Chunky Pandey
-
లైగర్ తర్వాత నాన్నను సలహాలివ్వొద్దన్నా: అనన్య పాండే
వందకోట్లేంటి.. వెయ్యికోట్లు గ్యారెంటీ.. అనుకున్న సినిమాలు కూడా కొన్నిసార్లు బొక్కబోర్లా పడతాయి. అలాంటి కోవలోకే వస్తుంది విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా చేయమని తన తండ్రి చుంకీ పాండే సలహా ఇచ్చినట్లున్నాడు. ఆ మూవీ బెడిసికొట్టడంతో తనకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వద్దంటోంది అనన్య.స్క్రిప్ట్ సెలక్షన్లో జాగ్రత్త..తాజాగా అనన్య, చుంకీ పాండే 'బి ఎ పేరెంట్ యార్' అనే షోలో పాల్గొన్నారు. అనన్య మంచి నటి అనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు ఇంట్లోనా? స్క్రీన్‌పైనా? అని చుంకీ సరదాగా బదులిచ్చాడు. స్క్రిప్టులు సెలక్ట్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని చుంకీ అనగా.. లైగర్ సినిమా తర్వాత నువ్వు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదని చెప్పానుగా అని అనన్య హెచ్చరించింది.చదవకుండానే లైక్ కొడతాడుఇంకా మాట్లాడుతూ.. నాన్న ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాడు. పోస్టులు చదవకుండానే లైక్ కొడుతుంటాడు. ఇలాంటివి చేసి ఇబ్బందుల్లో పడే కన్నా ఆయన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయడమే మేలు అని పేర్కొంది. ఇంతలో చుంకీ కలగజేసుకుంటూ.. నీ ఫోటో ఎక్కడ కనిపిస్తే అక్కడ నేను లైక్ కొడుతున్నానంతే అని చెప్పాడు. అది నా అదృష్టంనెపోటిజం గురించి అనన్య మాట్లాడుతూ.. ఈ రోజుల్లో నెపోటిజం అనేదాన్ని పెద్ద బూతుగా చూస్తున్నారు. ఏదేమైనా ఆయనకు కూతురుగా పుట్టడం నా అదృష్టం. అందుకు నేను గర్వంగా ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే చుంకీ పాండే ప్రస్తుతం హౌస్‌ఫుల్ 5 సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది జూన్ 6న విడుదల కానుంది. అనన్య.. కంట్రోల్ సినిమాతో పాటు కాల్ మీ బే వెబ్ సిరీస్‌తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించింది.చదవండి: బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే! -
అనన్యా పాండే వేసుకునే దుస్తుల ధర ఎంతో తెలుసా..?
స్టార్ కిడ్స్ అయినా స్పార్క్ లేకపోతే ఇండస్ట్రీలో ఫేడౌట్ అయిపోతారు. ఆ స్పార్క్ ఉంది కాబట్టే అనన్య తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. ఆ మార్క్ నటనలోనే కాదు ఆమె ఫాలో అయ్యే ఫ్యాషన్‌లోనూ కనబడుతోంది ఇలా... కెరీర్ మొదట్లో ఇతరులు మెచ్చే డ్రెసెస్ వేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు నచ్చే..నప్పే డ్రెస్సులే వేసుకుంటున్నా. నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాటిని పట్టించుకోవడం మానేశా. నాకు నచ్చిన బట్టలు వేసుకున్నానా, ఫొటోలు బాగొస్తున్నాయా? హ్యాపీగా ఉన్నానా.. లేదా అని మాత్రమే చూసుకుంటున్నా.. అదే నాకు ముఖ్యం కూడా. – అనన్యా పాండే దేవనాగరి.. ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్ ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. ధర కాస్త ఎక్కువగానే (రూ. 85,500) ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. ఆమ్రపాలి జ్యూయెలరీ.. నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, వాటి నకలును రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ని ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, వాటి ఇమిటేషన్ పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా ఈ జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
ఆమె అలాగే కనిపించాలి.. ట్రోలింగ్‌పై అనన్య తండ్రి షాకింగ్ కామెంట్స్
Chunky Panday Reacts To Trolls His Daughter Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇటీవల దర్శకనిర్మాత హోస్ట్ చేసిన పార్టీలో దర్శనమిచ్చింది. ఆ పార్టీలో ఆమె ధరించిన బ్లాక్ డ్రెస్‌తో ట్రోలింగ్ గురైంది. అనన్య బోల్డ్ డ్రెస్ వేసుకోవడంతో నెటిజన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై అనన్య తండ్రి చుంకీ పాండే స్పందించారు. అనన్య ఎలాంటి దుస్తులు ధరించాలో తానెప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. తాను అతని భార్య తమ పిల్లలకు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏవి వేసుకోకూడదు అని ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని వివరించారు. చదవండి: ఇదేం ఎక్స్పోజింగ్.. హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు 'మేము మా ఇద్దరు కూతుళ్లను చాలా బాగా పెంచాం. వారు చాలా తెలివైనవారు. అనన్య ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో ఉంది. ఆమె గ్లామరస్‌గా కనిపించాలి. అది ఆమెకు అవసరం. నేను కచ్చితంగా చెప్పగలను మా పిల్లలు వల్గర్‌గా కనిపించకుండా దుస్తులు ధరించగలరు. నేను అనన్యతో చెప్పాను ఏదేమైనా ప్రజలైతే నీ గురించి మంచిగా అయినా చెడ్డగా అయినా మాట్లాడుకుంటున్నారు' అని చుంకీ పాండే తెలిపారు. చదవండి: పార్టీలో హీరోయిన్‌తో విజయ్ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ చుంకీ పాండే, భావన దంపతులకు అనన్య, రైసా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పార్టీ ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ పార్టీకి రౌడీ హీరో విజయ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ, అనన్య కూడా పార్టీలో తళుక్కున మెరిశారు. అయితే అనన్య వేసుకున్న డ్రెస్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాను కాపీ కొడుతున్నావా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
'లైగర్' హీరోయిన్ ఇంట విషాదం, కన్నీటితో వీడ్కోలు
హీరోయిన్ అనన్య పాండే ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ, నటుడు చుంకీ పాండే తల్లి స్నేహలత(85) పాండే శనివారం తుది శ్వాస విడిచింది. దీంతో అనన్య ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. నానమ్మను అంటిపెట్టుకుని ఉండే అనన్య ఆమె ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోయింది. సోషల్ మీడియా వేదికగా ఆమెకు కన్నీటి నివాళులు అర్పించింది. "రెస్ట్ ఇన్ పవర్ మై ఏంజెల్. మా నానమ్మకు పుట్టుకతోనే గుండెలోని ఒక కవాటం సరిగా లేదు. దీంతో ఆమె ఎక్కువ కాలం బతకలేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. కానీ మా దాదీ బతికి చూపించింది. 85 ఏళ్ల వయసులోనూ తను అలుపెరగకుండా పని చేసేది. ప్దొదున్నే ఏడు గంటలకల్లా రెడీ అయి పనికి వెళ్తుంటే నేను ఆశ్చర్యపోయేదాన్ని. ప్రతిరోజు ఆమె నుంచి స్ఫూర్తి పొందుతూనే వచ్చాను. ఆమె చేతిలో పెరిగి ఇంతటిదాన్ని అయినందుకు చాలా గర్వంగా ఉంది" అని అనన్య పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. నానమ్మతో కలిసి దిగిన చిన్ననాటి ఫొటోలను కూడా షేర్ చేసింది. కాగా అనన్య తెలుగులో 'లైగర్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) -
మా అభిమాన భార్య కరణ్ జోహార్యే..!
ముంబై: బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రోడక్షన్లో నిర్మించిన ‘ది ఫ్యాబులస్ లైఫ్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ సిరీస్ గత శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ రియాలిటీ షోలో ప్రముఖ బాలీవుడ్ నటుల భార్యలు కథానాయికలకు నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటొంది. ఇందులో సోహై ఖాన్(సల్మాన్ ఖాన్ సోదరుడు) భార్య సీమా ఖాన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రసారమైన నాలుగవ ఎపీసోడ్‌లో సీమా-సోహైల్ ఖాన్‌లను నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ షో నిర్మాత కరణ్ జోహార్ కూడా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అది చూసిన కరణ్ తనదైన శైలీలో ట్రోలర్‌కు సమాధానం ఇచ్చాడు. (చదవండి: రియాలిటీ షో: వారిద్దరూ కలిసుండటం లేదా!) Ok this really made me laugh! 🤣 A troll with a sense of humour is so refreshing! Thanks Doc! https://t.co/nuelRifxzI — Karan Johar (@karanjohar) November 29, 2020 అయితే ఈ వెబ్ సిరీస్‌పై డాక్టర్ అఖిలేష్ గాంధీ అనే ట్విటర్ యూజర్ కరణ్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఫ్యాబులస్ లైప్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్లో మన అభిమాన భార్య కరణ్ జోహార్ అని మనమంతా అంగీకరించక తప్పదని నా అభిప్రాయం’ అంటూ కామెంట్ చేశాడు. అది చూసిన కరణ్ సదరు నెటిజన్ కామెంట్‌పై స్పందిస్తూ.. ‘ఓకె నీ ట్వీట్ నిజంగా నన్ను నవ్వించింది. ఈ ట్రోల్ నన్ను రీఫ్రెష్ చేసింది. ధన్యవాదలు మిస్టర్ డాక్టర్’ అంటూ కరణ్ చురకలు అట్టించారు. కాగా కరణ్ జోహార్, అపూర్వ మెహతాలు కలిసి ‘ది ఫ్యాబులస్ లైఫ్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ రియాలిటీ షోను రూపొందించారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటులు సోహైల్ ఖాన్ భార్య నీలం ఖాన్, సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్, చుంకీ పాండే భార్య భావన పాండే, సమీర్ సోనీ భార్య నీలం కొఠారీలు నటిస్తున్నారు. -
‘బాహుబలి నా ముందు మోకాళ్లపై!’
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాహో ఫీవర్ నడుస్తోంది. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలలోనూ ఈ సినిమాకు సంబంధించి భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నటులు పెద్ద సంఖ్యలో నటించిన ఈ సినిమాకు అక్కడ మీడియా కూడా మంచి కవరేజ్ ఇస్తోంది. తాజాగా సాహోలో నటించిన బాలీవుడ్ నటుడు చంకీ పాండే సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభాస్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ‘ప్రభాస్ అంత వినయం ఉన్న స్టార్ హీరోను ఇంత వరకు చూడలేదు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ముంబై నుంచి వచ్చిన నటులు షూటింగ్ పూర్తి చేసుకొని హోటల్స్‌కు వెళ్లే వరకు ప్రభాస్ సెట్ లోనే ఉండేవారు. ముఖ్యంగా సినిమాలో ఓ సన్నివేశంలో ప్రభాస్ నా ముందు మోకాళ్ల మీద కూర్చుంటాడు. అప్పుడు నాకు బాహుబలి నా ముందుకు మోకరిల్లినట్టుగా అనిపించింది’ అన్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన సాహో సినిమాకు సుజిత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. -
నిజానికి అప్పుడే చచ్చిపోవాల్సింది :హీరోయిన్
సినిమాలో చూపించని సీన్ కోసం తాను చావు అంచుల దాకా వెళ్లాల్సింది వచ్చిందని హీరోయిన్ అనన్య పాండే అన్నారు. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్- 2’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్లో రిస్కీ షాట్‌కు ప్రయత్నించినందుకు వల్ల.. తాను గాయపడినట్లు అనన్య పేర్కొన్నారు. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ చావు అంచుల దాకా వెళ్లాను. నిజానికి అప్పుడే చచ్చిపోవాల్సింది. కానీ ఎయిర్‌బ్యాగ్స్ తెరచుకోవడంతో బతికి పోయాను. నన్ను కాపాడేందుకు టైగర్ ముందుకు వచ్చాడు. కానీ కారు పేలిపోతుందనే భయంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. ప్రతీ ఒక్కరు నన్ను వదిలి వెళ్లిపోయారు. ఎన్నో భయంకర యాక్సిడెంట్ స్టోరీలు విన్నాను. అయితే తొలిసారి ప్రత్యక్షంగా ఆ అనుభవం ఎదుర్కొన్నా’ అని చెప్పుకొచ్చారు. చెట్టుకు కారు ఢీకొట్టడంతో తాను ప్రమాదానికి గురయ్యానని.. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నపుడు తన ముక్కు పగిలిందన్నారు. అయితే యూనిట్ వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని పేర్కొన్నారు. ఆ తర్వాత యథావిధిగా షూటింగ్లో పాల్గొన్నానన్నారు. ఇంత రిస్క్ తీసుకుంటే తీరా సినిమాలో అందుకు సంబంధించిన సీన్ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పుకొచ్చారు. కాగా 2012లో విడుదలైన సూపర్‌హిట్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సీక్వెల్‌గా తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ సినిమా అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. -
‘అందుకే నేను అదృష్టవంతుడిని అయ్యాను’
బాలీవుడ్ నటుడు చుంకీ పాండే- భావనా పాండే వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అనన్యా పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి. తల్లిదండ్రులతో కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోలను షేర్ చేసిన అనన్య..‘మొదటి పెళ్లిరోజు నుంచి నుంచి మీతోనే ఉన్నాను. మీ ఇద్దరికీ 21వ వివాహ వార్షిక శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో... ‘ అవును... మీ ముగ్గురు నా జీవితంలో ఉండటం వల్లే నేను అదృష్టవంతుడిని అయ్యాను’ అని చుంకీ పాండే.. తన గారాల పట్టి విషెస్‌కు బదులిచ్చారు. కాగా బాలీవుడ్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చుంకీ పాండే 1998లో భావనను పెళ్లాడాడు. వీరికి అనన్య, రీసా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె అనన్య ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. 2012లో విడుదలైన సూపర్‌హిట్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన ఓ హీరోయిన్గా అనన్య నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram Been around since the 1st one, happy 21st anniversary guys ❤️👼🏻 #DadYouGotLucky #Goals A post shared by Ananya 👩🏻🎓💫 (@ananyapanday) on Jan 16, 2019 at 11:21pm PST -
కి.. పోయి కృ.. వచ్చె
ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు హీరోయిన్ కృతీ కర్భందా. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో రానున్న ఫోర్త్ పార్ట్ ‘హౌస్‌పుల్ 4’లో ఆమె ఒక కథానాయికగా నటించనుండటమే ఇందుకు కారణం. ఫస్ట్ అండ్ సెకండ్ హౌస్ఫుల్స్కు దర్శకత్వం వహించిన సాజిద్ ఖాన్నే ‘హౌస్‌ఫుల్ 4’ను డైరెక్ట్ చేయనున్నారు. థర్డ్ పార్ట్‌కు సాజిద్ సామ్జీ అండ్ ఫర్హాద్ సామ్జీ కలిసి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, చుంకీ పాండే ముఖ్య తారలుగా నటించనున్న ‘హౌస్‌ఫుల్ 4’ టీమ్‌లోకి తాజాగా కృతీ కర్భందా ఎంపికయ్యారు. అక్షయ్‌కుమార్ సరసన ఈమె కనిపించనున్నారట. ‘‘బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ ఫ్రాంచైజీస్‌లో హౌస్‌ఫుల్ ఒకటి. ఇంతమంది స్టార్స్ ఉన్న సినిమాలో నేనింత వరకు నటించలేదు. అలాగే ఇలాంటి డిఫరెంట్ స్టోరీ కూడా నేను వినలేదు. ఈ సినిమాలో భాగమైనందుకు హ్యాపీ’’ అని పేర్కొన్నారు కృతీ. నిజానికి కియారా అద్వానీని అనుకున్న ప్లేస్‌లో ఫైనల్‌గా కృతీ భాగమయ్యారని బీటౌన్ టాక్. కి పోయి కృ వచ్చె అన్నమాట. ఇదివరకు ‘బోణి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ నెక్ట్స్ ‘తీన్మార్, బ్రూస్ లీ’ లాంటి సినిమాలతో తెలుగు తెరపై మెరిశారు. -
ప్రమాదం నుంచి బయటపడిన హీరోయిన్
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్- 2’ సినిమాతో హీరోయిన్గా పరిచయమవుతోన్న అనన్య షూటింగ్లో గాయపడినట్లు సమాచారం. చిత్రీకరణలో భాగంగా అనన్య కారు నడుపుతుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొన్నారు. ఊహించని పరిణామానికి అనన్య షాక్ గురైనట్లు సమాచారం. అయితే అనన్యకు పెద్దగా గాయాలేమీ కాలేదని, అయినప్పటికీ చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు యూనిట్ సిబ్బంది తెలిపారు. 2012లో విడుదలైన సూపర్‌హిట్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తుండగా అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరిలో షూటింగ్ జరుగుతోంది. -
నా కూతురు పుట్టుకతోనే నటి..
బాలీవుడ్‌లోకి మరో యువకథాయిక ఎంట్రీ ఇవ్వబోతోంది. అలనాటి హీరో చుంకీ పాండే పెద్ద కూతురు అనన్య పాండే సినీ అరంగేట్రం మొదలవనుంది. వస్తూ వస్తూనే యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన ఛాన్స్ కొట్టేసిందన్న వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. కరణ్ జోహార్ నిర్మాతగా పునిత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కెనున్న ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ సినిమాతో 19 ఏళ్ల అనన్య పాండే బాలీవుడ్‌కు పరిచయం కానున్నారని తెలుస్తోంది. ఆమె పుట్టుకతోనే నటి.. అనన్య టైగర్ ష్రాఫ్ పక్కన నటించనున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె తండ్రి చుంకీ పాండే సమాధానం దాటవేశారు. ‘నా కూతురు పుట్టుకతోనే నటి. ఆమె నటిగా జీవించడానికే పుట్టింది’ అంటూ చమత్కరించారు. సినిమాల్లో రాణించేందుకు ఆమె నటనలో శిక్షణ తీసుకుందని చుంకీ తెలిపారు. టైగర్ ష్రాఫ్ అద్భుతమైన నటుడని కితాబిచ్చారు. భాగీ-2 సినిమాలో అతని నటన అదిరిపోయిందంటూ టైగర్ని ప్రశంసించారు. అనన్య గతేడాది పారిస్‌లోని ‘లే బాల్ దేస్ డిబ్యూటాంటిస్’ ఫ్యాషన్ షోలో పాల్గొని తన అందంతో ఆకట్టుకుంది. -
ఆ నటుడి కూతురా? నమ్మలేం.. డీఎన్ఏ టెస్ట్ చేయండి!
బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య (18) ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. అనన్య ఫొటోను ఆమె తల్లి భావన పాండే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. కాసేపట్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారింది. అనన్య అందం అదుర్స్ అంటూ ఎంతోమంది నెటిజన్లు కితాబిచ్చారు. అయితే, అంతకుమించి అన్నట్టు ఈ ఫొటోపై బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ బాంబులాంటి కామెంట్ చేశారు. అనన్య చుంకీపాండే కూతురంటే నమ్మలేం.. డీఎన్ఏ పరీక్ష చేయించాలంటూ ఆమె పేర్కొన్నారు. సరదాగా ఆటపట్టించేందుకు ఆమె పెట్టిన ఈ కామెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. క్యూట్‌గా ఉన్న అనన్య ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1700లకుపైగా లైకులు వచ్చాయి. ఎంతోమంది కామెంట్ పెట్టారు. ఫర్హా ఖాన్ కూడా సరదాగా స్పందిస్తూ.. 'దయ చేసి డీఎన్ఏ పరీక్ష చేయించండి. తను చుంకీ కూతురంటే నమ్మలేం. చాలా లవ్లీగా ఉంది' అంటూ లాఫ్టర్ ఎమోజీతో కామెంట్ చేసింది. -
సాహోలో మరో బాలీవుడ్ స్టార్
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఒకే షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకోగా త్వరలోనే ప్రభాస్ సాహో యూనిట్‌తో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నటిస్తుండగా, తాజాగా మరో కీలక పాత్రకు బాలీవుడ్ నటుడ్ని ఎంపిక చేశారు. తేజాబ్, ఆంఖే లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు చుంకీ పాండే సాహోలో నటించనున్నాడు. ఇటీవల విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బేగంజాన్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చుంకీ పాండే మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. బాహుబలి తరువాత మరోసారి ప్రభాస్ జోడిగా అనుష్క నటిస్తుందని భావించినా.. అనుష్క సినిమాకు తగ్గట్టుగా రెడీ కాకపోవటంతో మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు.