస్తాయి.ఇదీ చదవండి : Sankranti 2025: పండక కళ, పేస్ గ్లో కోసం ఇలా చేయండి!
ఫొటోలు
National View all
Bus Accident: నలుగురు దుర్మరణం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్(Uttarakhand)లో జరి
మీరు అలా చేస్తే.. నేను పోటీనే చేయను: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే..
మహాకుంభ్‌కు వింత బాబాలు.. షాకవుతున్న జనం
భారతదేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (
80 మంది విద్యార్థునుల పట్ల స్కూల్ ప్రిన్సిపల్ పైశాచికత్వం!
ధన్‌బాద్: ఓ ప్రైవేట్ స్క
International View all
ఇరాన్ సంచలన నిర్ణయం? మారనున్న రాజధాని?
ఇరాన్ తన పొరుగు దేశమైన ఇజ్రాయెల్‌తోనూ, అగ్రరాజ్యం అమెరికాతోనూ ఉన్న వివాదం క
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (
ప్రాంక్ అని చెప్పి నిజమైన పెళ్లి..
రీల్స్, ఇన్‌స్ట్రాగామ్ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు.
మ్యాథ్స్ మహారాణి
గణితం అంటేనే ఆమడదూరం పరిగెత్తేవాళ్లు మనలో చాలా మందే ఉన్నారు.
దుమ్ము దుప్పట్లో విలాస నగరం
వాషింగ్టన్: ఆరు చోట్ల ఆరని పెను జ్వాలలు, కమ్మేసిన దుమ్ము, ధ
NRI View all
17 ప్రేమ జంటలకు టోకరా ఇచ్చిన ఎన్ఆర్ఐ మహిళ : 20 ఏళ్ల నుంచి దందా
ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను త
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి కార్యక్రమం ఘనంగా
సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ (SDBBS) శాస్త ప్రీతి (నూతన సంవత్సరంలో జరిగే తొలి కార్యక్రమము) ని జనవరి 5న ఘనంగా నిర్వహి
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula)
న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..
ముంబైలో కనిపిస్తాయి డబ్బావాలా ఫుడ్ బిజినెస్‌లు.
క్రైమ్
సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు
జవహర్‌నగర్: ‘సంక్రాంతికి వస్తా..నీవు ఆరోగ్యంగా ఉండు. నాకు చిన్న పని ఉంది చూసుకుని రేపు ఇంటికి బయలుదేరి వస్తా. పండగ అయ్యాక మనమిద్దరం కలిసి బియ్యం తీసుకుని హైదరాబాద్‌కు వెళ్దాం..’ అని గర్భవతి అయిన భార్యతో ఫోన్లో మాట్లాడి వెళ్లిన కొన్ని గంటలకే ఆ ఇంటి యజమాని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కరెంటు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందాడు. జవహర్‌నగర్ సీఐ సైదయ్య, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల బంజారా తండాకు చెందిన బానోతు ప్రశాంత్ (26), సరిత దంపతులు. వీరు సంతో నగర్లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ బాలాజీనగర్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ప్రశాంత్ శుక్రవారం సంతోష్‌నగర్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు తోటి కారి్మకులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో ఏఈ సాంబశివరావు, లైన్మెన్ నాగరాజుతో పాటు కాంట్రాక్టర్ రాజేశ్‌లు ఎల్సీ తీసుకున్నామని, మీరు పని పూర్తి చేయాలని చెప్పడంతో ప్రశాంత్ ఉదయం 10.20 నిమిషాల సమయంలో విద్యుత్ స్తంభం ఎక్కి వైర్ కట్‌చేస్తుండగా 11కేవీ తీగలు తగిలాయి. ప్రశాంత్ స్తంభంపైన పనిచేస్తుండగానే అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యుత్ సరఫరాను ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై ప్రశాంత్ మృతిచెందాడు. తోటి కార్మికులు, ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్యతో ఉదయం ఫోన్లో మాట్లాడిన కొద్దిసేపటికే..మృత్యువాత పడిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు అన్ని విధాలా ఆదుకోవాలని ఖమ్మం జిల్లా కామేపల్లి మండల మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ నాయక్ డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికుని కుటుంబానికి అన్నివిధాల ఆదుకుంటామని విద్యుత్ అధికారులు హమీ ఇచ్చారు. ప్రస్తుతానికి తక్షణ సహాయంగా రూ.10 లక్షలు ఇస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్ ప్రకటించారు. పండక్కి ఊరికి వస్తానంటివే.!
మీరట్‌లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్‌షీట్‌లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు.
వైఎస్ అభిషేక్‌రెడ్డి మృతి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి (36) శుక్రవారం మృతి చెందారు. ఇతను వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు(వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి కుమారుడు). కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.హైదరాబాద్ నుంచి ఆయన పారి్థవదేహం రాత్రి పొద్దుపోయాక పులివెందుల చేరుకుంది. సౌమ్యుడు, వివాద రహితుడు, ఉన్నత విద్యావంతుడిగా అభిషేక్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. సన్నీగా ఈ ప్రాంత వాసులకు సుపరిచితుడు. ఆర్థోపెడిక్స్ వైద్యుడిగా రాణిస్తూనే రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరించారు. శనివారం మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం పులివెందులలోని స్వగృహంలో అభిషేక్‌రెడ్డి పారి్థవదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం పులివెందులలోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. అభిషేక్‌రెడ్డి మృతితో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా, వైఎస్ అభిషేక్‌రెడ్డికి భార్య డాక్టర్ సౌఖ్య, పిల్లలు వైఎస్ అక్షర, వైఎస్ ఆకర్ష ఉన్నారు.
పండుగ ముందు పెను విషాదం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మరణించారు. పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం బయలుదేరిన కూలీలు గమ్యం చేరకముందే అనంతలోకాలకు చేరుకున్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని సోదరుడితో తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు మరణించగా.. స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొనటంతో భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందాడు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.ఐదుగురు వలస కూలీలు దుర్మరణంరోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 32 మంది వలస కూలీలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుప్త ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు గురువారం సాయంత్రం 4 గంటలకు బయలు దేరారు.ఐలాపురం గ్రామ శివారులో ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఇసుక లారీ టైరు పంక్చర్ కావడంతో పక్కకు నిలిపారు. ఆ లారీని ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గరడ సునీల్ (40), ఒడిశాకు చెందిన కూలీలు రూపు హరిజన్ (51), సుల హరిజన్ (46), సునమని హరిజన్ (61) అక్కడికక్కడే మృతిచెందగా, ప్రత్యూష్ ప్రభాత్ హరిజన్ (17) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. బస్సు ఢీకొట్టిన వేగానికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. జన్మదినం రోజే మృత్యు ఒడిలోకి..పెద్దపల్లి మండలం రంగాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన అనవేన అభిలాష్ (19), కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన చుంచు రాజ్‌కుమార్ (20) మరణించారు. వీరిద్దరూ అక్కాచెల్లెళ్ల కొడుకులు. చుంచు రాజ్‌కుమార్ జన్మదినం కావడంతో అప్పన్నపేటలోని అభిలాష్‌తో కలిసి బైక్‌పై గుండారంలోని స్నేహితుల వద్దకు వెళ్లారు. అక్కడ వేడుక చేసుకొని తిరిగి వస్తుండగా రంగాపూర్ శివారులో ట్రాన్స్‌కోకు చెందిన బొలేరో వాహనాన్ని బైక్‌తో బలంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అభిలాష్ అక్కడికక్కడే మరణించగా, రాజ్‌కుమార్‌ను కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. జగిత్యాల – ధర్మపురి జాతీయ రహదారిపై తక్కళ్లపల్లి శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన బూతగడ్డ అరవింద్ (21), బత్తుల సాయి (22), మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దయ్యాల వంశీ (22) దుర్మరణం చెందారు. వంశీ 15 రోజుల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. మనుమడి బారసాలకు వెళ్లి వస్తూ.. మనుమడి బారసాల వేడుకలు జరుపుకొని తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ – సూర్యాపేట రహదారిపై కొడకండ్ల మండలం మైదంచెరువు తండ వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. నాగారం మండలం ఈటూరుకు చెందిన పేరాల వెంకన్నలక్ష్మి దంపతుల కుమారుడైన యుగంధర్‌కు కుమారుడు జన్మించగా గురువారం దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో బారసాల వేడుక జరిగింది.ఈ వేడుకకు వెంకన్న కుటుంబసభ్యులు, బంధువులంతా తుఫాన్ వాహనంలో వెళ్లారు. వేడుకల అనంతరం అదే వాహనంలో రాత్రి ఈటూరుకు తిరిగి వస్తుండగా మైదంచెరువు తండా శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉన్న డీసీఎం వాహనాన్ని తుపాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పేరాల వెంకన్న (45) అతని తమ్ముడి భార్య పేరాల జ్యోతి (35) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ పేరాల ఊషయ్య, పేరాల లక్ష్మి, వంగూరి నర్సమ్మ, పేరాల లావణ్య, ఉప్పలమ్మ, ముత్యాలును జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పేరాల లక్ష్మి, పేరాల ఊషయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. స్నేహితులను కబలించిన లారీ మెదక్ జిల్లా నర్సాపూర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మరణించారు. శివ్వంపేట మండలం అల్లీపూర్‌కు చెందిన పిట్ల నాగరాజు (25), కమ్మరి దుర్గాప్రసాద్(25) స్నేహితులు. నాగరాజు తాను పనిచేసే కొంపల్లిలోని ఓ పౌల్ట్రీ కార్యాలయానికి దుర్గాప్రసాద్‌తో కలసి బైక్‌పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా నర్సాపూర్ ఎస్బీఐ సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు తుదిశ్వాస విడిచాడు. ఈ రెండు కుటుంబాలకు వీరు ఒక్కొక్కరే సంతానం కావటం గమనార్హంభార్య కళ్లెదుటే భర్త మృతిస్కూటీని లారీ ఢీకొట్టడంతో భార్య కళ్లెదుటే భర్త మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట కలెక్టరేట్ వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ఎర్రవెళ్లి బాలకిష్టయ్య (59)కు బెజ్జంకి మండలం గుగ్గిళ్లకు చెందిన ఓ వ్యక్తితో వ్యవసాయ బావి విషయంలో భూ వివాదం ఉంది. వివాదం పరిష్కారం కోసం 20 రోజులుగా కలెక్టరేట్ చుట్టూ దంపతులిద్దరూ తిరుగుతున్నారు. శుక్రవారం అదే పని మీద వీరు స్కూటీపై కలెక్టరేట్‌కు వెళ్తుండగా, కలెక్టరేట్ ఎదుట వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టి.. స్కూటీని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలై బాలకిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రేణుకకు స్వల్ప గాయాలయ్యాయి. రేణుక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.